E-Paper
Advertisement

అల్లు రామలింగయ్య జయంతి.. గుడ్ న్యూస్ చెప్పిన అల్లు అర్జున్!

అల్లు రామలింగయ్య జయంతి.. గుడ్ న్యూస్ చెప్పిన అల్లు అర్జున్!
Advertisement

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా ఒక వైపు తన సినిమా పనులలో బిజీగా గడుపుతూనే మరోవైపు అల్లు అర్జున్(Allu Arjun) తన వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా విస్తరించుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అల్లు స్టూడియోస్, అల్లు సినిమాస్ అంటూ ఎన్నో వ్యాపారాలను ప్రారంభించి బిజీగా ఉన్నారు. సినిమాలు, వ్యాపార రంగంలో దూసుకుపోతున్న అల్లు అర్జున్ తాజాగా అభిమానులకు ఒక గుడ్ న్యూస్ చెప్పారు.

కొత్త ఆఫీస్ ఏర్పాటు చేసిన బన్నీ..

నేడు తన తాతయ్య అల్లు రామలింగయ్య (allu ramalingaiah) గారి జయంతి సందర్భంగా అల్లు అర్జున్ తన కొత్త ఆఫీస్ కి సంబంధించిన విషయాన్ని తెలియజేశారు .ఈయన హైదరాబాద్లో కొత్త ఆఫీస్ ఏర్పాటు చేయబోతున్నారు అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి అయితే నేడు ఈ ఆఫీస్ ఓపెన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఆఫీస్ కు అల్లు అర్జున్”ICONZA” అని పేరు పెట్టినట్లు తెలియజేశారు. ఇలా తన తాతయ్య అల్లు రామలింగయ్య గారి విగ్రహం ముందు తన కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫోటోని అల్లు అర్జున్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ..

ఐకాన్ స్టార్ పేరు స్ఫూర్తితో..

Advertisement

తాతయ్య అల్లు రామలింగయ్య గారి జయంతి సందర్భంగా(ఐకాన్జా) “ICONZA” కొత్త ఆఫీస్ ప్రారంభించడం చాలా ప్రత్యేకమైన అనుభూతిని కలిగించిందని తెలిపారు. ఇది కేవలం ఆఫీస్ మాత్రమే కాదు కొత్త కల కొత్త ప్రయాణానికి ఆరంభం అంటూ ఈయన ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఇలా అల్లు అర్జున్ హైదరాబాదులో కొత్త ఆఫీస్ ప్రారంభించారనే విషయాన్ని తెలియడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక అల్లు అర్జున్ ను అభిమానులు ఐకాన్ స్టార్ అని పిలుస్తుంటారు ఈ పేరు స్ఫూర్తిగానే తన కొత్త ఆఫీసుకు Iconza అనే పేరును పెట్టినట్టు తెలుస్తుంది. ఈ కొత్త ఆఫీస్ ఏర్పాటులో భాగంగా అల్లు అర్జున్ ప్రతి చిన్న విషయాన్ని చాలా అద్భుతంగా తనకు నచ్చిన విధంగా ఏర్పాటు చేయించుకున్నారని తెలుస్తుంది.

Advertisement

ఈ విధంగా అల్లు అర్జున్ కొత్త ఆఫీస్ ఏర్పాటు చేశారనే విషయాన్ని తెలియడంతో అభిమానులు కూడా అభినందనలు తెలుపుతున్నారు. అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే పుష్ప 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ హీట్ అందుకున్న ఈయన తన తదుపరి చిత్రాన్ని కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ(Atlee) దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు రాకా(Raaka) అనే టైటిల్ అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది దాదాపు 70% షూటింగ్ పనులు పూర్తి అయ్యాయని తెలుస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం.

Also Read: రవితేజ వివేక్ ఆత్రేయ సినిమాకు అదిరిపోయే టైటిల్ ఫిక్స్?

Related News

నటికి భారీ షాక్.. రూ. 89 కోట్లు పెనాల్టీ!

రవితేజ వివేక్ ఆత్రేయ సినిమాకు అదిరిపోయే టైటిల్ ఫిక్స్?

ది ప్యారడైజ్ డైరెక్టర్ శ్రీకాంత్ మోహన్ బాబును మోసం చేశాడా?

అక్టోబర్లో థియేటర్లలో విడుదల కాబోతున్న చిత్రాలివే!

మంచిగా ఉంటూనే తొక్కేయాలని చూస్తుంటారు.. మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు!

షూటింగ్లో గాయపడ్డ అమితాబ్ బచ్చన్.. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే?

మోహన్‌లాల్ తో నటించడంపై భాగ్యశ్రీ ఎమోషనల్ పోస్ట్!

Big Stories

Advertisement
×