E-Paper
Advertisement

తండ్రే హత్య చేశాడని అనుమానం… షాకింగ్ మర్డర్ మిస్టరీ

తండ్రే హత్య చేశాడని అనుమానం… షాకింగ్ మర్డర్ మిస్టరీ
Advertisement

Mystery Crime Thriller Series: మిస్టరీ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ సైకాలాజికల్ డ్రామాలు ఎప్పుడు వచ్చినా ఆడియన్స్ మాత్రం వదిలిపెట్టరు. ఎందుకంటే ఈ స్టోరీలు నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే ఇంటెన్స్ తో సాగుతాయి. అలాంటి మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లు ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్ లో ఉంటున్నాయి కూడా. ఇలాంటి జానర్ లో వచ్చిన సిరీస్ పేరే Delusion. ఇప్పుడు ఓటీటీలో ఆడియన్స్ దీనిని ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. ఒకవైపు చిన్న గ్రామంలో బాలుడి అదృశ్యం చుట్టూ తిరిగే ఉత్కంఠభరితమైన పోలీసు ఇన్వెస్టిగేటివ్, మరోవైపు డిమెన్షియా (మతిమరుపు) తో బాధపడే వ్యక్తి చుట్టూ అల్లుకున్న సస్పెన్స్ ఈ సిరీస్ ప్రత్యేకత. క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌తో పాటు మనస్తత్వాలు, జానపద కథల ఆధారంగా సాగే సస్పెన్స్ థ్రిల్లర్లను ఇష్టపడేవారికి ఈ జానర్ బాగా ఆకట్టుకుంటుంది. నటపోన్ ఫోర్న్‌ప్రఫా వాన్‌గా, జెస్పిపట్ టిలాపోర్న్‌పుట్ పోలీస్ ఆఫీసర్ పీట్‌గా, సురసక్ చయాత్ నరోంగ్‌గా నటించారు.

కథలోకి వెళ్తే…

వాన్ ఓ చిన్న పట్టణంలో స్కూల్ టీచర్‌గా పనిచేస్తుంటుంది. ఆమె తండ్రి నరోంగ్ వయసు మీద పడటంతో పాటు డిమెన్షియాతో బాధపడుతుంటాడు. ఒకరోజు గ్రామానికి చెందిన ఓ పిల్లాడు అడవిలో కనిపించకుండా పోతాడు. ఈ ఘటనతో ఊరిలో ఒక్కసారిగా భయం మొదలవుతుంది. గతంలో జరిగిన ఓ హత్య కేసును, ‘ఫీ పోంగ్’ అనే స్థానిక దెయ్యం కథను గ్రామస్తులు గుర్తు చేసుకుంటారు. చివరికి అనుమానాలన్నీ నరోంగ్ వైపే తిరుగుతాయి.

Advertisement

వాన్ మాత్రం తన తండ్రి హంతకుడు కాదని నమ్ముతుంది. నిజం ఏంటో తెలుసుకోవడానికి ఆమె స్వయంగా ఆధారాలను వెతకడం మొదలుపెడుతుంది. ఇదే సమయంలో కొత్తగా వచ్చిన పోలీస్ ఆఫీసర్ పీట్ కూడా కేసును దర్యాప్తు చేస్తుంటాడు. అడవిలో మిస్సింగ్ బాలుడి కోసం సాగించే గాలింపు సమయంలో ఊహించని ఆధారాలు బయటపడతాయి. నరోంగ్‌ను విచారించిన కొద్దీ పాత కేసుతో పోలికలు కనిపిస్తాయి. కానీ ఇది నిజంగా డిమెన్షియా వల్ల ఏర్పడిన గందరగోళమా? గ్రామస్తుల భయమే నిజాన్ని మసకబార్చిందా? లేక ఎవరో కావాలనే పాత రహస్యాన్ని దాచారా? అనే ప్రశ్నలు వెంటాడుతాయి. మరో హత్య జరగడంతో కేసు మరింత సంక్లిష్టంగా మారుతుంది. చివరికి హత్య చేసింది ఎవరు ? నరోంగ్ కి ఇందులో సంబంధం ఉందా ? మరో కుట్రకోణం దాగి ఉందా ? అనే విషయాలతో స్టోరీ క్లైమాక్స్ వరకు ఉత్కంఠంగా సాగుతుంది. ఈ మిస్టరీ మీరు కూడా తెలుసుకోవాలంటే ఈ సిరీస్ పై ఓ లుక్ వేయాల్సిందే.

తెలుగులో అందుబాటులో ఉందా?

చయన్ లాయోద్ట్రాకూల్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ లో నటపోన్ ఫోర్న్‌ప్రఫా, జెస్పిపట్ టిలాపోర్న్‌పుట్, సురసక్ చయాత్, ఆగస్ట్ వచిరవిత్ పైసార్న్‌కుల్వోంగ్ తదితరులు నటించారు. 6 ఎపిసోడ్లు ఉన్న ‘Delusion’ సెప్టెంబర్ 24 నుంచి Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. ఒరిజినల్ భాష థాయ్. Netflix లో ఇంగ్లీష్, స్పానిష్, పోలిష్, పోర్చుగీస్ డబ్బింగ్ ఆప్షన్లు ఉన్నాయి. తెలుగు ఆడియో ప్రస్తుతం అందుబాటులో లేదు. చిన్న గ్రామం, మిస్సింగ్ కేసు, కుటుంబ రహస్యాలు, డిమెన్షియా, జానపద భయం కలిసిన మిస్టరీ థ్రిల్లర్లు ఇష్టపడేవారికి ఈ సిరీస్ ఆసక్తికరంగా ఉంటుంది.

Advertisement

Read Also: ఆన్‌లైన్ స్కామర్లను ఆటపట్టించే కుర్రాళ్లు… ఏకంగా బిలియనీర్ క్రిప్టోనే కొట్టేస్తే? హై టెన్షన్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

Tags

Related News

కాంట్రాక్ట్ కిల్లర్ల గ్యాంగ్‌లో వరుస హత్యలు… అసలు మాస్టర్‌మైండ్ ఎవరు? హై టెన్షన్ క్రైమ్ థ్రిల్లర్

చనిపోయినా ఇంటి నుంచి కదలని శవం… వణుకు పుట్టించే హారర్ మిస్టరీ

నోట్‌బుక్ నుంచి మనుషులు బయటకొస్తే… పుస్తకం చేతులు మారడంతో మొదలయ్యే గందరగోళం…

ఉద్యోగం కోసం ఇరాక్‌కు వెళ్లిన అమ్మాయి… ఊహించని పరిస్థితుల్లో ఉగ్రవాదుల చెరలో… నరాలు కట్టయ్యే సర్వైవల్ థ్రిల్లర్

25 ఏళ్లుగా పిచ్చి పనులతో నవ్వించిన గ్యాంగ్… ఈసారి చేసే రచ్చే చివరిదా?

60 ఏళ్ల వయసులో తన చిన్ననాటి రూపమే ఎదురైతే… గత జ్ఞాపకాలతో మొదలయ్యే అద్భుత ప్రయాణం… ఎమోషనల్ ఫాంటసీ యానిమేషన్

నాని ది ప్యారడైజ్ వచ్చేది ఈ ఓటీటీలోనే…స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

Big Stories

Advertisement
×