E-Paper
Advertisement

రూ.474 ధరకే.. 60 గంటల బ్యాటరీ లైఫ్ ఇచ్చే ఇయర్‌బడ్స్!

రూ.474 ధరకే.. 60 గంటల బ్యాటరీ లైఫ్ ఇచ్చే ఇయర్‌బడ్స్!
Advertisement

Kratos TW02 Earbuds: అతి తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లు.. కలిగిన వైర్‌ లెస్ ఇయర్‌ బడ్స్ కోసం వెతుకుతున్నారా? అయితే మీకోసం.. మార్కెట్లో ఒక సూపర్ డీల్ అందుబాటులో ఉంది. ప్రముఖ బ్రాండ్ నుంచి వచ్చిన Kratos TW02 Wireless Earbuds ప్రస్తుతం అమెజాన్ సేల్‌లో భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి. ఏకంగా 60 గంటల బ్యాటరీ లైఫ్, లేటెస్ట్ ఫీచర్లతో వస్తున్న ఈ ఇయర్‌బడ్స్ ధర కేవలం రూ. 474 మాత్రమే.
సాధారణంగా ఐదు వందల రూపాయల లోపు ఇయర్‌బడ్స్ వస్తే క్వాలిటీ సరిగ్గా ఉండదనే అపోహ చాలా మందిలో ఉంటుంది. కానీ.. ఆ అపోహలను పూర్తిగా పటాపంచలు చేస్తూ క్రాటోస్ సంస్థ అత్యంత తక్కువ ధరకు పవర్ ఫుల్ స్పెసిఫికేషన్లతో.. ఈ TW02 మోడల్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ ఇయర్‌బడ్స్ అందించే ప్రత్యేకతలు, ధరల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Kratos TW02 Wireless Earbuds ఫీచర్లు:

1.డిజైన్, వాటర్ రెసిస్టెన్స్:

ఈ ఇయర్‌ బడ్స్ చూడటానికి చాలా ట్రెండీగా, స్టైలిష్‌గా కనిపిస్తాయి. చెవుల్లో.. సరిగ్గా ఇమిడిపోయేలా ఎర్గోనామిక్ డిజైన్‌తో వీటిని రూపొందించారు. ఎంత సేపు చెవుల్లో పెట్టుకుని పాటలు విన్నా.. ఎలాంటి ఇబ్బంది కలగదు. అలాగే.. ఇవి IPX5 వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్‌ను కలిగి ఉన్నాయి. దీని వల్ల వర్షంలో నడుస్తున్నప్పుడు లేదా వ్యాయామం చేసేటప్పుడు చెమట పట్టినా ఇయర్‌బడ్స్‌కు ఎలాంటి డ్యామేజ్ కాదు. ప్రయాణాల్లో కూడా వీటిని ఈజీగా జేబులో లేదా బ్యాగ్‌లో పెట్టుకుని తీసుకెళ్లవచ్చు.

2.60 గంటల లాంగ్ బ్యాటరీ లైఫ్ :

Advertisement

ఈ ఇయర్‌బడ్స్ అతిపెద్ద హైలైట్ వీటి బ్యాటరీ బ్యాకప్ అనే చెప్పాలి. ఛార్జింగ్ కేస్‌తో కలిపి ఇవి అసాధారణంగా 60 గంటల పాటు ప్లేటైమ్‌ను అందిస్తాయి. ఒక సారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. రోజుల తరబడి ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరమే ఉండదు. అంతేకాకుండా.. ఇందులో లేటెస్ట్ టైప్ -సి సపోర్ట్ ఉంది. తద్వారా చాలా తక్కువ సమయంలోనే ఇయర్‌బడ్స్ పూర్తిగా ఛార్జ్ అవుతాయి.

3. బ్లూటూత్ v5.3, కనెక్టివిటీ:

ఇందులో లేటెస్ట్ బ్లూటూత్ v5.3 టెక్నాలజీని వాడారు. ఇది మీ స్మార్ట్‌ ఫోన్‌కు లేదా ఇతర పరికరాలకు అతి తక్కువ సమయంలో కనెక్షన్‌ను ఇస్తుంది. సిగ్నల్ కట్ అయ్యే సమస్య అస్సలు ఉండదు. అలాగే మీ ఫోన్‌ను టచ్ చేయకుండానే వాయిస్ అసిస్టెంట్ ద్వారా వివిధ పనులను ఈజీగా అసైన్ చేయొచ్చు.

Advertisement

Also Read: రూ.599కే..50 గంటల బ్యాటరీ లైఫ్,డ్యూయల్ పేరింగ్ ఇయర్‌బడ్స్!

4.నాయిస్ క్యాన్సలేషన్ :

బడ్జెట్ తక్కువగా ఉన్నప్పటికీ.. ఆడియో, కాల్ క్వాలిటీ విషయంలో ఈ ఇయర్‌ బడ్స్ అదరగొడతాయి. ఇందులో.. ప్రత్యేకమైన నాయిస్ క్యాన్సలేషన్ టెక్నాలజీ ఉంది. ఇది చుట్టు పక్కల ఉన్న శబ్దాలను తగ్గించి, మ్యూజిక్ పై పూర్తి ఏకాగ్రత కుదిరేలా చేస్తుంది. అలాగే ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు అవతలి వారికి మీ గొంతు స్పష్టంగా, లౌడ్‌గా వినిపించేలా క్లియర్ కాల్ ఫీచర్ కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.

5.ధర:

మార్కెట్లో అనేక రకాల బడ్జెట్ ఇయర్‌బడ్స్ లభిస్తున్నప్పటికీ.. ఇన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో కేవలం రూ.474 ధరకే లభించడం నిజంగా బెస్ట్ అనే చెప్పాలి.ప్రస్తుతం అమెజాన్ ఆఫర్స్‌లో .. భాగంగా ఈ మోడల్ ఇయర్‌బడ్స్ అత్యంత తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయి. తక్కువ బడ్జెట్‌లో .. ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ , మంచి సౌండ్ క్వాలిటీ కోరుకునే వారికి ఇది నిజంగా ఒక బెస్ట్ ఛాయిస్.

Related News

ఉచిత ఇంటర్నెట్ టీవీకి చెక్? టెలికాం నిబంధనల దిశగా ట్రాయ్ అడుగులు!

వామ్మో.. ఫోన్ అప్‌డేట్ వెనుక ఇంత ప్రాసెస్ ఉందా? కోడింగ్ నుంచి మీ మొబైల్ వరకు ఎలా వస్తుందంటే!

కరెంట్ పోయిన వెంటనే..తప్పకుండా ఆపేయాల్సిన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్

ఫోన్ స్టోరేజ్ ఫుల్ ప్రాబ్లమ్‌కి శాశ్వత పరిష్కారం.. ఈ 4 సెట్టింగ్స్ మార్చితే GBల కొద్దీ స్పేస్ ఫ్రీ!

గెలాక్సీ వాచ్‌పై ఆరెంజ్ డాట్ ఎందుకు వస్తుంది? దాని అర్థం ఏంటి?

వైర్డ్ ఇయర్‌ఫోన్స్‌లో నాయిస్ క్యాన్సిలేషన్ ఎందుకు ఇవ్వరో తెలుసా?

ఇంటికి సోలార్ ప్యానెల్స్ వేయిస్తున్నారా? బ్లాక్ అండ్ బ్లూ ప్యానెల్స్ మధ్య తేడా ఇదే !

Samsung Galaxy వాచ్‌ను స్మార్ట్‌గా వాడాలంటే ఈ 5 సెట్టింగ్స్ మార్చాల్సిందే!

Big Stories

Advertisement
×