E-Paper
Advertisement

Tere naam movie OTT : 23 సంవత్సరాల తరువాత సల్మాన్ మూవీ థియేటర్లలోకి… ఏ ఓటీటీలో ఉందంటే ?

Tere naam movie OTT : 23 సంవత్సరాల తరువాత సల్మాన్ మూవీ థియేటర్లలోకి… ఏ ఓటీటీలో ఉందంటే ?
Advertisement

Tere naam movie OTT : సల్మాన్ ఖాన్, భూమికా చావ్లా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘తేరే నాం’ (Tere Naam). ఈ సినిమాతోనే భూమిక బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. 2003లో వచ్చిన ఈ సినిమా ఇప్పటికి 23 ఏళ్లు పూర్తి చేసుకుంది. అయితే ఈ కల్ట్ క్లాసిక్ రొమాంటిక్ డ్రామా మళ్లీ థియేటర్లలోకి వచ్చేస్తోంది. ఇప్పుడు బిగ్ స్క్రీన్‌లో చూడాలని ఫ్యాన్స్ కూడా ఎక్సైట్ అవుతున్నారు. ఈ రీ రిలీజ్ సందర్భంగా సినిమా మళ్లీ ఓటీటీలో కూడా ట్రెండింగ్ అవుతోంది.

ఓటీటీలో కూడా ట్రెండింగ్

సతీష్ కౌశిక్ దర్శకత్వం వహించిన ‘తేరే నాం’ (Tere naam), 1999లో విక్రమ్ నటించిన ‘సేతు’ అనే తమిళ చిత్రానికి రీమేక్. హిమేష్ రేష్మీ అందించిన పాటలు అప్పట్లో పెద్ద హిట్ కూడా అయ్యాయి. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ హెయిర్ స్టైల్ ఆ సమయంలో యువతలో ఒక ట్రెండ్‌గా మారింది. ఇది 2026 ఫిబ్రవరి 27నుంచి PVR, INOX మల్టీప్లెక్స్‌లలో రీ-రిలీజ్ అవుతోంది. దీంతో ఈ సినిమా ఇప్పుడు ZEE5లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా అప్పట్లో ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ లో ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ సంగీత దర్శకుడు వంటి 8 విభాగాల్లో నామినేషన్లు కూడా పొందింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

రాధే మోహన్ (సల్మాన్ ఖాన్) అనే ఒక మాజీ కాలేజీ స్టూడెంట్ రౌడీలా తిరుగుతుంటాడు. అతను ఒక పూజారి కుమార్తె అయిన నిర్జర (భూమికా చావ్లా) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆమె చాలా అమాయకురాలు కూడా. మొదట్లో రాధే ప్రవర్తన చూసి ఆమె భయపడినప్పటికీ, అతనిని అర్థం చేసుకుని నెమ్మదిగా అతడిని ప్రేమిస్తుంది. అయితే విధి వీళ్ళ జీవితాన్ని మరోలా తీసుకెళ్తుంది. రాధే ఒక వీధి రౌడీల గోడవలో దాడికి గురవుతాడు. ఈ దాడిలో అతని తలకు తీవ్రమైన గాయం కావడంతో మానసిక సమస్యలు వస్తాయి. అతన్ని చికిత్స కోసం ఒక మానసిక ఆసుపత్రిలో చేర్పిస్తారు.

చాలా కాలం తర్వాత రాధే తిరిగి కోలుకుని ఆశ్రమం నుండి తప్పించుకుంటాడు. అతను నేరుగా నిర్జరను చూడాలని ఆమె ఇంటికి వెళ్తాడు. కానీ దురదృష్టవశాత్తు అప్పటికే నిర్జరకి బలవంతంగా మరొకరితో నిశ్చితార్థం జరగడంతో ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. ఆమె మరణవార్త విని కుంగిపోయిన రాధే, భరించలేక తిరిగి మానసిక ఆశ్రమానికే వెళ్ళిపోతాడు. ఈ చిత్రం ఒక గొప్ప ప్రేమకథగా మిగిలిపోతూనే అత్యంత విషాదకరంగా ముగుస్తుంది.

Advertisement

Read Also : ముసుగు సుందరిని ప్రేమించే కోటీశ్వరుడు… ఓటీటీలో ఆకట్టుకుంటున్న సరికొత్త ప్రేమ కథ

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×