OTT Movie : కానిబాలిజం సినిమాలు ఇప్పటిదాకా ఎన్నో వచ్చాయి. కానీ అందులో కొన్ని సినిమాలను చూసినప్పుడు మాత్రమే వెన్నులో వణుకు పుడుతుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో కూడా ఇలాంటి ఓ ఇంట్రెస్టింగ్ సీన్ ఉంటుంది. దాన్ని చూశాక నెవర్ బిఫోర్ సీన్స్ అంటూ వణికిపోవడం ఖాయం. మరి ఈ సినిమా పేరేంటి? కథ ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…
కథలోకి వెళ్తే…
ఈ చిత్రం ఒక బ్లాక్ ఫ్రైడే సేల్‌లో రైట్ మార్ట్ సూపర్ స్టోర్‌లో జరిగిన గందరగోళంతో మొదలవుతుంది. ఇక్కడ జనం తొక్కిసలాటలో అమండా కొలిన్స్ సహా ముగ్గురు మరణిస్తారు. జెస్సికా రైట్ (నెల్ వెర్లాక్), స్టోర్ ఓనర్ థామస్ రైట్ (రిక్ హాఫ్‌మన్) కూతురు, ఆమె స్నేహితులు (గాబీ, ఇవాన్, స్కూబా, యూలియా) ఈ సంఘటనలో పరోక్షంగా ఇన్వాల్వ్ అవుతారు. ఒక సంవత్సరం తర్వాత, జాన్ కార్వర్ అనే మాస్క్ వేసుకున్న కిల్లర్ (పిల్‌గ్రిమ్ హ్యాట్ ధరించి) ఈ గందరగోళంలో పాల్గొన్న వారిని టార్గెట్ చేస్తూ హత్యలు చేయడం మొదలు పెడతాడు.
మొదటి బాధితురాలు వెయిట్రెస్ లిజ్జీ. ఆమె గతంలో అమండా మరణానికి బాధ్యురాలు అవుతుంది. సినిమాలో ఒక ముఖ్యమైన సన్నివేశంలో జాన్ కార్వర్ ఒక బాధితురాలిని వండే సన్నివేశం ఉంటుంది భయ్యా నెక్స్ట్ లెవెల్ అంతే. ఈ సన్నివేశంలో ఒక ఓవెన్‌లో మనిషి శరీరాన్ని థాంక్స్‌గివింగ్ డిన్నర్ థీమ్ తో వండుతాడు. ఈ సీన్ కు హారర్ అండ్ బ్లాక్ కామెడీని మిక్స్ చేస్తూ, కానిబాలిజం లేకపోయినా, మనుషుల్ని వండడం అనే అనే ఒళ్లు జలదరించే సీన్ తో డైరెక్టర్ మెంటలెక్కిస్తాడు.
ఇక కార్వర్ జెస్సికా స్నేహితులను ఒక్కొక్కరినీ దారుణంగా హత్య చేస్తాడు. థాంక్స్ గివింగ్ పరేడ్‌లో ట్రాప్‌లు, కిడ్నాప్‌లు, లైవ్‌స్ట్రీమ్ హత్యలతో అందరినే బెంబేలెత్తిస్తాడు. షెరీఫ్ ఎరిక్ న్యూలన్ (పాట్రిక్ డెంప్సీ), జెస్సికా కార్వర్‌ను ఆపడానికి ప్రయత్నిస్తారు. క్లైమాక్స్‌లో కార్వర్ ఎవరు అనేది వెల్లడవుతుంది. అసలు ఆ కిల్లర్ ఎవరు? తొక్కిసలాటలో చనిపోయిన వారికి దీంతో సంబంధం ఏంటి? చివరికి ఆ కిల్లర్ నుంచి తప్పించుకున్నారా లేదా? అనేది స్టోరీ.
Read Also : యాక్టర్ అవ్వాలని వెళ్తే ఇంకేదో అయ్యారు … ఒక్కొక్కరిదీ ఒక్కో స్టోరీ… బుగ్గలు వాచి పోయే కామెడీ ఎంటర్టైనర్
రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్
2023లో తెరపైకి వచ్చిన ThanksGiving మూవీ ఎలి రాత్ దర్శకత్వంలో వచ్చిన కామెడీ-హారర్-స్లాషర్ చిత్రం. పాట్రిక్ డెంప్సీ, నెల్ వెర్లాక్, ఆడిసన్ రే, రిక్ హాఫ్‌మన్ ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది అమెరికాలోని ప్లైమౌత్, మసాచుసెట్స్‌లో, థాంక్స్‌గివింగ్ హాలిడే బర్త్‌ప్లేస్‌లో జరుగుతుంది. Netflix, Amazon Prime Video ఓటీటీలలో హిందీ, తెలుగు సబ్ టైటిల్స్ తో స్ట్రీమింగ్ అవుతోంది.