BigTV English

Kalka – Shimla: సిమ్లాకు వెళ్లే టూరిస్టులకు బ్యాడ్ న్యూస్, ఈసారి ఆ కల నెరవేరడం కష్టమే!

Kalka – Shimla:  సిమ్లాకు వెళ్లే టూరిస్టులకు బ్యాడ్ న్యూస్, ఈసారి ఆ కల నెరవేరడం కష్టమే!

రుతుపవనాల సమయంలో ప్రకృతి అందాలను చూసి ఎంజాయ్ చేసేందుకు చాలా మంది సిమ్లాకు వెళ్తుంటారు. పచ్చటి కొండలు, అద్భుతమైన లోయలు, ఆహా అనిపించే కల్కా- సిమ్లా టాయ్ ట్రైన్ జర్నీ చేస్తూ సరదాగా గడుపుతారు. అయితే, వర్షాకాలం ప్రారంభంలో సిమ్లా టూర్ ప్లాన్ చేసే టూరిస్టులకు అక్కడి రైల్వే అధికారులు బ్యాడ్ న్యూస్ చెప్పారు. 15 రోజుల పాటు కల్కా-సిమ్లా టాయ్ ట్రైన్ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ సేవలు ఆపేస్తారు? అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..


జూన్ లో 15 రోజుల పాటు టాయ్ ట్రైన్ సేవలు నిలిపివేత

జూన్ లో 15 రోజుల పాటు కల్కా- సిమ్లా టాయ్ ట్రైన్ సేవలను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అత్యవసర వంతెన మరమ్మతు పనుల కారణంగా కల్కా-సిమ్లా నారో గేజ్ ట్రాక్‌లోని అన్ని రైలు సేవలను నిలిపివేస్తున్నట్లు ఉత్తర రైల్వే ప్రకటించింది. సిమ్లాలోని సమ్మర్‌ హిల్ ప్రాంతంలో ఉన్న రైల్వే వంతెన భారీ వర్షాల కారణంగా తీవ్రంగా దెబ్బతింది. రైలు సేవలు కొనసాగేందుకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టింది. ఇప్పుడు, పూర్తిగా బాగు చేయాలని రైల్వే నిర్ణయించింది. మరమ్మతు పనులు జూన్ మొదటి వారం తర్వాత ప్రారంభం కానున్నాయి. ఈ పనులు పూర్తయ్యే సరికి దాదాపు 15 రోజులు పట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ సమయంలో కల్కా-సిమ్లా మార్గంలో రైళ్లను పూర్తిగా నిలిపివేయనున్నట్లు తెలిపారు.


యునెస్కో నిబంధనల మేరకు మరమ్మతు పనులు

వాస్తవానికి కల్కా-సిమ్లా రైల్వే లైన్ యునెస్కో ప్రపంచ వారసత్వ హోదాను కలిగి ఉంది. ఈ ప్రాంతంలో ఎలాంటి మరమ్మతు పనులు నిర్వహించాలన్నా, కచ్చితంగా వారసత్వ మార్గదర్శకాలకు లోబడి చేయాల్సి ఉంటుంది. ఐకానిక్ హిల్ రైల్వే  చారిత్రక, సాంస్కృతిక విలువలకు ఇబ్బందులు కలగకుండా నిర్వహించాలి. వంతెన అసలు డిజైన్‌ కు ఏమాత్రం డ్యామేజ్ కాకుండా చూసుకోవాలని ఇప్పటికే యునెస్కో ప్రకటించింది. అందుకే, 2023లో భారీ వర్షాలకు వంతెన దెబ్బతిన్నా, కేవలం తాత్కాలిక మరమ్మతులు చేసింది. ఇప్పుడు 15 రోజుల పాటు పరిసర ప్రాంతాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మరమ్మతులను చేపట్టబోతున్నారు.

జూన్‌లో సిమ్లాకు వెళ్లే పర్యాటకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఒకవేళ జూన్ లోనే సిమ్లాకు వెళ్లాలి అనుకునే పర్యాటకులు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంతకీ అవేంటంటే..

⦿ రైలు స్టేటస్ ను చెక్ చేయండి: అధికారిక భారతీయ రైల్వే వెబ్‌ సైట్ ద్వారా కల్కా-సిమ్లా రైల్వే మరమ్మతు పనుల గురించి తెలుసుకోవచ్చు. లేదంటే సమీప రైల్వే స్టేషన్‌ను సంప్రదించి పూర్తి వివరాలు పొందవచ్చు.

⦿ ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోండి: సమీప రైల్వే స్టేషన్లకు వెళ్లి, అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా వెళ్లడం ఉత్తమం.

⦿ ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్నారా?:  ఒకవేళ మీరు ఇప్పటికే రైలువ టికెట్లు బుక్ చేసుకుంటే రీషెడ్యూలింగ్ చేసుకోండి. లేదంటే క్యాన్సిల్ చేసుకని రీఫండ్ తీసుకోంది.

⦿ముందుగా ప్లాన్ చేసుకోండి: మీ ప్రయాణ ప్రణాళికను ముందుగా ప్లాన్ చేసుకోండి. అలా చేయడం వల్ల హడావిడి లేకుండా టూర్ ను ఎంజాయ్ చెయ్యొచ్చు.

Read Also: మాన్ సూన్ మాయాజాలంలో మైమరచిపోవాలా? ఈ ప్లేసేసెస్ కు కచ్చితంగా వెళ్లాల్సిందే!

Related News

IRCTC offer: IRCTC ప్యాకేజ్.. కేవలం రూ.1980కే టూర్.. ముందు టికెట్ బుక్ చేసేయండి!

Flight Travel: ప్రపంచంలో ఎక్కువ మంది ఇష్టపడే టూరిస్ట్ ప్లేసెస్ ఇవే, ఇంతకీ అవి ఎక్కడున్నాయంటే?

Travel Insurance: జస్ట్ 45 పైసలకే ట్రావెల్ ఇన్సూరెన్స్, 5 ఏళ్లలో ఎన్ని కోట్లు క్లెయిమ్ అయ్యిందంటే?

Zipline thrill ride: మీకు గాలిలో తేలాలని ఉందా? అయితే ఈ ప్లేస్ కు తప్పక వెళ్లండి!

Romantic Road Trip: సౌత్ లో మోస్ట్ రొమాంటిక్ రోడ్ ట్రిప్, ఒక్కసారైనా ట్రై చేయాల్సిందే!

Train Travel: రైలు ప్రయాణీకులకు ఇన్ని రైట్స్ ఉంటాయా? అస్సలూ ఊహించి ఉండరు!

Big Stories

×