రెస్టారెంట్‌లో కూర్చున్న రాజ్, కావ్య తమ పెన్‌డ్రైవ్ గురించి మాట్లాడుకుంటారు. ఆఫీసులో ఆ పెన్‌డ్రైవ్ శృతికి ఇచ్చారా అని కావ్య అడగ్గానే.. అప్పుడే ఇచ్చేశాను కదా అంటాడు రాజ్. దూరం నుంచి రాజ్, కావ్య మాటలు విన్న రౌడీలు అక్కడే తబలా వాయిస్తున్న వాళ్ళు రాగం, తాలం, శృతి అంటూ మాట్లాడుకోవడం కూడా విని వాళ్ల దగ్గరకు వెళ్లి శృతి ఎక్కడుందని అడుగుతారు. దీంతో తబలా వాళ్లు సంగీతం గురించి చెప్తుంటే తిట్టి వెళ్లిపోతారు రౌడీలు.
సీఐ ఇచ్చిన వార్నింగ్ గుర్తు చేసుకుని బాధపడుతుంది అప్పు తన రూంలో ఉన్న ఫైళ్స్ అన్ని విసిరిపడేస్తుంది. అప్పుడే రూంలోకి వచ్చిన కళ్యాణ్ పొట్టి ఏమైంది..? అసలు నువ్వు ఏం చేస్తున్నావు అని అడగ్గానే.. అప్పు బాధగా అయిపోయింది కూచి అంతా అయిపోయింది. ఇక ఈ కేసు ముందుకు నడవదు.. ఈ కేసును వదిలేయాల్సిందే.. అని చెప్పగానే.. ఏమంటున్నావు పొట్టి కేసును వదిలేయడం ఏంటి..? అని అడగ్గానే.. ఏం చేయను కూచి స్వయంగా సీఐ గారే వచ్చి ఈ కేసును వదిలేయమని.. మరో కేసును టేక్‌ఆప్ చేయమని చెబితే ఇక ఏం చేయాలి కూచి.. కేసును వదిలేయాల్సిందే.. అంటుంది. ఏమైనా చేయోచ్చు పొట్టి కానీ ఈ కేసు విషయంలో నువ్వు రోజు రోజుకు డిప్రెషన్‌లోకి వెళ్లిపోతున్నావు. ఆ సంగతి నీకు అర్థం అవుతుందా..? అంటూ చెప్తాడు.
ఇంత ప్రయత్నం చేశాను. నా హెల్త్ కూడా పక్కన పెట్టి ఈ కేసును ఓ కొలిక్కి తీసుకురావాలనుకున్నాను.. ఆ తల్లికి ఏదోలా మనఃశాంతిని ఇవ్వాలనుకున్నాను. కానీ ఏదీ జరగడం లేదు కూచి.. అంటూ అప్పు బాధపడుతుంటే.. దానికి డిప్రెష్ అవ్వాలా..? అంతా చేజారిపోయిందని బాధపడాలా..? గెలుసు అంటే అటక మీద ఉన్న గిన్నె కాదు పొట్టి స్టూలు ఎక్కి అందుకోవడానికి.. అది చెట్టు మీద ఉన్న పండు లాంటిది. ఆ పండు మనకు దక్కాలి అంటే ఆశపడే ఆలోచన ఆ ఆలోచనను సపోర్టు చేసే చేయి.. ఆ చేయికి ఆయుధమైన రాయిని పట్టుకునే మెలుకువ ఆ మెలుకువతో గురిపెట్టిన కన్ను.. ఇన్ని ఒకే సమయంలో ఫోకస్‌గా పని చేస్తేనే ఆ పండును కొట్టగలం.. అంతే కానీ అదంతా మర్చిపోయి ఇలా డీలా పడిపోతే ఎలా పొట్టి అంటూ కళ్యాణ్ చెప్పగానే..
అదే కూచి అదే ప్రయత్నం చేశాను.. అంతే ఎఫర్ట్ పెట్టాను. కానీ ఏ ఒక్క క్లూ దొరకలేదు.. ఏ ఒక్క క్లూ దొరకినా..? నేను ఏంటో నిరూపించుకునే దాన్ని. రేణుక గారు చెప్పిన మాటలు నమ్మడానికి ఏ ఆధారం కనిపించడం లేదు. ఒక్క ఆవిడ బాధ తప్ప.. అందుకే ఇక సీఐ గారు చెప్పినట్టు ఈ కేస్ క్లోజ్ చేయడం తప్పా ఇంక వేరే మార్గం లేదు అంటూ అప్పు బాధపడుతుంటే.. నువ్వు అలా బాధపడకు పొట్టి అంటూ కళ్యాణ్ ఓదారుస్తుంటే.. ఇంతలో అప్పుకు సుందరి అనే మహిళ ఫోన్ చేసి రేణుకు ఆత్మహత్యా ప్రయత్నం చేసింది అని చెప్తుంది. దీంతో అప్పు మరింత షాక్ అవుతుంది.
తర్వాత రేణుక ఇంటికి వెళ్తుంది అప్పు.. అక్కడికి సుందరి వచ్చి రేణుక చేయి కోసుకుని ఇలా చేసింది మేడం అని చెప్తుంది. రేణుక హస్బెండ్ ఎక్కడ అని అప్పు అడగ్గానే.. ఆయన ఊరెళ్లారట మేడం వస్తున్నారట అని సుందరి చెప్పగానే.. ఓకే ఇక మీరు వెళ్లొచ్చు అని చెప్పగానే.. సుందరి వెళ్లిపోతుంది. అప్పు, రేణుక దగ్గరకు వెళ్తుంది. ఎందుకు చావాలనుకున్నారు అని అడుగుతుంది. దీంతో రేణుక ఏడుస్తూ.. ఎందుకు బతకాలి మేడం.. ఒక సంవత్సరం నుంచి నా కూతురు కనిపించడం లేదని గుండెలు పగిలేలా చెప్తున్నా..? చుట్టూ ఉన్న వాళ్ల మాటలు నమ్ముతున్నారు కానీ ఈ కన్నతల్లి మాటలు అసలు నమ్మడం లేదు. అసలు నా కూతురు ఎక్కడుందో.. ఎన్ని కష్టాలు పడుతుందో.. తల్లిగా నేను బతికుండి కూడా తనను కనుక్కోలేకపోతున్నాను.. అలాంటప్పుడు నేను బతికి ఉండి లాభం ఏముంది చెప్పండి అంటూ ఏడుస్తుంది రేణుక..
దీంతో అప్పు ఒకవేళ మీరు చెప్పింది నిజమై మీ కూతురు బతికే ఉంటే తన కోసం ఎదురుచూస్తున్న ఒకే ఒక మనిషి మీరు అలాంటి మీరు కూడా తనను వదిలేసి వెళ్లిపోతే అప్పుడు తన పరిస్థితి ఏంటో మీరు ఆలోచించారా..? ఇన్ని రోజులు ఒపికగా ఎదురుచూశారు. మీ మాట నమ్మి నేను ముందుకు వచ్చేసరికి మీ నమ్మకాన్ని ఎందుకు కోల్పోతున్నారు.. అంటూ రేణుకను ఓదారుస్తుంది. ఇంట్లోంచి బయటకు వెళ్లి కారు దగ్గర నిలబడి ఆలోచిస్తుంటే.. ఇంతలో ఒక పాప వచ్చి తాను నిన్న అంజలిని చూశానని చెప్తుంది. ఎక్కడ చూశావు అని అప్పు అడగ్గానే.. వాళ్లింటి గేటు ముందు నిలబడి మమ్మీ అంటూ ఏడ్వడం చూశాను. తర్వాత రేణుక ఆంటీ ఏడుస్తూ కనిపించారు అని చెప్పగానే.. అంజలి ఎక్కడున్నా సరే కాపాడతాను అంటుంది అప్పు.
రౌడీలు రాత్రి అయ్యాక రాజ్ వాళ్ల రూంలోకి పెన్‌డ్రైవ్ దొంగతనానికి వెళ్తారు. రవితేజ రాజా ది గ్రేట్ సినిమా స్టైల్లో రౌడీలను ఓ ఆటాడుకుంటాడు రాజ్. పిచ్చకొట్టుడు కొట్టడంతో రౌడీలు పారిపోతారు. మరోవైపు ఇంట్లో ఉన్న రాహుల్ స్వప్న ముందు బాగా కష్టపడుతున్నట్టు కంప్యూటర్ ముందు కూర్చుని వర్క్ చేస్తుంటాడు.. ఇంతలో స్వప్న, రాహుల్ వైపు రొమాంటిక్ గా చూస్తుంది. దీంతో ఇదేంటి ఇంత అందంగా తయారైంది. అయినా నా నాటకం తెలియక ఇంతలా మారిపోయింది ఇది అని మనసులో అనుకుంటాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.