Black Pepper: నల్ల మిరియాలను చాలా మంది ఆహార పదార్థాల తయారీలో వాడతారు. ఇవి ఆహారం యొక్క రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. నల్ల మిరియాలలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. వీటిని అనేక శారీరక, మానసిక సమస్యల నుంచి ఉపశమనం కలిగించే హోం రెమెడీస్ గా ఉపయోగిస్తారు.
నల్ల మిరియాలను చాలా సంవత్సరాలుగా ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తున్నారు. తరచుగా వీటిని ఆహారంతో పాటు తినడం వల్ల జీర్ణక్రియ, బరువు తగ్గడం, రోగనిరోధక వ్యవస్థ పెరుగుదల వంటి అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అంతే కాకుండా ఇవి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. నల్ల మిరియాలను తినడం వల్ల ఎలాంటి లాభాలుంటాయనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నల్ల మిరియాలు తినడం వల్ల కలిగే 6 ప్రయోజనాలు:
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
నల్ల మిరియాలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇందులో పైపెరిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది జీర్ణ ఎంజైమ్‌లను ప్రేరేపిస్తుంది. ఆహారం జీర్ణం కావడాన్ని సులభతరం చేస్తుంది. ఇది అజీర్ణం, గ్యాస్ , మలబద్ధకం వంటి సమస్యలను కూడా తొలగిస్తుంది. నల్ల మిరియాలు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థను బలంగా మారుతుంది. అంతే కాకుండా ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది.
బరువు తగ్గడంలో సహాయపడుతుంది:
నల్ల మిరియాలలో పైపెరిన్ ఉంటుంది. ఇది శరీర జీవక్రియను వేగవంతం చేస్తుంది. అంతే కాకుండా శరీరంలో కొవ్వును తగ్గించే ప్రక్రియను ప్రోత్సహిస్తుంది. మిరియాలు తరచుగా తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అంతే కాకుండా ఇవి శరీరంలోని అదనపు కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. ఫలితంగా బరువును నియంత్రణలో ఉంటుంది.
రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం:
నల్ల మిరియాలలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరం ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి. ఇవి అంటువ్యాధులు నివారించడానికి శరీరం యొక్క సహజ రోగనిరోధక శక్తిని బలపడటానికి సహాయపడతాయి. అంతే కాకుండా నల్ల మిరియాలను క్రమం తప్పకుండా తినడం వల్ల వ్యాధులతో పోరాడే శరీరం యొక్క సామర్థ్యం పెరుగుతుంది. ఇది మెరుగైన ఆరోగ్యానికి కూడా దారితీస్తుంది.
చర్మానికి మేలు:
చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను నల్ల మిరియాలు కలిగి ఉంటాయి. ఇవి ముడతలు, ఇతర చర్మ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా నల్ల మిరియాలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మాన్ని ప్రకాశవంతంగా, యవ్వనంగా ఉంచుకోవచ్చు. ఇవి రక్త ప్రసరణను ప్రోత్సహించి చర్మానికి అవసరం అయిన పోషణను అందిస్తాయి.
Also Read: ఎండు ద్రాక్ష నీరు ఇలా వాడితే.. జుట్టు ఊడమన్నా ఊడదు !
జలుబు, దగ్గు నుంచి ఉపశమనం:
నల్ల మిరియాలను జలుబు, దగ్గు, ఫ్లూ నుంచి ఉపశమనం కలిగించే ప్రభావవంతమైన హోం రెమెడీగా ఉపయోగించవచ్చు. వీటిలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. అంతే కాకుండా ఇన్ఫెక్షన్‌ను తొలగించడంలో సహాయపడతాయి. నల్ల మిరియాలు తినడం వల్ల గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ కూడా నయం అవుతుంది. ఫలితంగా శ్వాస తీసుకోవడం సులభతరం అవుతుంది. జలుబు నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.