E-Paper
Advertisement

OTT Movie : హీరో అవ్వాలనుకునే కామన్ మ్యాన్… అడుగడుగునా అవాంతరాలు… హార్ట్ టచింగ్ మళయాళ మూవీ

OTT Movie : హీరో అవ్వాలనుకునే కామన్ మ్యాన్… అడుగడుగునా అవాంతరాలు… హార్ట్ టచింగ్ మళయాళ మూవీ
Advertisement

OTT Movie : మలయాళం నుంచి విమర్శకుల ప్రశంసలు అందుకుంది ‘తలవర’ మూవీ. రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా, ఒక చర్మ సమస్య ఉన్న యువకుడి చుట్టూ తిరుగుతుంది. చర్మ సమస్యతో బాధపడుతూ, సమాజంలో అతను ఎలా నిలబడ్డాడన్నదే ఈ కథ. ఒక లో బడ్జెట్ సినిమా, అది కూడా ఎలాంటి స్టార్లు లేకుండా, మనసుకు తాకే కథనంతో ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఓటీటీలో కూడా దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇది ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

‘తలవర’ (Thalavara) 2025లో విడుదలైన మలయాళం కమింగ్ ఆఫ్ ఏజ్ డ్రామా మూవీ. అఖిల్ అనిల్‌కుమార్ డైరెక్షన్‌లో అర్జున్ అశోకన్ రేవతి సర్మా ప్రధాన పాత్రల్లో నటించారు. షెబిన్ బేకర్ ప్రొడక్షన్స్, మహేష్ నారాయణన్ నారేటివ్స్ పతాకాలపై ఈ సినిమా నిర్మాణం జరిగింది. ఈ సినిమా 2025 ఆగస్టు 22న థియేటర్లలో విడుదలైంది. అక్టోబర్ 29 నుంచి prime videoలో తెలుగు, తమిళం, కన్నడ, హిందీలో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

జ్యోతిష్ అనే 24 ఏళ్ల అబ్బాయి కేరళలోని ఒక చిన్న ఊర్లో తల్లితో కలిసి ఉంటాడు. చిన్నప్పటి నుంచీ అతనికి చర్మంపై తెల్లని మచ్చలు ఉంటాయి. ఈ చర్మవ్యాధి వల్ల ఊరంతా అతన్ని ఎగతాళి చేస్తుంటారు. స్కూల్‌లో అయినా, బస్టాండ్‌లో అయినా, గుడి ముందు అయినా అతన్ని చిన్న చూపు చూస్తుంటారు. దాంతో జ్యోతిష్ బయటికి రావాలంటేనే భయపడుతుంటాడు. కానీ అతను పెయింటింగ్ వేస్తూ అతని బాధలను మరచిపోతుంటాడు. అతని డ్రాయింగ్స్ చూస్తే ఎవరైనా షాకవుతారు.  అంత టాలెంట్ ఉంది కానీ ఎవరూ అతన్ని గుర్తించరు. అతనికి సినిమాల్లో కూడా నటించాలని కోరిక ఉంటుంది. ఒక రోజు అతని తల్లి ఆర్ట్ ఫెస్టివల్ లో పాల్గొనమని పంపిస్తుంది. అక్కడికి వెళ్లినప్పుడు రేవతి అనే అమ్మాయిని కలుస్తాడు. రేవతి చాలా బోల్డ్, నవ్వుతూ మాట్లాడే అమ్మాయి. జ్యోతిష్ డ్రాయింగ్స్ చూసి అతన్ని మెచ్చుకుంటుంది. మొదటిసారి ఎవరో అతని మచ్చల్ని కాకుండా అతని టాలెంట్‌ని చూసి మాట్లాడటంతో అతను సంతోషపడతాడు.

Read Also : ముసలి సర్పంచ్ తో యంగ్ అమ్మాయి సరసాలు… ఆ అందం వెనుక అపాయం కూడా… ‘అంజలీ’ ఇలాంటి సిరీస్ లోనా ?

Advertisement

అదే రోజు నుంచి ఇద్దరూ ఫ్రెండ్స్ అవుతారు. రేవతి అతన్ని బయటికి తీసుకొస్తుంది. మోటివేషన్ ఇస్తూ ధైర్యం చెబుతుంది. అదే సమయంలో ఒక ఫిల్మ్ డైరెక్టర్ యాక్టింగ్ ఆడిషన్ పెడత్తాడు. జ్యోతిష్ ఫ్రెండ్స్ బలవంతం మీద వెళ్తాడు. అక్కడ అతని లుక్ చూసి అందరూ నవ్వుతారు. ఇతన్ని తీసుకుంటే సినిమా ఫ్లాప్ అయిపోతుందని అవమానిస్తారు. కానీ సినిమాలో ఒక చిన్న రోల్ ఇస్తారు. షూటింగ్‌లో అతను అదిరిపోతాడు. డైరెక్టర్ కూడా షాక్ అవుతాడు. ఆతరువాత స్టోరీ మరిన్ని మలుపులు తిరుగుతుంది. చివరికి జ్యోతిష్ కి తన మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుందా ? రేవతితో లవ్ ట్రాక్ ఏమవుతుంది ? సినిమా ప్రయాణం ఎంతవరకు సక్సెస్ అవుతుంది ? అనే విషయాలను, ఈ సినిమాని చూసి తెలుసుకోండి.

 

 

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×