E-Paper
Advertisement

వెళ్ళడానికి వీళ్లేదు..నానికి పోలీసులు బిగ్ షాక్!

వెళ్ళడానికి వీళ్లేదు..నానికి పోలీసులు బిగ్ షాక్!
Advertisement

Actor Nani: నాచురల్ స్టార్ నానికి హైదరాబాద్ పోలీసుల నుంచి నిరాకరణ ఎదురయింది. ఈయన నటించిన ది ప్యారడైజ్(The Paradise Movie) సినిమా మరికొద్ది నిమిషాలలో ప్రీమియర్లు ప్రసారం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రీమియర్ షో లను తన అభిమానులతో కలిసి చూడాలని నాని భావించారు ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ (RTC Cross Road) లో తన అభిమానులతో కలిసి ఈ సినిమా ప్రీమియర్ చూడటానికి తనకు అనుమతి ఇవ్వాలి అంటూ నాని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. అయితే రేవంత్ రెడ్డి ఇందుకు అనుమతి లోకల్ పోలీసులను అడిగి తీసుకోవాలని తెలియచేశారు. ఈ నేపథ్యంలోనే నాని తన అభిమానులతో కలిసి సినిమా చూడటం కోసం పోలీసులను అనుమతి కోరారు.

నానికి అనుమతి తెలుపని పోలీసులు..

ఇలా నాని అనుమతి కోరడంతో పోలీసుల నుంచి నిరాకరణ ఎదురైందని తెలుస్తోంది. నాని అభిమానులతో కలిసి సినిమా చూడటానికి వీలులేదని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ లో గణేష్ నిమజ్జన వేడుకలు జరుగుతున్నాయి. నేడు పదో రోజు కావడంతో పెద్ద ఎత్తున గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు మరోవైపు హుస్సేన్ సాగర్ లో వందలాది విగ్రహాలను నిమర్జనం చేస్తున్నారు అయితే ఇదే రహదారిలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకొని పోలీసులు నానికి అనుమతి తెలపలేదని తెలుస్తోంది.

గణేష్ నిమజ్జన వేడుకల నిమిత్తం…

Advertisement

నాని సినిమా చూడటం కోసం వస్తే పెద్ద ఎత్తున అభిమానులు కూడా తరలి వస్తారు. ఒకవైపు నాని అభిమానులను, మరోవైపు గణేష్ నిమజ్జన వేడుకలలో భాగంగా భద్రత కల్పించడం పోలీసులకు భారమవుతున్న నేపథ్యంలోనే పోలీసులు అనుమతి తెలపలేదని తెలుస్తోంది. అదేవిధంగా గతంలో జరిగిన కొన్ని సంఘటనలను దృష్టిలో పెట్టుకొని పోలీసులు నాని అభ్యర్థనను నిరాకరించారు. దీంతో నానికి అభిమానులతో కలిసి సినిమా చూడాలని కోరిక తీరకుండా పోయింది. ఇక నాని ఇదివరకే తాము ప్రజా భద్రతకు ఆటంకం కలగకుండా పోలీసుల నిర్ణయానికి గౌరవిస్తామని తెలిపారు.

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన..

ఇకపోతే గతంలో సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటను దృష్టిలో పెట్టుకొని పోలీసులు ఇప్పుడు అనుమతి ఇవ్వలేదని తెలుస్తుంది. పుష్ప 2 సమయంలో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ను సందర్శించగా అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో భాగంగా ఒక అభిమాని చనిపోవడం ఒక చిన్నారి ఇప్పటికీ కోలుకోలేని పరిస్థితిలో ఉన్నాయి. ఇక నేడు ఒకవైపు నిమర్జన కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసు భద్రతకు భారమవుతుందన్న నేపథ్యంలోనే నానికి అనుమతి ఇవ్వలేదు. ఇక ప్యారడైజ్ సినిమా విషయానికి వస్తే తల్లి కొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. నాని సినీ కెరియర్ లోనే ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Advertisement

Also Read: మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయ రాజాకు అరుదైన గౌరవం!

Related News

అక్కినేని కోడలు క్రేజ్ మాములుగా లేదుగా… ఏకంగా

జానీ మాస్టర్ భార్య పై దాడి..పోలీసులను ఆశ్రయించిన సుమలత!

నాని ‘ప్యారడైజ్’కి తొలిరోజే రూ.100 కోట్లా?ఆశకు హద్దుండాలి గురూ !

తరుణ్‌కు భారీ హిట్.. ఏవీఎస్‌కు మరో టెన్షన్! ‘అంకుల్’ వెనుక కథ ఇదేనా?

13 ఏళ్ల ప్రేమకు బ్రేక్.. విడిపోతున్న స్టార్ కపుల్..?

మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయ రాజాకు అరుదైన గౌరవం!

16 ఏళ్ల కష్టానికి నేనే సాక్ష్యం.. నాని వైఫ్ అంజనా పోస్ట్ వైరల్!

Big Stories

Advertisement
×