E-Paper
Advertisement

OTT Movie : ఇవాళ ఓటీటీలోకి వచ్చేసిన వివాదాస్పద మూవీ ‘ది బెంగాల్ ఫైల్స్’… ఎక్కడ చూడొచ్చంటే ?

OTT Movie : ఇవాళ ఓటీటీలోకి వచ్చేసిన వివాదాస్పద మూవీ ‘ది బెంగాల్ ఫైల్స్’… ఎక్కడ చూడొచ్చంటే ?
Advertisement

OTT Movie : వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన వివాదాస్పద మూవీ ‘ది బెంగాల్ ఫైల్స్’ ఓటిటిలోకి వచ్చేసింది. హిందువుల ఊచకోత ప్రధాన అంశంగా, తెరకెక్కిన ఈ సినిమా కలకత్తాలో బ్యాన్ అయ్యి, మమతా బెనర్జీకి వివేక్ అగ్నిహోత్రి ఓపెన్ లెటర్ రాసే వరకు వెళ్ళింది. కలకత్తాలో జరిగిన భయంకరమైన హిందూ జెనోసైడ్‌ని కళ్ళకు కట్టినట్టు చూపించిన ఈ సినిమా, హాట్ డిబేట్‌లతో వివాదాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. వివేక్ ఇప్పటికే ‘ది కాశ్మీర్ ఫైల్స్’ తాష్కేంట్ ఫైల్స్‌ లాంటి వివాదాస్పద సినిమాలు తీసి వార్తల్లో నిలిచాడు. ఇండియా, పాకిస్థాన్ విభజన సమయంలో జరిగిన అతిపెద్ద మారణహోమాన్ని ఇప్పుడు కళ్ళముందు ఉంచాడు. దాదాపు ఆ గొడవల్లో వేళల్లో చనిపోయినట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా అప్పటి రాజకీయ నాయకులు, ఏం చేస్తున్నారనేది మొదటి ప్రశ్నగా మిగిలిపోయింది. మరి దీనికి సమాధానం ఈ సినిమాలో దొరుకుతుందేమో ఒక సారి చుస్తే తెలుస్తుంది. ఇది ఏ ఓటీటీలోకి వచ్చింది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో వచ్చిన ఈ ‘ది బెంగాల్ ఫైల్స్’ 2025 సెప్టెంబర్ 5న థియేటర్స్‌లో విడుదలై, నవంబర్ 21 నుంచి జీ 5 ఓటీటీలోకి వచ్చింది. ఇందులో మిథున్ చక్రవర్తీ, అనుపమ్ ఖేర్, పల్లవి జోషీ, దర్శన్ కుమార్, సాస్వత చటర్జీలు మెయిన్ రోల్స్ లో నటించారు. హిందీ ఒరిజినల్‌తో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ డబ్బింగ్ లో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ప్రెజెంట్ డేలో కోల్‌కతాలో ఒక హిందూ అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. ఈ కేసు సీబీఐ ఆఫీసర్ రాహుల్ శర్మ చేతికి వస్తుంది. ఇన్వెస్టిగేషన్ మొదలెట్టగానే అతనికి కొన్ని పాత ఫైల్స్ దొరుకుతాయి. ఇందులో 1946లో బెంగాల్‌లో జరిగిన భయంకరమైన హిందూ ఊచకోతకు సంబంధించినవి ఉంటాయి. ఆ రోజుల్లో లక్షలాది హిందువులు లపై దాడులు, బలాత్కారాలు జరిగాయి, ఇళ్లు దగ్ధం అయ్యాయి, కానీ ఈ చరిత్రని పాఠ్యపుస్తకాల్లో దాచేశారని ఆ ఫైల్స్ చూస్తే తెలుస్తుంది. అయితే ఇప్పుడు జరిగిన కిడ్నాప్ కూడా ఆ 80 ఏళ్ల పాత కుట్రకి లింక్ ఉందని కనిపెడతాడు శర్మ.

Read Also : పెళ్లి ఒకరితో, పిల్లలు మరొకరితో… ఫ్యూజులు అవుటయ్యే కథ… తెలుగు సినిమానే

Advertisement

సినిమా మొత్తం రెండు టైమ్‌లైన్స్‌లో నడుస్తుంది. 1946లో కలకత్తా వీధుల్లో ఏం జరిగింది, ఎలా ఒక్క రోజులోనే వేలాది మంది హిందువులు చనిపోయారు. నోఖాలీలో ఎలా మహిళల్ని, పిల్లల్ని టార్గెట్ చేశారనే నిజాలను రియలిస్టిక్‌గా చూపిస్తారు. జిన్నా, గాంధీ, నెహ్రు పాత్రలు ఇందులో కీలకంగా ఉంటాయి. ప్రెజెంట్‌లో రాహుల్ ఆ రహస్యాల్ని బయటపెడుతుంటే, బెంగాల్ రాజకీయ నాయకులు, కొంతమంది మీడియా, ఇంటెలిజెన్స్ వాళ్లే ఈ చరిత్రని మళ్లీ దాచాలని ప్రయత్నం చేస్తారు. మిథున్ చక్రవర్తీ, అనుపమ్ ఖేర్ లాంటి సీనియర్స్ ఆ టైమ్‌లోని పొలిటికల్ పాత్రల్లో కనిపిస్తారు. 3 గంటలకు పైగా ఉన్న ఈ సినిమాను, ఇప్పుడు ఇంట్లోనే చూసేయండి.

 

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×