E-Paper
Advertisement

పాస్ట్ నుంచి ఎస్కెప్ అవ్వాలని పెనం నుంచి పొయ్యిలోకి… మోస్ట్ అండర్రేటెడ్ సిరీస్ భయ్యా

పాస్ట్ నుంచి ఎస్కెప్ అవ్వాలని పెనం నుంచి పొయ్యిలోకి… మోస్ట్ అండర్రేటెడ్ సిరీస్ భయ్యా
Advertisement

Crime Thriller Series: కొంతమంది లైఫ్ ను చూసినప్పుడు “వాళ్ళ లైఫ్ భలే ఉంది, వాళ్ళలా బతికినా బాగండేది” అని నిట్టూరుస్తూ ఉంటారు చాలామంది. తమ కష్టాలను తలచుకుని అలా అనుకుంటారు. కానీ అవతలి వాళ్ళ కష్టాలు ఏంటో తెలియాలంటే వాళ్ళ లైఫ్ ను దగ్గరగా చూడాల్సి ఉంటుంది. అంతేకానీ వాళ్ళ లైఫ్ మనదైతే బాగుంటుంది అనుకుంటే తప్పులో కాలేసినట్టే. అచ్చం ఇలాగే వేరే వాళ్ళ ఐడెంటిటీతో బతకాలి అనుకున్న హీరో పరిస్థితి ఏమైందో తెలియాలంటే ఈ సిరీస్ ను చూడాల్సిందే. ‘Sneaky Pete’ అనే టైటిల్ తో వచ్చిన ఈ అమెరికన్ క్రైమ్ డ్రామా సిరీస్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? తెలుగులో అందుబాటులో ఉందా లేదా ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఒక తెలివైన మోసగాడు, ప్రమాదకరమైన గ్యాంగ్‌స్టర్ మధ్య జరిగే మైండ్-గేమ్ ఈ క్రైమ్ డ్రామా. ఇందులో మారియస్ జోసిపోవిక్ (Giovanni Ribisi) అనే తెలివైన జేబుదొంగ హీరో రోల్ లో కనిపిస్తాడు. అతను ఓ దొంగతనం కేసులో అరెస్ట్ అయ్యి, జైలు నుండి రిలీజ్ అవుతాడు. కానీ, జైలు నుంచి బయట పడినప్పటికీ అతను డేంజర్ జోన్ లోనే ఉంటాడు. విన్స్ అనే క్రూరమైన గ్యాంగ్‌స్టర్ డబ్బు కోసం మారియస్ ప్రాణాలు తీయడానికి వెంట పడతాడు. అందుకే హీరో ఎలాగైనా తన ఐడెంటిటీని మార్చుకుని బతకాలని నిర్ణయించుకుంటాడు.

Advertisement

ఆ గ్యాంగ్‌స్టర్ నుండి తప్పించుకోవడానికి మారియస్ వేసిన ఈ ప్లాన్ బెడిసి కొడుతుంది. జైల్లో తనతో పాటు ఒకే గదిలో ఉన్న ‘పీట్ మర్ఫీ’ అనే వ్యక్తి ఐడెంటిటీని ప్లాన్ లో భాగంగా దొంగిలిస్తాడు. తనని తానే నిజమైన పీట్ లాగా మార్చుకుని కొత్త.కుటుంబంలోకి ఎంట్రీ ఇస్తాడు. చిన్నప్పుడే తన కుటుంబానికి దూరమయ్యి ఉంటాడు పీట్. అదే హీరోకి కూడా కలిసి వస్తుంది. మారియస్, పీట్ కుటుంబం దగ్గరికి బాగానే వెళ్తాడు. చాలా ఏళ్ల తర్వాత వచ్చిన పీట్‌ని చూసి ఆ కుటుంబం అతనే నిజమైన పీట్ అని నమ్మి వాళ్ళు కూడా ఇంట్లోకి సాదరంగా ఆహ్వానిస్తారు.

ఇక్కడే కథలో మంచి ట్విస్ట్ వస్తుంది. మారియస్ మారుపేరుతో ఇక్కడ సేఫ్‌గా దాక్కోవచ్చు అనుకుంటాడు. కానీ ఆ కుటుంబం నడిపే ‘బెయిల్ బాండ్స్’ బిజినెస్ వల్ల అనేక రకాల నేరాలు, ప్రమాదకరమైన సీక్రెట్స్‌ తో బతుకు నెట్టుకొస్తారు. అటు గ్యాంగ్‌స్టర్ విన్స్ నుండి తప్పించుకుంటూ, ఇటు పీట్ కుటుంబం నేరాల్లో ఇరుక్కుపోకుండా ఉండడానికి, తను నిజమైన పీట్ కాదు అనే నిజం బయట పడకుండా ఉండడానికి మారియస్ పడే తిప్పలు మామూలుగా ఉండవు.

Advertisement

మరి ఈ పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి అబద్ధాలతో ఎలా మేనేజ్ చేశాడు ? అనేదే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ స్టోరీ. ఈ సిరీస్‌కు ఓటీటీలో తెలుగు డబ్బింగ్ కానీ, తెలుగు సబ్‌టైటిల్స్ కానీ అందుబాటులో లేవు. అమెజాన్ ఒరిజినల్ సిరీస్ అయినందున దీనిని ఇంగ్లీష్ లో Amazon Prime Video లో చూడవచ్చు. మొత్తం 3 సీజన్లు, 30 ఎపిసోడ్‌లు ఉన్న ఈ సూపర్ హిట్ ఒరిజినల్ సిరీస్ ను ఇంకా చూడకపోతే వెంటనే ఓ లుక్కేయండి.

Read Also : పాపులర్ ఆటగాడికి 10 ఏళ్ల జైలు శిక్ష… ఎఫ్‌బీఐ సీక్రెట్ ఆఫర్ తో ఊహించని మలుపు

Related News

Friday OTT Releases : ఫ్రైడే ఓటీటీ సందడి.. ఆ రెండు మస్ట్ వాచ్..!

10 ఏళ్లలో 55 బదిలీలు… చివరికి ముఖ్యమంత్రి కుటుంబాన్ని కూడా వదలని కానిస్టేబుల్ కథ

పైలెట్ కావాల్సిన కుర్రాడు రెడ్ లైట్ ఏరియాలో ప్రేమంటూ… ఈ సిరీస్ పెద్దలకు మాత్రమే

పేదలకు నరకం… ధనవంతులకు స్వర్గం ఈ రైలు… లైఫ్ లో మరచిపోలేని థ్రిల్లిచ్చే సర్వైవల్ థ్రిల్లర్

కబడ్డీ నుంచి క్రైమ్ వరల్డ్‌లోకి… స్పోర్ట్స్ మూవీ కాదు పక్కా రా యాక్షన్ థ్రిల్లర్

కోరుకున్న వాడిని దక్కించుకోవడానికి ఇవేం మెంటల్ పనులు… ‘అబ్సెషన్’ చూసి ఆగమైనోళ్ల కోసమే ఈ థ్రిల్లర్ సిరీస్

పెళ్లి చేసుకుంటే కోటీశ్వరుల జీవితం… కానీ ఈ అమ్మాయి చేసిన పని తెలిస్తే దిమాక్ కరాబ్

తల్లి కావాలనే కోరిక… చివరికి బిడ్డ కోసం ఆమె చేసిన పని తెలిస్తే షాక్

Big Stories

Advertisement
×