E-Paper
Advertisement

తలుపులు తెరవలేరు… బయట అడుగుపెడితే బతకలేరు… తెలుగులోనే ఈ సై-ఫై సర్వైవల్ థ్రిల్లర్

తలుపులు తెరవలేరు… బయట అడుగుపెడితే బతకలేరు… తెలుగులోనే ఈ సై-ఫై సర్వైవల్ థ్రిల్లర్
Advertisement

Survival Thriller on OTT: ప్రపంచంలో ఎలాంటి విపత్తు వచ్చినా మనిషి బయటకు వెళ్లి బతికే అవకాశం ఉంటుంది. కానీ ఇంటి తలుపు దాటితే ప్రాణాలకే ప్రమాదం వస్తే… అలా ఇళ్ల తలుపులు తెరిచే అవకాశం కూడా లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది ? ఇలాంటి భయంకరమైన సర్వైవల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘ది లాస్ట్ హౌస్’ (The Last House 2026). ప్రపంచంలోని ప్రతి ఇంటి తలుపులు, కిటికీలు ఒక్కసారిగా శాశ్వతంగా లాక్ అయిపోవడం, బయట కనిపించని ప్రమాదకరమైన శక్తులు సంచరించడం వంటి ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమా ప్రేక్షకులను సస్పెన్స్ లో ముంచెత్తుతోంది. లూయిస్ లెటెరియర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గ్రెటా లీ, వాగ్నర్ మౌరా ప్రధాన పాత్రల్లో నటించారు. మరి ఈ సై-ఫై సర్వైవల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ వివరాలు ఏంటి? అనేది తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే…

ఒకరోజు ఉదయం ప్రపంచవ్యాప్తంగా ఊహించని పరిణామం జరుగుతుంది. మనుషులు తమ ఇళ్లలో నిద్రలేచే సమయానికి తలుపులు, కిటికీలు శాశ్వతంగా లాక్ అయిపోయి ఉంటాయి. ఎంత ప్రయత్నించినా వాటిని తెరవడం సాధ్యం కాదు. మొదట్లో ఇది ఏదో సాంకేతిక సమస్య అనుకుంటారు. కానీ కొద్దిసేపటికే అసలు ప్రమాదం ఏంటో అర్థమవుతుంది. ఇంటి బయటకు వెళ్లడం ప్రాణాంతకంగా మారుతుంది. బయట కనిపించని ఏదో శక్తి లేదా జీవులు మనుషుల ప్రాణాలను తీస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో బయటకు వెళ్లే అవకాశం లేకుండా, ఇంట్లోనే ఉండటం ఒక్కటే మార్గంగా మారుతుంది.

Advertisement

ఇలాంటి పరిస్థితుల్లో నలుగురు సభ్యులతో కూడిన డెల్గాడో కుటుంబం తమ ఇంట్లోనే చిక్కుకుపోతుంది. మొదట్లో ఇంట్లో ఉన్న ఆహారం, నీరు, ఇతర నిత్యావసరాలతో ఎలాగోలా రోజులు గడుపుతారు. కానీ రోజులు గడిచేకొద్దీ పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడం, ఆహార కొరత మొదలవడం, అవసరమైన వస్తువులు అందుబాటులో లేకపోవడం కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి.

ఇక్కడే సినిమా అసలు సర్వైవల్ డ్రామాగా మారుతుంది. బయటకు వెళ్లలేరు, ఇంట్లో ఉండటానికి అవసరమైన వనరులు కూడా క్రమంగా అయిపోతున్నాయి. అయినా కుటుంబం బతకాలి. అందుకోసం తమ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువును జాగ్రత్తగా ఉపయోగించుకోవాల్సి వస్తుంది. అయితే ఇంతకంటే పెద్ద ప్రశ్న బయట ఉన్న ప్రమాదం గురించే. అసలు ఆ ఇంటి తలుపులు ఎందుకు లాక్ అయ్యాయి ? ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది? బయట అడుగు పెట్టగానే మనుషులను చంపుతున్న ఆ అదృశ్య శక్తులు ఏంటి? వాటి నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉండటం నిజంగా సురక్షితమేనా ? అనే ప్రశ్నలు కథను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి.

Advertisement

దాదాపు ఐదేళ్ల పాటు ఈ కుటుంబం ఇంట్లోనే బందీలుగా జీవించాల్సి వస్తుంది. ఈ సుదీర్ఘ కాలంలో కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు దెబ్బతింటాయి. బతకడానికి అవసరమైన వస్తువుల కొరతతో పాటు, భయం, ఒంటరితనం, భవిష్యత్తుపై అనిశ్చితి వారిని మానసికంగా కూడా కుంగదీస్తాయి. క్రమంగా వారికి బయట ప్రపంచం గురించి కొన్ని సంకేతాలు అందుతాయి. దీంతో తమ ఇంట్లో ఉండటం నిజంగా రక్షణేనా లేదా మరొక పెద్ద ప్రమాదానికి దారి తీస్తుందా ? అనే అనుమానం మొదలవుతుంది. చివరకు ఆ అదృశ్య ప్రమాదం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి ? ఆ కుటుంబం ఐదేళ్ల బంధనం నుంచి బయట పడగలిగిందా ? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

తెలుగులో చూడొచ్చా ?

సినిమా ప్రత్యేకత ఏంటంటే ‘ఎ క్వైట్ ప్లేస్’, ‘బర్డ్ బాక్స్’ తరహాలో ప్రేక్షకులకు కనిపించని ప్రమాదం చుట్టూ కథను నిర్మించారు. బయట ఏం జరుగుతుందో పూర్తిగా తెలియని పరిస్థితిలో ఇంట్లోనే బతకాల్సి రావడం వల్ల, ప్రతి సన్నివేశంలోనూ టెన్షన్ కొనసాగుతుంది. సైన్స్ ఫిక్షన్, సర్వైవల్, మిస్టరీ అంశాలను కలిపి రూపొందించిన ఈ కాన్సెప్ట్ థ్రిల్లర్ ప్రియులను ఆకట్టుకునేలా ఉంటుంది. ‘ది లాస్ట్ హౌస్’ ఆగస్ట్ 7 నుంచి Netflixలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ ఆడియోతో పాటు హిందీ, తమిళం, కన్నడ భాషల్లో కూడా ఆడియో అందుబాటులో ఉంది. ఒక కుటుంబం ఐదేళ్ల పాటు ఇంట్లోనే బందీలుగా ఉంటే ఎలా బతుకుతుంది ? అసలు బయట ఉన్న ఆ అదృశ్య శక్తులు ఏంటి ? తలుపులు ఎందుకు శాశ్వతంగా లాక్ అయ్యాయి ? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుకునే సైన్స్ ఫిక్షన్, సర్వైవల్ థ్రిల్లర్ అభిమానులు ‘ది లాస్ట్ హౌస్’ను అస్సలు మిస్ అవ్వొద్దు.

Read Also: భార్య కోసం దెయ్యంగా మారిన భర్త… గోడలో దాచిన చీటీతో అదిరిపడే ట్విస్ట్

Tags

Related News

ఓటీటీలో రికార్డ్ సృష్టించిన ఇరుముడి.. ఎన్నో స్థానం అంటే?

పాడుబడిన భవంతిలో దెయ్యం… భయంతో పాటు కడుపుబ్బా నవ్వించే హారర్ కామెడీ

కొడుకు తల్లికంటే బేబీసిట్టర్ కే ఎక్కువ దగ్గరైతే… గుండెను పిండేసే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా

ఇంట్లో గది అద్దెకు ఇస్తే ఇదేం రచ్చ భయ్యా… మళ్లీ మొదలైన నవ్వుల హంగామా

గతాన్ని మర్చిపోయి దాక్కున్న గ్యాంగ్‌స్టర్‌… ప్రేమ కోసం మళ్లీ తుపాకీ పడితే… యాక్షన్ క్రైమ్ డ్రామా

సరదా ట్రిప్ కాస్తా దెయ్యాల టార్చర్‌గా మారితే… క్రేజీ హారర్ కామెడీ

పాట కోసం ప్రాణాలైనా ఇచ్చేంత పిచ్చి… కట్ చేస్తే పేరు తెచ్చిన పాటతోనే ఊహించని ట్విస్ట్… యూత్‌ఫుల్ మ్యూజికల్ డ్రామా

కూతురు కిడ్నాప్… పోలీసులు చేతులెత్తేయడంతో తండ్రి ఊచకోత…. హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×