BigTV English

OTT Movie : బాబోయ్… అమాయకురాలు అనుకుంటే అడ్డంగా నరికేసే ఆడ సైకో… ఈ పిల్ల పిశాచి వేషాలకు మెంటలెక్కాల్సిందే

OTT Movie : బాబోయ్… అమాయకురాలు అనుకుంటే అడ్డంగా నరికేసే ఆడ సైకో… ఈ పిల్ల పిశాచి వేషాలకు మెంటలెక్కాల్సిందే

OTT Movie : సైకో సినిమాలు చూస్తున్నంత సేపు గుండె జలదరిస్తూ ఉంటుంది. వీటిలో సైకో కిల్లర్ చేసే హత్యలు వెన్నులో వణుకు పుట్టిస్తుంటాయి. ఈ సినిమాలు చివరివరకు ఉత్కంఠభరితంగా నడుస్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఒక 9 ఏళ్ల అమ్మాయి తన సైకిక్ స్వభావంతో చేసే దారుణ చర్యల చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా, సైకలాజికల్ థ్రిల్లర్, ఫ్యామిలీ డ్రామాతో ఆకట్టుకుంటుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? స్టోరీ ఏమిటి ? ఎందులో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …


కథలోకి వెళ్తే

డేవిడ్ గ్రాస్‌మాన్ అనే ఒక సింగిల్ ఫాదర్, తన 9 ఏళ్ల కూతురు ఎమ్మాని ఒక పర్ఫెక్ట్ చైల్డ్‌గా భావిస్తాడు. ఎమ్మా తెలివైన, మర్యాదస్తురాలైన అమ్మాయిగా కనిపిస్తుంది. కానీ ఆమెలో ఎమోషన్స్ లేని ఒక సైకిక్ స్వభావం ఉందని డేవిడ్‌కి తెలియదు. స్కూల్‌లో ఒక ఫీల్డ్ ట్రిప్ సమయంలో, ఎమ్మా తన క్లాస్‌మేట్ రామన్‌ని ఒక కొండ మీద నుంచి తోసి చంపేస్తుంది. ఎందుకంటే అతను ఆమెను ఒక ఆర్ట్ కాంపిటీషన్‌లో ఓడించాడు. ఈ ఘటనను యాక్సిడెంట్‌గా చూపించి, ఎమ్మా అందరినీ మభ్యపెడుతుంది. కానీ ఆంటీ క్లోయి అనే ఒక సైకియాట్రిస్ట్, ఎమ్మా ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేస్తుంది. డేవిడ్ మొదట క్లోయి అనుమానాలను తోసిపుచ్చినా, ఎమ్మా టీచర్ మిస్. ఎలిస్ ని రహస్యంగా బెదిరించడం, స్కూల్ జనిటర్‌ని అనుమానాస్పద స్థితిలో చంపడం వంటి సంఘటనలు జరిగినప్పుడు అతనికి సందేహం మొదలవుతుంది. ఎమ్మా తన చర్యలను దాచడానికి అబద్ధాలు చెబుతూ, అందరినీ మానిప్యులేట్ చేస్తుంటుంది.


ఆమె గతంలో తన తల్లి మరణం వెనక కూడా ఆమె హస్తం ఉందని సూచనలు వస్తాయి. క్లోయి, ఎమ్మాని సైకియాట్రిక్ అసెస్‌మెంట్‌కి తీసుకెళ్లాలని సలహా ఇస్తుంది. కానీ ఎమ్మా ఆమెను కూడా టార్గెట్ చేస్తుంది. ఎమ్మా క్లోయి కారును టాంపర్ చేసి, ఆమెను యాక్సిడెంట్‌లో చంపడానికి ప్రయత్నిస్తుంది. కానీ క్లోయి ఈ ప్రమాదం నుంచి తృటిలో బయటపడుతుంది. డేవిడ్ ఎమ్మా డైరీలో ఆమె చేసిన హత్యల గురించి రాసిన వివరాలు చూసి షాక్ అవుతాడు. ఎమ్మా తన తండ్రిని కూడా చంపాలని ప్లాన్ చేస్తుందని తెలిసి, డేవిడ్ ఆమెను ఆపడానికి నిర్ణయించుకుంటాడు. క్లైమాక్స్‌లో ఎమ్మా వాళ్ల ఇంటికి నిప్పు పెట్టి, డేవిడ్‌ని చంపాలని చూస్తుంది. కానీ డేవిడ్ ఆమెను ఒక గదిలో లాక్ చేసి, ఇంటిని కాల్చేస్తాడు. తనతో పాటు ఎమ్మాను కూడా చంపేస్తాడు. అయితే ఎండింగ్‌లో ఒక ఊహించని ట్విస్ట్ ఉంది. ఎమ్మా బయటపడి, క్లోయి ఇంట్లో కనిపిస్తుంది, ఆమెను “ఆంటీ” అని పిలుస్తూ, తన మానిప్యులేషన్‌ని కొనసాగిస్తుంది. ఇక ఈసినిమా సీక్వెల్‌కి దారితీస్తూ ముగుస్తుంది.

రెండు ఓటీటీలలో

‘ది బాడ్ సీడ్’ (The bad seed) అమెరికన్ సైకలాజికల్ హారర్ సినిమా. రాబ్ లోవ్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో మాకెన్నా గ్రేస్ (ఎమ్మా గ్రాస్‌మాన్), రాబ్ లోవ్ (డేవిడ్ గ్రాస్‌మాన్), ప్యాటీ మక్‌కార్మాక్ (డా. మార్చ్), సారా డగ్డేల్ (క్లోయి), మార్సి టి. హౌస్ ప్రధానపాత్రలో నటించారు. Tubi, Amazon Prime Video లలో ఈ సినిమా అందుబాటులో ఉంది. 87 నిమిషాల నిడివితో IMDbలో 5.9/10 రేటింగ్ ను పొందింది.

Read Also :  ఆ సౌండ్స్ వింటే ఈ దెయ్యానికి పూనకాలే… అమ్మాయి వెంటపడి అరాచకం… కల్లోనూ వెంటాడే హర్రర్ సీన్స్

Related News

OTT Movie : పిల్లల్ని తినేసే నల్ల పిశాచి… మోస్ట్ స్కేరీయెస్ట్ హర్రర్ మూవీ… రాత్రిపూట ఒంటరిగా చూడకూడని మూవీ

OTT Movie : రోబోతో ఇదేం పాడు పనిరా అయ్యా… అది రివేంజ్ మోడ్ లో చేసే అరాచకం రచ్చ రచ్చే

OTT Movie : స్కూల్లో మిస్టీరియస్ మరణాలు… ఆ పని చేసే స్టూడెంట్సే ఈ దెయ్యం టార్గెట్… దడ పుట్టించే తమిళ హర్రర్ మూవీ

OTT Movie : భార్య చర్మం వలిచి ఇదెక్కడి దిక్కుమాలిన పనిరా అయ్యా… చేతబడిని నమ్మనోళ్లు చూడాల్సిన మూవీ

OTT Movie : మనుషుల్ని వెంటాడి చంపే నీడ… పిచ్చెక్కించే ట్విస్టులు… మతిపోయే మిస్టరీ థ్రిల్లర్

Big Stories

×