BigTV English

OTT Movie : సడన్ గా వ్యాన్ లోకి ఊడిపడే శవం… డ్రైవర్ కు పిడి… గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్… తెలుగులోనే స్ట్రీమింగ్

OTT Movie : సడన్ గా వ్యాన్ లోకి ఊడిపడే శవం… డ్రైవర్ కు పిడి… గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్… తెలుగులోనే స్ట్రీమింగ్

OTT Movie : ఓటీటీలు ఎంట్రీ ఇచ్చాక భాష అనే అడ్డుగోడ పూర్తిగా చెరిగిపోయింది. ఏ భాషలోని సినిమాలు, సిరీస్ లను అయినా డబ్బింగ్ తో అన్ని భాషల్లోనూ చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆడియన్స్ అరచేతిలో పాన్ ఇండియా భాషల్లో వచ్చిన అన్ని సినిమాలను తమకు నచ్చిన భాషలో, నచ్చిన టైంలో చూస్తున్నారు. ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయే తెలుగు సిరీస్ అయినా ఓటీటీని ఊపేసింది. మరి ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఏ ఓటీటీలో ఉంది? అనే వివరాల్లోకి వెళ్తే…


హాట్ స్టార్ (Jio Hotstar)లో స్ట్రీమింగ్
ఈ సిరీస్ పేరు ‘దయా’ (Daya). 2023లో రిలీజ్ అయిన ఈ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కు పవన్ సాదినేని దర్శకత్వం వహించారు. ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్ దయా… తన వ్యాన్‌లోకి వచ్చిపడే ఒక డెడ్ బాడీ అతని జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తుంది. ఈ సిరీస్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. దీన్ని SVF బ్యానర్‌లో శ్రీకాంత్ మోహతా, మహేంద్ర సోని నిర్మించారు. ఇందులో J.D. చక్రవర్తి, ఈషా రెబ్బా, రమ్య నమ్బీసన్, జోష్ రవి, కమల్ కమరాజు, విష్ణుప్రియ భీమినేని, బబ్లూ పృథ్వీరాజ్ తదితరులు నటించారు. 8 ఎపిసోడ్‌లతో రిలీజ్ అయిన ఈ సిరీస్ లో ప్రతి ఎపిసోడ్ సుమారు 30 నిమిషాలు ఉంటుంది.

కథలోకి వెళ్తే…
దయా కథ కాకినాడలోని ఒక ఫిషింగ్ కమ్యూనిటీలో జరుగుతుంది. అక్కడ దయా (J.D. చక్రవర్తి) ఒక ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్ గా పని చేస్తాడు. ఆ వ్యాన్ లో చేపల రవాణా చేస్తూ కష్టపడి బ్రతుకుతుంటాడు. అతని భార్య అలివేలు (ఈషా రెబ్బా) గర్భవతిగా ఉంటుంది. అందుకే భార్యాబిడ్డలతో సంతోషంగా బ్రతకాలని కలలు కంటూ, రేయీ పగలూ తేడా లేకుండా పని చేస్తాడు. ఈ క్రమంలోనే రెండు రోజులుగా ఆహారం, నిద్ర లేకుండా పని చేస్తాడు.


ఈ నేపథ్యంలో అతని స్నేహితుడు ప్రభ (జోష్ రవి) ఒప్పించడంతో, డబ్బు కోసం ఒక కాన్సైన్మెంట్‌ను రవాణా చేయడానికి అంగీకరిస్తాడు. అయితే డెస్టినేషన్ కు చేరుకున్నప్పుడు, అతని వ్యాన్‌లో ప్రముఖ జర్నలిస్ట్ కవిత (రమ్య నమ్బీసన్) డెడ్ బాడీ ఉండడంతో షాక్ తింటాడు. బుల్లెట్ గాయంతో ఆమె చనిపోయి ఉంటుంది. అసలు ఆ బాడీ తన వ్యాన్ లోకి ఎలా వచ్చిందో అర్థంకాక, పోలీసులకు చెప్పే ధైర్యం చేయలేక ప్రభ సహాయంతో బాడీని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ కవిత ఒక ప్రముఖ రీజనల్ న్యూస్ ఛానెల్ జర్నలిస్ట్ అని తెలియడంతో మూవీ అసలైన మలుపు వస్తుంది. ఇంతకీ ఆ డెడ్ బాడీని హీరో ఏం చేశాడు? దయా ఈ ఉచ్చులో ఎలా చిక్కుకున్నాడు? చివరికి అందులో నుంచి ఎలా బయటపడ్డాడు ? అనేది స్టోరీ.

Related News

OTT Movie: పక్కింటి ఆంటీపై కోరిక.. చివరికి గుడిలో ఆమెతో అలాంటి పని.. కవ్విస్తూనే చివరికి కన్నీరు పెట్టించే మూవీ

OTT Web Series: ఈ 10 వెబ్ సీరిస్‌లు చూస్తే రాత్రంతా జాగారమే.. హెడ్ ఫోన్స్ పెట్టుకుని చూడండి మామ!

OTT Movie : పార్టీ చేసుకుంటే వీడి చేతిలో చావే… జనాల్ని గడగడా వణికించే సీరియల్ కిల్లర్… నరాలు తెగే సస్పెన్స్

OTT Movie : భర్త ఉండగానే మరో అబ్బాయితో… సీక్రెట్ ప్రియుడి హత్యతో అల్టిమేట్ ట్విస్ట్… గ్రిప్పింగ్ కన్నడ మిస్టరీ థ్రిల్లర్

OTT Movie : అమ్మాయిల చర్మాన్ని వలిచి అమ్ముకునే రాకెట్… వలపు వల వేసి ట్రాప్… కేక పెట్టించే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : డబ్బు కోసం అబ్బాయితో ఆ ఆట… ఫ్యామిలీ మొత్తాన్ని టార్గెట్ చేసే ఖతర్నాక్ కిలాడీ… ఊహించని క్లైమాక్స్

kantara Chapter 1 OTT: భారీ డీల్ కుదుర్చుకున్న కాంతార 2.. ఎన్ని కోట్లో తెలుసా?

OTT Movie : శవాన్ని దాచడానికి మాస్టర్ ప్లాన్… చెఫ్‌తో పెట్టుకుంటే ఇదే గతి… గ్రిప్పింగ్ కన్నడ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

×