E-Paper
Advertisement

టీచర్ పైనే అఘాయిత్యం… మోస్ట్ డిస్టర్బింగ్ రియాలిటీకి కళ్ళకు కట్టిన లీగల్ డ్రామా

టీచర్ పైనే అఘాయిత్యం… మోస్ట్ డిస్టర్బింగ్ రియాలిటీకి కళ్ళకు కట్టిన లీగల్ డ్రామా
Advertisement

Legal thriller : టీచర్లపై దాడులు అనే అంశం ఇటీవల కాలంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఓ స్కూల్ లో టీచర్ ను టీనేజ్ పిల్లాడు కొట్టిన వీడియో రచ్చ రచ్చ అయ్యింది. దీంతో ఇలా దారిలో పెట్టే టీచర్ ను పిల్లలు కొట్టడం ఎంత వరకు కరెక్ట్ అనే చర్చ మొదలైంది. దాదాపు ఇలాంటి కథతోనే తెరకెక్కిన ఓ హిందీ మూవీ ఈరోజు మన మూవీ సజెషన్. 2026 ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదలైన చిత్రం ‘అస్సి’ (Assi). సామాజిక అంశాలపై బలమైన చిత్రాలు తీసే దర్శకుడు అనుభవ్ సిన్హా ఈ సినిమాను తెరకెక్కించారు. తాప్సీ పన్ను, కని కుసృతి, మొహమ్మద్ జీషాన్ అయ్యూబ్, కుముద్ మిశ్రా, మనోజ్ పహ్వా, రేవతి, నసీరుద్దీన్ షా వంటి భారీ తారాగణం నటించిన ఈ చిత్రం లైంగిక హింస, చట్టంలోని లోపాలు, న్యాయ వ్యవస్థలపై ధైర్యంగా ప్రశ్నలు లేవనెత్తుతుంది. మరి ఈ మూవీ స్టోరీ ఏంటి ? సినిమాను ఏ ఓటీటీలో చూడవచ్చు ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

పరిమ్ (కని కుసృతి) ఒక స్కూల్ లో టీచర్ గా పని చేస్తుంది. భర్త వినయ్ (జీషాన్ అయ్యూబ్), కొడుకు ధ్రువ్‌ తో సంతోషంగా ఢిల్లీలో జీవితం సాగిస్తుంటుంది. ఒక రోజు రాత్రి స్కూల్ ఫంక్షన్ ముగించుకుని ఆలస్యంగా ఇంటికి వస్తుండగా, ఐదుగురు అపరిచితులు ఆమెను కార్ లోకి బలవంతంగా లాక్కెళ్లి, ఘోరంగా సామూహికంగా అఘాయిత్యం చేస్తారు. ఆ తరువాత రైల్వే ట్రాక్‌పై వదిలేసి వెళ్తారు. దీంతో ఆమె కేసు పెడుతుంది. అందులో భాగంగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేస్తారు.

Advertisement

బాధితురాలి తరఫున లాయర్ రవీ (తాప్సీ పన్ను) కోర్టులో కేసు వాదిస్తుంది. నిందితుల తరఫు లాయర్ నవరతన్ (కుముద్ మిశ్రా) తన కుట్రలతో సాక్ష్యాలను తారుమారు చేస్తాడు. మెడికల్ రిపోర్టులు ట్యాంపర్ అవడం, దర్యాప్తులో లోపాల వల్ల నిందితులకు బెయిల్ వస్తుంది. చట్టం ముందు న్యాయం ఓడిపోవడం చూసి పరిమ్ కుటుంబం ఆవేదనకు గురవుతుంది. చట్టం నిందితులను శిక్షించలేకపోవడంతో ఒక అజ్ఞాత వ్యక్తి ‘ఛత్రి మ్యాన్’ (గొడుగు మనిషి)గా అవతరిస్తాడు.

తల నరికి, చేతిలో గొడుగు పట్టుకుని తిరిగే ఈ వ్యక్తి నిందితులను ఒక్కొక్కరిగా క్రూరంగా చంపడం మొదలుపెడతాడు. ప్రజలు అతన్ని హీరోలా ఆరాధిస్తారు. ఒకవైపు లాయర్ రవీ చట్టపరంగా న్యాయం కోసం పోరాడుతుంటే, మరోవైపు ఛత్రి మ్యాన్ సమాంతర న్యాయాన్ని అమలు చేస్తుంటాడు. ఈ ప్రతీకార హత్యల వల్ల సమాజంలో క్రైమ్ రేటు పెరుగుతుందని రవీ ఆందోళన చెందుతుంది. చివరకు కోర్టు ఏ తీర్పు ఇస్తుంది ? ఛత్రి మ్యాన్ అసలు ఉద్దేశం ఏమిటి ? అసలు అతనెవరు ? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ సినిమాను వీక్షించాల్సిందే.

స్ట్రీమింగ్ ఏ ఓటీటీలో ?

Advertisement

‘అస్సి’ కేవలం కోర్ట్ రూమ్ డ్రామా కాదు… న్యాయపోరాటం, న్యాయ వ్యవస్థ లోపాలు, ప్రతీకారం, సమాజ నైతికతపై ఆలోచింపజేసే ప్రశ్నలు లేవనెత్తుతుంది. తాప్సీ పన్ను లాయర్ రవీగా, కని కుసృతి బాధితురాలిగా, నసీరుద్దీన్ షా, రేవతి వంటి సీనియర్ నటులు తమ నటనతో ఈ చిత్రానికి బలం చేకూర్చారు. ఈ చిత్రం ప్రస్తుతం ZEE5లో స్ట్రీమింగ్ అవుతోంది. Airtel Xstream Playలో కూడా ఈ మూవీ అందుబాటులో ఉంది.

Read Also : జూన్ 15 నుండి 21 వరకు… ఈ వీకెండ్ రిలీజ్ కానున్న సస్పెన్స్-కామెడీ సినిమాలు, సిరీస్ లు

Tags

Related News

ఫోక్ క్వీన్ నాగదుర్గకు ఓటీటీలో అదిరిపోయే హిట్!

రూ.550 కోట్ల హారర్ బ్లాక్‌బస్టర్… ‘ఈవిల్ డెడ్ బర్న్’ ఏకంగా 3 ఓటీటీల్లో స్ట్రీమింగ్

94 శాతం ఫ్రెష్ రేటింగ్‌ ఉన్న హాలీవుడ్ ఇంటెన్స్ థ్రిల్లర్… తెలుగులోనే ఇప్పుడు రెండు ఓటీటీల్లో

గ్లాడియేటర్ స్టార్ రస్సెల్ క్రో కొత్త మూవీ ‘బీస్ట్’… తెలుగు డబ్బింగ్‌తో ఓటీటీలో స్ట్రీమింగ్

బావిలో దొరికిన మహిళ శవం… దర్యాప్తులో బయటపడిన భయంకర రహస్యం

ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన ఓ సుకుమారి.. ఎక్కడ చూడొచ్చంటే?

ఒరిజినల్ ఏనుగుతో షాకింగ్ యాక్షన్… తెలుగులోనే సునీల్ మలయాళం మూవీ ‘కాటాలన్’ స్ట్రీమింగ్

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×