E-Paper
Advertisement

China Earthquake: చైనాలో భారీ భూకంపం.. వణికిన సిచువాన్ ప్రావిన్స్‌, ప్రాణ-ఆస్తి నష్టానికి

China Earthquake: చైనాలో భారీ భూకంపం.. వణికిన సిచువాన్ ప్రావిన్స్‌, ప్రాణ-ఆస్తి నష్టానికి
Advertisement

China Earthquake: చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో సోమవారం భారీ భూకంపం సంభవించింది. యిబిన్ నగరం, గావోక్సియన్ కౌంటీ కేంద్రంగా భారీ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు  చైనా భూకంపం నెట్‌వర్క్స్ సెంటర్ తెలియజేసింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.5 గా నమోదు అయ్యింది. ప్రాణ-ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

చైనాలో భూకంపం.. సిచువాన్ ప్రావిన్స్‌లో ప్రకంపనలు

Advertisement

ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు తీవ్రమవుతున్నాయి. గతవారం వెనిజులాను భూకంపం అతలాకుతలం చేసింది. మరుసటిరోజు జపాన్‌తోపాటు పలు దేశాలను వణికించింది. ఈ వారం చైనా వంతైంది. సిచువాన్ ప్రావిన్స్‌లోని యిబిన్, గావో కౌంటీని బలంగా వినిపించింది. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది.

5.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం 6 కిలోమీటర్ల లోతులో గుర్తించారు. భూకంప కేంద్రానికి 200 కిలోమీటర్లకు దూరంలో ఉన్న చెంగ్డూ, చోంగ్‌కింగ్‌తో సహా పలు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. దీనికి సంబంధించి ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

13 మందికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు

చైనా ప్రభుత్వ ఛానెల్ జిన్హువా ప్రకారం భూకంపం ఘటనలో ఎలాంటి మరణాలు సంభవించలేదని పేర్కొంది. 13 మంది స్వల్పంగా గాయపడ్డారని, వారంతా ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని ప్రస్తావించింది. అంతేకాదు అత్యవసరంగా 196 మంది నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపింది.

భూకంప కేంద్రం ఉన్న గావో కౌంటీలో దాదాపు 21 ఇళ్లు పగుళ్లు ఏర్పడ్డాయి. మూడు ఇళ్లు భారీగా దెబ్బతిన్నట్లు సమాచారం. భూకంపం ధాటికి కొండచరియలు విరిగిపడటం, బండ రాళ్లు రోడ్లపైకి రావడంతో దాదాపు 12 జాతీయ రహదారులు దెబ్బతిన్నాయి. దీంతో చాలావరకు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భూకంపం గురించి తెలియగానే అధికారులు అత్యవసర మరమ్మతులు చేపట్టారని ఆ వార్తా సంస్థ తెలిపింది.  దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

ALSO READ: కువైట్-బహ్రెయిన్‌లపై ఇరాన్ భీకరదాడులు.. నరకం చూస్తారంటూ అమెరికాకు హెచ్చరిక

 

 

Related News

పాక్ సైన్యానికి చుక్కలు చూపించిన.. బలూచ్ మహిళా కమాండోలు.. ఫస్ట్ అటాక్‌లోనే 9 మంది మృతి!

ఖమేనీ అంతం తర్వాత కూడా లొంగని ఇరాన్.. ట్రంప్ వేసిన ప్లాన్ ఎక్కడ తప్పింది?

వరద గుప్పిట్లో బ్యాంకాక్ సిటీ.. 48 గంటల్లో 300 మి.మీ. వర్షం, విమానాల గురించి..

రాతి యుగానికి చెందిన ప్రజలు.. చెట్లపై వారి జీవితం, భూమికి 20 మీటర్లు ఎత్తులో, ఎక్కడో తెలుసా?

నేపాల్‌కు పొంచివున్న ముప్పు.. హిమాల్ శిఖరంపై భారీ హిమపాతం, 10 మంది మిస్సింగ్

లాడెన్ ఎక్కడ దొరికాడో మర్చిపోయావా? ఐరాసలో పాక్ ప్రధానికి ఇచ్చిపడేసిన భారత్!

DR కాంగోలో ఘోర ప్రమాదం.. ఆర్మీ విమానం ధ్వంసం… 14 మంది సజీవ దహనం!

ఇరాన్‌కు బిగ్ షాక్.. ‘సీజ్‌ఫైర్’ రిక్వెస్ట్‌కు ట్రంప్ నో.. భారీ అటాక్‌కు స్కెచ్!

Big Stories

Advertisement
×