OTT Movie : మలయాళం సినిమాలకు టాలీవుడ్ ప్రేక్షకులు బాగా అలవాటుపడిపోయారు. ఈ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. అంతలా మనసుకు హత్తుకుంటున్నాయి ఈ మలయాళీ డ్రామాలు. ఈ నేపథ్యంలో కేరళ గ్రామీణ ప్రాంతంలో జరిగే ఒక చక్కటి స్టోరీ, మళ్ళీ ప్రేక్షకులను అలరించడానికి వచ్చింది. ఈ సినిమా రీసెంట్ గా థియేటర్లలో కాకుండా, ఓటీటీలో నేరుగా విడుదలైంది. IMDbలో ఈ సినిమా 8.0/10 రేటింగ్ ను కూడా పొందింది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్
“సురభిల సుందర స్వప్నం” (Surabhila Sundara Swapnam) ఒక మలయాళ కామెడీ థ్రిల్లర్ సినిమా. దీనికి టోనీ మాథ్యూ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 2025న ఆగస్టు 1న థియేటర్ రిలీస్ లేకుండానే, సన్ నెక్స్ట్, ఓటీటీప్లే ఓటీటీలో నేరుగా విడుదలైంది. ఇందులో దయానా హమీద్, పాల్ విజి వర్గీస్, రాజలక్ష్మి రాజన్, సోనీ సోజన్, బీనా థంకచన్, స్టెబిన్ నటించారు. 1 గంట 54 నిమిషాల నిడివితో, మలయాళ భాషలో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది. ఇది తమిళం, తెలుగు, కన్నడ భాషలలో కూడా డబ్ చేయబడింది.
స్టోరీలోకి వెళితే
రాజేష్ (పాల్ విజి వర్గీస్) ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి. తన తండ్రి చికిత్స కోసం తన ఆస్తిని అమ్మిన తర్వాత, ఒక చిన్న స్టేషనరీ షాప్‌తో జీవిస్తుంటాడు. దీనివల్ల అతను తన కుటుంబ, ఇంటిని వదిలి వెళ్లవలసి వస్తుంది. ఈ సమయంలో తన స్నేహితుడు కుట్టప్పి (స్టెబిన్) సహాయంతో కొత్త ఇంటిని నిర్మించడం ప్రారంభిస్తాడు. రాజేష్ సొంతంగా భూమిని కొని, ఇంతకు ముందులా బతకాలని అనుకుంటాడు. అతను తన భార్య (రాజలక్ష్మి రాజన్) స్నేహితులతో కలిసి ఒక చిన్న కేరళ గ్రామంలో నివసిస్తూ, ఈ కలను సాకారం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఊహించని సంఘటనలు అతని ప్రయాణాన్ని అడ్డంకిగా మారుతుంటాయి. రాజేష్ జీవితంలో ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్ (దయానా హమీద్) రాకతో స్టోరీ కొత్త మలుపు తీసుకుంటుంది.
Read Also : పోలీసులే దొంగతనం చేస్తే… ఓటీటీలో సరికొత్త హీస్ట్ థ్రిల్లర్… ఈ డైరెక్టర్ థింకింగ్ కు దండం పెట్టాల్సిందే మావా?