E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

బిలియనీర్లను టార్గెట్ చేసే మోసగాళ్ల ముఠా… మైండ్ గేమ్స్ తో బుర్రపాడు ట్విస్టులు

బిలియనీర్లను టార్గెట్ చేసే మోసగాళ్ల ముఠా… మైండ్ గేమ్స్ తో బుర్రపాడు ట్విస్టులు
Advertisement

Crime Thriller : మనం ఇప్పటిదాకా ఎన్నో హీస్ట్ థ్రిల్లర్లను చూశాము. కానీ ఏకంగా బిలియనీర్లను మాత్రమే టార్గెట్ చేసే ఖిలాడీలు, తల్లీకొడుకుల ముసుగులో లవర్స్ చేసే అరాచకాలను మాత్రం పక్కాగా చూసి ఉండరు. అలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీతో రూపొందిన సినిమానే షార్పర్ (Sharper). 2023లో వచ్చిన ఈ మూవీ ఆపిల్ టీవీ ప్లస్ (Apple TV+) లో అందుబాటులో ఉన్న ఒక మైండ్-బెండింగ్ నియో-నోయిర్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. న్యూయార్క్ నగరంలోని అత్యంత సంపన్నులను టార్గెట్ చేస్తూ సాగే మోసాలు, కుట్రలు, ఒకరిని మించి మరొకరు ఆడే మైండ్ గేమ్స్ చుట్టూ సీట్ ఎడ్జ్ థ్రిల్ ఇస్తాయి.

కథలోకి వెళ్తే…

కథ విభిన్న పాత్రల కోణంలో ఐదు భాగాలుగా సాగుతుంది. చాప్టర్ 1-టామ్ (Tom)లో న్యూయార్క్‌లో ఒక పాత పుస్తకాల షాప్ నడుపుకునే అమాయకపు యువకుడు టామ్ పరిచయం అవుతాడు. అతని షాప్‌కు సాండ్రా అనే పీహెచ్‌డీ విద్యార్థిని వస్తుంది. వారిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారుతుంది. కొన్ని రోజుల తర్వాత, తన అన్నయ్య అప్పుల వల్ల ప్రాణాపాయంలో ఉన్నాడని, అతడిని రక్షించడానికి $350,000 డాలర్లు కావాలని సాండ్రా ఏడుస్తుంది. టామ్ తన తండ్రి బిలియనీర్ రిచర్డ్ హాబ్స్ అని చెప్పి, ఆ డబ్బును ఆమెకు ఇస్తాడు. డబ్బు తీసుకున్న వెంటనే సాండ్రా మాయమవుతుంది. ఆమె తనను మోసం చేసిందని టామ్ తీవ్ర మానసిక క్షోభకు గురవుతాడు.

సాండ్రా (Sandra)

Advertisement

ఈ చాప్టర్‌లో సాండ్రా అసలు నిజం బయట పడుతుంది. ఆమె అసలు పేరు సాండ్రా కాదు, ఆమె ఒక డ్రగ్ అడిక్ట్. ఆమెను మాక్స్ అనే ఒక ప్రొఫెషనల్ మోసగాడు రక్షిస్తాడు. మాక్స్ ఆమెకు మనుషులను ఎలా బురిడీ కొట్టించాలో, క్లాసిక్ లుక్‌తో ఎలా మోసం చేయాలో ట్రైనింగ్ ఇస్తాడు. మాక్స్ ప్లాన్ ప్రకారమే ఆమె టామ్‌ను ప్రేమించి, డబ్బుతో పారిపోతుంది. అయితే, మాక్స్ ఆ డబ్బుతో సాండ్రాను వదిలేసి వెళ్లిపోతాడు.

మాక్స్ (Max)

మాక్స్ పెద్ద లెవెల్ మోసాలకు పాల్పడుతుంటాడు. అతని తల్లి మడేలిన్ న్యూయార్క్‌లోని టాప్ బిలియనీర్ రిచర్డ్ హాబ్స్ ను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని చూస్తుంది. రిచర్డ్‌కు మాక్స్ ఒక డ్రగ్ అడిక్ట్ కొడుకుగా పరిచయం అవుతాడు. అయితే ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ బయట పడుతుంది. మడేలిన్… మాక్స్‌కు తల్లి కాదు, అతని ప్రియురాలు. రిచర్డ్ హాబ్స్ బిలియన్ల ఆస్తిని కొట్టేయడానికి మడేలిన్, మాక్స్ కలిసి ఆడుతున్న పెద్ద నాటకం ఇది. చివరకు రిచర్డ్ మడేలిన్‌ను పెళ్లి చేసుకుంటాడు, ఆ తర్వాత గుండెపోటుతో చనిపోతాడు. రిచర్డ్ ఆస్తి మొత్తం మడేలిన్‌కు, ఆమె నకిలీ కొడుకు మాక్స్‌కు దక్కుతుంది. రిచర్డ్ అసలు కొడుకైన టామ్‌కు ఏమీ దక్కదు.

మడేలిన్ (Madeline)

Advertisement

ఆస్తి మొత్తం చేతికి వచ్చాక మాక్స్, మడేలిన్‌ల మధ్య గొడవలు మొదలవుతాయి. రిచర్డ్ హాబ్స్ ఆస్తికి సంబంధించిన ట్రస్ట్‌ను టామ్ చూసుకుంటుంటాడు. లాయర్ల ద్వారా మడేలిన్‌కు ఒక విషయం తెలుస్తుంది. టామ్ తీవ్రమైన డిప్రెషన్‌లో ఉన్నాడని, సాండ్రా అనే అమ్మాయి కోసం వెతుకుతున్నాడని. అదే సమయంలో పశ్చాత్తాపంతో ఉన్న సాండ్రా మళ్లీ టామ్ దగ్గరకు వస్తుంది. వారిద్దరూ కలిసి ఒక ప్రైవేట్ డిటెక్టివ్‌ను కలిసి మాక్స్, మడేలిన్‌ల ఆట కట్టించాలని ప్లాన్ చేస్తారు.

షార్పర్ (Sharper)

మడేలిన్, మాక్స్ ఇద్దరూ కలిసి టామ్ – సాండ్రాలను ఒక నిర్మానుష్య ప్రదేశానికి రప్పిస్తారు. అక్కడ జరిగే ఘర్షణలో మాక్స్ దగ్గరున్న గన్‌ను సాండ్రా లాక్కుంటుంది. ఆ గొడవలో అనుమానాస్పదంగా టామ్‌కు బుల్లెట్ తగిలి చనిపోతాడు. టామ్ చనిపోవడంతో మడేలిన్ భయపడిపోతుంది. తను జైలుకు వెళ్లకుండా ఉండాలంటే… రిచర్డ్ హాబ్స్ ఆస్తి మొత్తం తిరిగి టామ్ ఫౌండేషన్‌కు రాసి ఇచ్చేయాలని, అప్పుడే పోలీసులు ఈ మర్డర్ కేసును ఇన్వెస్టిగేట్ చేయకుండా ఆపవచ్చని సాండ్రా, డిటెక్టివ్ చెబుతారు. దీంతో వాళ్ళు అడిగినట్టుగా ఆమె సంతకాలు చేసి, ప్రియుడితో ఫ్లైట్ ఎక్కి పారిపోతుంది. ఆ ఫ్లైట్ ఎక్కాక ఆమెకు ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. తన బట్టలపై ఉన్న ఆ రక్తం మరకలు ఎవరివి ? టామ్ నిజంగానే చనిపోయాడా ? సాండ్రా ఆడిన మైండ్ బెండింగ్ గేమ్ ఏంటి ? అన్నది తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే.

Read Also : ఆ పని చేసే అమ్మాయిలంతా మిస్సింగ్… సీట్ ఎడ్జ్ కొరియన్ సైకో థ్రిల్లర్

Tags

Related News

బొమ్మను నిజమైన పిల్లాడిలా చూసుకునే పేరెంట్స్… వింత నర్స్ ఎంట్రీతో మతిపోగొట్టే క్లైమాక్స్

రాయితో బాయ్ ఫ్రెండ్ తల పగలగొట్టే అమ్మాయి… ‘దృశ్యం’ రేంజ్ సైకలాజికల్ సర్వైవల్ థ్రిల్లర్

ఒక భార్య, ఇద్దరు భర్తలు.. చివరికి ఆమె కోసం పెద్ద డాన్‌తో పోరాటం, భలే కామెడీ మామ

‘టీచ్ యూ లెసన్’ నచ్చిందా? ఆ స్టార్లు నటించిన ఈ లీగల్ క్రైమ్ డ్రామా సీరిస్.. ఇంకా అద్భుతం

కిల్లర్లను దారుణంగా చంపేసే ముసలోడు.. అసలు ట్విస్టు తెలిస్తే మతిపోద్ది, డోన్ట్ మిస్

రీసార్ట్ లో రేవ్ పార్టీలు… అమ్మాయి మిస్సింగ్ తో అడ్డంగా బుక్కయ్యే ధనవంతులు

యజమాని మర్డర్ మిస్టరీ ఛేదించే గొర్రెలు.. అబ్బురపరిచే వింతైన మిస్టరీ కామెడీ థ్రిలర్ ఇది

Big Stories

×