E-Paper
Advertisement

దొంగతనాలు చేసే అమ్మాయికి సీక్రెట్ స్పై మిషన్… టార్గెట్ కొడుకుతోనే ప్రేమలో… క్రేజీ కొరియన్ థ్రిల్లర్

దొంగతనాలు చేసే అమ్మాయికి సీక్రెట్ స్పై మిషన్… టార్గెట్ కొడుకుతోనే ప్రేమలో… క్రేజీ కొరియన్ థ్రిల్లర్
Advertisement

Korean Historical Spy Series OTT : దొంగతనాలు చేస్తూ జీవించే ఓ యువతి ఏకంగా స్పైగా మారుతుంది తన తెలివితేటలను ఉపయోగించి చిన్న చిన్న దొంగతనాలు చేసే ఆమె, ఓ రోజు దేశానికి సంబంధించిన అత్యంత కీలకమైన రహస్యాలను సంపాదించే బాధ్యతను తీసుకుంటుంది. శత్రువుల మధ్య ఉంటూనే వారి నమ్మకాన్ని గెలుచుకోవడం, అదే సమయంలో తన అసలు గుర్తింపును దాచుకోవడం అంత ఈజీ కాదు. ఇలా ప్రేమ, మోసం, రాజకీయ కుట్రలు, రహస్య మిషన్లతో సాగే కథే ‘100 Days of Deception’. మరి ఈ హిస్టారికల్ స్పై డ్రామాను ఏ ఓటీటీలో, ఎప్పటి నుంచి చూడవచ్చు ? అన్నది తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఈ కథ జపాన్ వలస పాలనలో ఉన్న కొరియాలోని గ్యోంగ్‌సోంగ్ నేపథ్యంలో సాగుతుంది. ఆ కాలంలో సాధారణ ప్రజల జీవితం అనేక ఆంక్షల మధ్య కొనసాగుతుంటుంది. అధికారంలో ఉన్నవారి చేతుల్లో పవర్, సంపద ఉంటాయి. మరోవైపు తమ దేశం కోసం పోరాడాలని భావించే వ్యక్తులు రహస్యంగా ఉద్యమాలు చేస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో జీవించే యువతి లీ గా-గ్యోంగ్‌ కు దొంగతనాల్లో మంచి నైపుణ్యం ఉంటుంది. తన తెలివితో ఎదుటి వారిని బురిడీ కొట్టించగలిగే ఆమె, అవసరమైనప్పుడు తన గుర్తింపును కూడా మార్చుకోగలదు.

Advertisement

ఈ నేపథ్యంలో దొరికే ఓ కీలకమైన అవకాశం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. జపాన్ వలస పాలనలోని అధికార వ్యవస్థకు సంబంధించిన రహస్యాలను తెలుసుకోవడానికి ఆమెను ఓ ప్రమాదకరమైన మిషన్ ‌లో భాగం చేస్తారు. ఇందులో భాగంగా శత్రువులకు దగ్గరవుతూ, వారి మధ్య నమ్మకాన్ని సంపాదించాలి. చిన్న పొరపాటు జరిగినా ఆమె ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ప్రతి మాట, ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాల్సి వస్తుంది.

ఈ క్రమంలో లీ గా-గ్యోంగ్ లక్ష్యంగా పెట్టుకున్న వ్యక్తుల కుటుంబంతోనూ ఆమెకు సంబంధాలు ఏర్పడతాయి. ముఖ్యంగా కిమ్ టే-వూంగ్‌తో ఏర్పడే పరిచయం ఆమె మిషన్‌ ను మరింత సంక్లిష్టంగా మారుస్తుంది. ఎందుకంటే ఆమె అతడిని ప్రేమిస్తుంది. ఒకవైపు దేశానికి ఉపయోగపడే సమాచారాన్ని సంపాదించాల్సిన బాధ్యత, మరోవైపు తనను నమ్ముతున్న వ్యక్తులను మోసం చేస్తున్నాను అనే బాధ ఆమెను మానసికంగా ఒత్తిడికి గురిచేస్తాయి. తాను చేస్తున్న పని సరైనదేనా అనే సందేహాలు కూడా ఆమెను వెంటాడతాయి. ప్రేమకు, విధికి మధ్య సంఘర్షణ ఏర్పడినప్పుడు ఆమె ఏ నిర్ణయం తీసుకుంటుంది ? శత్రువుల మధ్య ఉంటూ తన లక్ష్యాన్ని సాధించగలదా ? తన అసలు గుర్తింపు బయటపడితే ఎదురయ్యే ప్రమాదాలను ఎలా ఎదుర్కొంటుంది ? ఈ అంశాల చుట్టూ సిరీస్ కథ సాగుతుంది.

Advertisement

Also Read : అంగారకుడిపై మనుషుల శరీరాలను ఆక్రమించే దుష్టశక్తులు… హాలీవుడ్ హర్రర్ థ్రిల్లర్ నెట్‌ఫ్లిక్స్‌లో

స్ట్రీమింగ్ ఎక్కడ ?

‘100 డేస్ ఆఫ్ డిసెప్షన్’ చారిత్రక నేపథ్యంతో కూడిన కొరియన్ డ్రామా సిరీస్. కిమ్ యూ-జంగ్, పార్క్ జిన్-యంగ్, కిమ్ హ్యూన్-జూ తదితరులు ఇందులో నటించారు. ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబర్ 10 నుంచి అందుబాటులోకి వచ్చింది. కానీ తెలుగు వెర్షన్ అందుబాటులో లేదు.

Tags

Related News

అంగారకుడిపై మనుషుల శరీరాలను ఆక్రమించే దుష్టశక్తులు… హాలీవుడ్ హర్రర్ థ్రిల్లర్ నెట్‌ఫ్లిక్స్‌లో

పక్షిలో మాంత్రిక శక్తులు… దేవుళ్లు, రాక్షసుల మధ్య చిక్కుకునే యువతి… హర్రర్ ఫాంటసీ సిరీస్

కోహినూర్‌ను మించిన వజ్రం కోసం వేట… హంపి ట్రిప్ లో అదిరిపోయే ఛేజింగ్… బెంగాలీ అడ్వెంచర్ థ్రిల్లర్

స్మగ్లింగ్ సామ్రాజ్యంలో బట్టల షాప్ కుర్రాడి మాస్ రాంపేజ్… పృథ్వీరాజ్ ఊరమాస్ యాక్షన్ థ్రిల్లర్ తెలుగులో

వరుస హత్యలు… అంతుచిక్కని ఆధారాలు… 5 భాషల్లో రచ్చ లేపుతున్న మోస్ట్ డేంజరస్ సైకో థ్రిల్లర్

భూమిపై మనుషులు మాత్రమే లేరా ? ప్రపంచాన్ని కుదిపేసే రహస్యం… ఏలియన్స్ గురించి స్పీల్‌బర్గ్ చూపించిన షాకింగ్ కథ

హాస్పిటల్‌ మాఫియా… డాక్టర్ల గుట్టురట్టు చేసే లేడీ సర్జన్… క్రేజీ కొరియన్ మెడికల్ థ్రిల్లర్ సిరీస్

Big Stories

Advertisement
×