BigTV English
Advertisement

Sony LIV : ఇలాగైతే దుకాణం బంద్… సోనీ లివ్ ఓటీటీపై మూవీ లవర్స్ ఫైర్

Sony LIV : ఇలాగైతే దుకాణం బంద్… సోనీ లివ్ ఓటీటీపై మూవీ లవర్స్ ఫైర్

Sony LIV : ఇటీవల కాలంలో ఓటీటీలు ఎంటర్టైన్మెంట్ విషయంలో పోటాపోటిగా దూసుకెళ్తున్నాయి అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే తమకు నచ్చిన ఓటీటీలకు సబ్ స్క్రిప్షన్ తీసుకుని సినిమాలను ఎంజాయ్ చేస్తున్నారు మూవీ లవర్స్. అలాగే స్పోర్ట్స్ కూడా ఓటీటీ సబ్స్క్రిప్షన్ విషయంలో కీలకపాత్రను పోషిస్తున్నాయి. అయితే కొన్ని ఓటీటీలు మాత్రం సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పటికీ యాడ్స్ తో చావగొడుతున్నారు. ప్రీమియం సబ్రిప్షన్ తీసుకోవాలంటూ భారీ ధరలతో ప్రేక్షకులపై భారం మోపుతున్నారు. తాజాగా ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ సోనీ లివ్ (Sony Liv OTT) కూడా ఇలాంటి వివాదంలోనే చిక్కుకుంది.


వివాదం ఏంటంటే?

భారీ సబ్స్రిప్షన్ ప్లాన్స్, వరుస యాడ్స్ తో యూజర్స్ కి చిరాకు తెప్పిస్తోంది సోనీ లివ్.ఈ  ప్లాట్ఫామ్ ప్రస్తుతం సంవత్సరానికి రూ. 1499 వరకు ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్లను అందిస్తోంది. అయినప్పటికీ ఈ ప్లాన్ తీసుకున్నాక కూడా వరుసగా యాడ్స్ ఇస్తూ ప్రేక్షకులను తెగ చిరాకు పెడుతోంది. మంచి ఇంట్రెస్ట్ తో మూవీని చూస్తున్నప్పుడు సడన్ గా యాడ్స్ ఇచ్చి మూడ్ మొత్తం చెడగొడుతున్నాయి. దీంతో ఇదే విషయంపై సోషల్ మీడియా వేదికగా సోనీ లీవ్ ను నెటిజెన్లు చెడుగుడు ఆడుకుంటున్నారు.


ప్రస్తుతం సోనీలు లైబ్రరీని పరిగణలోకి తీసుకొని చూస్తే పెద్ద అట్రాక్టివ్ కంటెంట్ ఏమీ లేదని అంటున్నారు. కాబట్టి తక్కువ ధరలతో ఎక్కువ మంది వ్యూవర్స్ ని ఆకర్షిస్తే మంచిదని సలహా ఇస్తున్నారు. ఒకవేళ సోనీ లివ్ గనక పద్ధతి మార్చుకోకపోతే దెబ్బ పడటం ఖాయమని హెచ్చరిస్తున్నారు. ఫలితంగా వ్యూవర్స్ తగ్గితే ఈ ఓటీటీ దుకాణం బంద్ చేసుకోక తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు.

WWE కి సోనీ లివ్ దూరం 

నిజానికి సోనీ లివ్ కు భారీ సంఖ్యలో సబ్స్క్రయిబర్లు రావడానికి WWE కూడా ఒక కారణం. కానీ ఇప్పటిదాకా సోనీ లీవ్ లో ప్రసారమవుతున్న WWE మ్యాచ్ లకు అంతరాయం కలిగించే విధంగా వరుసగా యాడ్స్ రావడం పట్ల వీక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. WWEతో పాటు సిఐడి, క్రైమ్ పెట్రోల్ వంటి సోనీ లివ్ కీలక షోలు ఇటీవలే నెట్ ఫిక్స్ కి మారాయి. దీంతో ఈ ఓటీటీకి సబ్స్క్రైబ్ లు తగ్గే ఛాన్స్ గట్టిగానే ఉంది.

అయితే సిఐడి, క్రైమ్ పెట్రోల్ రెండు షోలు నెట్ ఫ్లిక్స్ తో పాటు సోనీ లివ్ లో కూడా అందుబాటులో ఉండడం వల్ల ఇంకా కొంతమంది సబ్స్క్రైబర్లు ఈ ఓటీటీని విడిచి పెట్టలేదు. ఇక సోనీ లివ్ వంటి చిన్న ప్లాట్ఫామ్ సంవత్సరానికి రూ. 1499 సబ్స్క్రిప్షన్ ఫీజు పెట్టడం దారుణమని అంటున్నారు. ప్రతినెలా ఈ ఓటీటీ కోసం రూ. 399 ఖర్చు చేయాల్సి వస్తుంది. నెట్ ఫ్లిక్స్ లాంటి బడా ఓటీటీ కంటే ఇది ఎక్కువ ఖరీదు కావడం గమనార్హం. మరి ఈ వివాదంపై సోనీ లివ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. లేదంటే త్వరలోనే భారీ సంఖ్యలో సబ్స్క్రయిబర్లను కోల్పోవాల్సి వస్తుంది.

Related News

Avihitham: పితృస్వామ్య రాజ్యంలో బాధితులుగా కూతుర్లు.. ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం..!

K Ramp OTT : ఓటీటీ డేట్ ను లాక్ చేసుకున్న ‘కే ర్యాంప్’.. స్ట్రీమింగ్ అప్పటినుంచే..?

OTT Movie : ఒంటిపై నూలు పోగు లేకుండా భగభగ మండే మంటల్లోకి పరుగు… ఇదెక్కడి దిక్కుమాలిన పని సామీ

OTT Movie : మిస్టీరియస్ మనిషితో ముసలావిడ రొమాన్స్… ఇలాంటి సినిమాను ఎక్కడా చూసుండరు భయ్యా

OTT Movie : భర్తకు బాయ్ ఫ్రెండ్ తో అడ్డంగా దొరికిపోయే భార్య… ఐఎండీబీలో రేటింగ్ 8… క్రైమ్ మూవీ లవర్స్ కు పండగే

OTT Movie : IMDb లో 9.7 రేటింగ్… స్కూల్ పుస్తకాల్లో స్కామ్… ఈ తండ్రి గట్స్ కు దండం పెట్టాల్సిందే భయ్యా

OTT Movie : బ్రోతల్ హౌస్ నుంచి తప్పించుకుని 17 ఏళ్ల అమ్మాయితో ఆ పాడు పనులు… ఈ మూవీ స్ట్రిక్ట్లీ సింగిల్స్ కు మాత్రమే

OTT Movie : స్కూల్ పాప డ్రెస్సుకు బటన్స్ పెట్టే మాస్టార్… డోర్ వేస్తానని చెప్పి ఆమె చేసే పనికి ఫ్యూజులు అవుట్

Big Stories

×