BigTV English
Advertisement

OTT Movie : చిన్న పిల్లలతో ఇదేం పాడు పని… నరాలు కట్ అయ్యే ట్విస్టులున్న సైకో కిల్లర్ మూవీ

OTT Movie : చిన్న పిల్లలతో ఇదేం పాడు పని… నరాలు కట్ అయ్యే ట్విస్టులున్న సైకో కిల్లర్ మూవీ

OTT Movie : అపరిచిత వ్యక్తులతో ఈ రోజుల్లో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయో ఈ సినిమాలో చక్కగా చూపించారు. ఫ్యామిలీలను టార్గెట్ చేసే ఒక సైకో జంట చుట్టూ ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ స్టోరీ తిరుగుతుంది. థియేటర్లలో మంచి హిట్ కొట్టి ఓటీటీలో కూడా ఈ మూవీ దూసుకుపోయింది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


స్టోరీలోకి వెళితే

ఒక అమెరికన్ జంట తమ కూతురితో పాటు ఇటలీకి విహారయాత్రకు వెళ్తారు. అక్కడ ప్రకృతి అందాలను చూస్తూ ఈ కుటుంబం సరదాగా గడుపుతూ ఉంటుంది. ఇంతలో ఒక బ్రిటిష్ జంట వీళ్లకు పరిచయం అవుతుంది. ఈ జంటకి మాటలు రాని ఒక కొడుకు ఉంటాడు. ఈ విహారయాత్రలో ఇరు కుటుంబాలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ యాత్ర ముగించుకొని ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆరు నెలలు గడిచిన తర్వాత బ్రిటిష్ దంపతులు, ఈ అమెరికన్ జంటని వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేస్తారు. ఇక అమెరికన్ ఫ్యామిలీ కూడా సరదాగా వాళ్ళ ఇంటికి ఎంజాయ్ చేయడానికి వెళ్తారు. ఈ బ్రిటిష్ జంట ఊరికి చివర ఒక ఫామ్ హౌస్ లో నివసిస్తూ ఉంటారు. ఇక ఇక్కడ అమెరికన్ జంట కూడా వచ్చి వాళ్లతో సరదాగా గడుపుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే బ్రిటిష్ జంట అసలు సీక్రెట్స్ సెల్లార్ లో ఉన్న గదిలో కనబడతాయి. అప్పటినుంచి అక్కడి నుంచి వీళ్ళు వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తుంటారు.


వీళ్లను గమనించిన ఈ బ్రిటిష్ జంట వాళ్లను బయటికి పోనీకుండా అడ్డుకొని చంపడానికి ప్రయత్నిస్తారు. నిజానికి ఈ బ్రిటిష్ జంట టూరిస్ట్ లను టార్గెట్ చేస్తూ పరిచయం చేసుకొని వాళ్ళని చంపుతూ ఉంటారు. వాళ్ల దగ్గర ఉన్న పిల్లల నాలుక కోసి తమ పిల్లలుగా చెప్పుకుంటూ ఉంటారు. దీని వల్ల ఎవరికి అనుమానం రాకుండా ఉంటుందని అలా ప్లాన్ చేస్తుంటారు. ఇప్పుడు మూగవాడిగా ఉన్న కొడుకు కూడా ఈ జంటకు పుట్టినవాడు కాదు. గతంలో వీళ్ళ బారిన పడిన ఓ ఫ్యామిలీకి చెందినవాడు. ఈ పిల్లవాడికి నాలుక కోసి తమ కొడుకుని చెప్పుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే వీళ్ళు అమెరికన్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తారు. చివరికి ఈ అమెరికన్ ఫ్యామిలీ ఆ సైకోల చేతి నుంచి తప్పించుకుంటుందా ? ఆ సైకోల చేతిలో బలవుతుందా ? సెల్లార్ లో అమెరికన్ జంటకు కనిపించిన సీక్రెట్స్ ఏమిటి ? అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమాని మిస్ కాకుండా చూడండి.

Read Also : మనిషి మాంసాన్ని తినే మాన్స్టర్స్… రోమాలు నిక్కబొడుకునే థ్రిల్లర్ బ్రో

 

రెండు ఓటిటిలలో స్ట్రీమింగ్

ఈ అమెరికన్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘స్పీక్ నో ఈవిల్’ (Speak no Evil). 2024 లో విడుదలైన ఈ మూవీకి జేమ్స్ వాట్కిన్స్ దర్శకత్వం వహించారు. ఇందులో జేమ్స్ మెక్‌అవోయ్, మాకెంజీ డేవిస్, ఐస్లింగ్ ఫ్రాన్సియోసి, అలిక్స్ వెస్ట్ లెఫ్లర్, డాన్ హగ్ వంటి నటులు నటించారు. దీనికి జాసన్ బ్లమ్ తన బ్లమ్‌హౌస్ ప్రొడక్షన్స్ బ్యానర్ ద్వారా నిర్మాతగా వ్యవహరించాడు. 2024సెప్టెంబరు 13న యునైటెడ్ స్టేట్స్‌లో యూనివర్సల్ పిక్చర్స్ ఈ సినిమాను విడుదల చేసింది. ఈ మూవీ జియో హాట్ స్టార్ (Jio hotstar), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లలో స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

Chiranjeeva Movie Review : ‘చిరంజీవ’ మూవీ రివ్యూ : షార్ట్ ఫిలింని తలపించే ఓటీటీ సినిమా

Jana Nayagan OTT: భారీ ధరలకు జననాయగన్ ఓటీటీ రైట్స్… తమిళ ఇండస్ట్రీలోనే రికార్డు ధర!

The Family Man 3 Trailer: హై వోల్టేజ్ యాక్షన్ గా ది ఫ్యామిలీ మ్యాన్ 3.. ఆకట్టుకుంటున్న ట్రైలర్!

Chiranjeeva OTT : ఓటీటీలోకి వచ్చేసిన రాజ్ తరుణ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Jatadhara OTT: ‘ జటాధర’ ఓటీటీ పార్ట్నర్ లాక్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే..?

OTT Movie : అమ్మాయిలతో ఆ పాడు పని చేసి చంపే సైకో… ఒంటరిగా చూడాల్సిన సీన్స్… క్లైమాక్స్ కేక

OTT Movie : 240 కోట్ల కలెక్షన్స్, 10 అవార్డులు… ఈ బ్లాక్ బస్టర్ మూవీ హీరోని జైలుకు పంపిందన్న విషయం తెలుసా ?

Kiss movie OTT : కిస్ పెట్టుకుంటే ఫ్యూచర్లోకి… మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి సూపర్ హిట్ తమిళ్ మూవీ

Big Stories

×