E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

బొమ్మను చూసుకోవడానికి వచ్చే బేబీ సిట్టర్… ఊహించని ట్విస్ట్‌లతో సాగే సైకలాజికల్ హారర్ థ్రిల్లర్

బొమ్మను చూసుకోవడానికి వచ్చే బేబీ సిట్టర్… ఊహించని ట్విస్ట్‌లతో సాగే సైకలాజికల్ హారర్ థ్రిల్లర్
Advertisement

Psychological Horror Thriller : బేబీ సిట్టర్ అంటే చిన్న చిన్న పిల్లలను చూసుకోవడానికి పనిచేసే ఆయాలు. పాలు తాగే చంటి పిల్లల దగ్గర నుంచి దాదాపు టీనేజర్ల వరకు చూసుకోవడానికి బేబీ సిట్టర్లు ఉంటారు. అయితే ఇలా పిల్లల్ని చూసుకోవడం కాకుండా ఒక బొమ్మకు బేబీ సిట్టర్ కావాలి అంటే వాళ్ళని మనం పిచ్చోళ్ళలా చూస్తాం. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో మాత్రం అచ్చం ఇదే జరుగుతుంది. కానీ ఆ తర్వాతే ఉంటుంది అసలు ట్విస్ట్. ఈ మూవీ పేరు ‘ది బాయ్’ (The Boy). 2016లో విడుదలైన అమెరికన్ సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్ మూవీ ఇది. ఓ పెద్ద భవనంలో బతికున్న బాబు అనుకుని ఒక బొమ్మను చూసుకోవడానికి కేర్ టేకర్ గా వస్తుంది హీరోయిన్. ఇక ఇందులో దయ్యం భయం కంటే మైండ్ గేమ్స్ ఎక్కువగా ఉంటాయి. మరి బుర్రకు పదును పెట్టే ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? అనే వివరాల్లోకి వెళితే…

కథలోకి వెళ్తే…

అమెరికన్ యువతి గ్రెటా ఎనాన్స్ మన హీరోయిన్ పేరు. తనకు సంబంధించిన ఒక భయంకరమైన గతాన్ని మర్చిపోవడానికి ఆమె బేబీ సిట్టర్ గా మారడానికి సిద్ధమవుతుంది. అందులో భాగంగా ఇంగ్లాండ్ లోని ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్న పెద్ద భవనానికి వస్తుంది. అక్కడ ఆమె హీల్ షైర్ అనే వృద్ద దంపతుల ఇంట్లో నానీగా చేరుతుంది. అయితే ఆ దంపతులు తమ ఎనిమిదేళ్ల కొడుకు బ్రామ్స్ ను గ్రెటాకు పరిచయం చేస్తారు. ఇక్కడ వచ్చే షాకింగ్ ట్విస్ట్ అంటే అతను మనిషి కాదు ఒక పింగాణి బొమ్మ.

Advertisement

మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే వాళ్ళబ్బాయి 20 ఏళ్ల క్రితం ఒక అగ్నిప్రమాదంలో చనిపోయి ఉంటాడు. ఏదైతేనేం మొత్తానికి హీరోయిన్ వాళ్ళ కొడుకుగా ఫీల్ అవుతున్న ఆ బొమ్మను చూసుకోవడానికి ఒప్పుకుంటుంది. ఈ క్రమంలోనే ఆ వృద్ధ దంపతులు ఒక లాంగ్ ట్రిప్ ప్లాన్ చేస్తారు. అయితే వెళ్తూ వెళ్తూ గ్రెటాకు కొని కఠినమైన రూల్స్ మాత్రం చెప్తారు. బ్రామ్స్ ముఖాన్ని ఎప్పుడు కప్పకూడదు,. అతనికి గట్టిగా చదివి వినిపించాలి, అలాగే రాత్రి వేళల్లో అతనిని ఒంటరిగా వదిలేయకూడదు అన్నది ఆ రూల్స్ సారాంశం.

మొదట్లో గ్రెటా వీళ్లకు పిచ్చి పట్టిందా ? అని అనుకుంటుంది. ఆ బొమ్మను పడేసి రూల్స్ అన్ని పక్కన పెడుతుంది. ఆ భవనానికి గ్రాసరీస్ సరఫరా చేసే మార్గాన్ తో ఫ్రెండ్షిప్ చేస్తుంది. కానీ ఇలా రూల్స్ బ్రేక్ చేసిందో లేదో అలా గ్రెటాకు వింత అనుభవాలు ఎదురవడం మొదలవుతుంది. పిల్లాడు ఏడుస్తున్న శబ్దాలు రావడం, ఆమె బట్టలు మాయం అవ్వడం, ఫోన్ లైన్ కట్ అవ్వడం, బొమ్మ ఉన్నచోట నుండి మరోచోటికి మారడం వంటి భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. దీంతో ఆ బొమ్మలో చనిపోయిన బ్రామ్స్ ఆత్మ ఉందని నమ్మడం మొదలు పెడుతుంది.

Advertisement

అప్పటినుంచి ఆమె రూల్స్ అన్నిటిని తూచా తప్పకుండా పాటిస్తూ, ఆ బొమ్మను నిజంగానే ఒక అబ్బాయిలా చూసుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఇక ఇప్పుడు ట్రిప్ కు వెళ్లిన బ్రామ్స్ తల్లిదండ్రులు ఒక లేఖ రాసి, సముద్రంలో మునిగి ఆత్మహత్య చేసుకుంటారు. ఆ లెటర్లో ‘మమ్మల్ని క్షమించు ఇక ఆమె నీదే’ అని బ్రామ్స్ ను ఉద్దేశించి రాస్తారు. ఈ నేపథ్యంలోనే గ్రెటాను వెతుక్కుంటూ ఆమె మాజీ ప్రియుడు కోల్ ఆ ఇంటికి వస్తాడు. అతను గ్రెటాతో గొడవపడి కోపంతో ఆ పింగాణి బొమ్మను నేలకేసి కొట్టి ముక్కలు ముక్కలు చేస్తాడు. దీంతో ఒక్కసారిగా ఆ భవనం గోడల వెనక నుంచి ఒక పెద్ద శబ్దం వస్తుంది. గోడలో ఉన్న సీక్రెట్ డోర్ నుంచి ఓ మనిషి ముఖానికి మాస్క్ వేసుకొని బయటకు వచ్చి అతన్ని చితగ్గొడతాడు. దీంతో హీరోయిన్ ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరి అలా వచ్చిన ఆ ముసుగు మనిషి ఎవరు ? హీరోయిన్ ను ఆమె మాజీ లవర్ ను అతను ఏం చేశాడు? చివరికి ఆ ఇంట్లో నుంచి హీరోయిన్ బయట పడగలిగిందా లేదా? బ్రామ్స్ కు సంబంధించిన సీక్రెట్ ఏంటి ? అన్నది స్టోరీ. Prime Videoలో ఈ మూవీని చూడవచ్చు.

Read Also : అమెరికాను రెండు భాగాలుగా పంచుకునే జపాన్ జర్మనీ… మిస్ అవ్వకుండా చూడాల్సిన మాస్టర్ పీస్ సిరీస్

Related News

ఫోన్లో పని కానిచ్చే అబ్బాయిలు… కాల్ చేశారని సొళ్ళు కారిస్తే ఖతం… ఐశ్వర్య రాజేష్ క్రేజీ క్రైమ్ థ్రిల్లర్

అర్దరాత్రి అడవి మధ్యలో ఆగిపోయే ట్రెయిన్… ‘ట్రెయిన్ టు బుసాన్’లాంటి థ్రిల్లింగ్ హర్రర్ మూవీ

కోమాలో ఉన్నవాళ్ళంతా మిస్టరీ ప్రపంచంలోకి… మైండ్ బ్లోయింగ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీల్లో సినిమాల సందడి.. ఏకంగా 16 సినిమాలు స్ట్రీమింగ్..!

మార్చురీ నుంచి అమ్మాయి మృతదేహం మాయం… క్లైమాక్స్ కేక భయ్యా

పసి పిల్లాడిని బలి తీసుకునే అల్మారా… ఒళ్లు గగుర్పొడిచే సీన్లున్న హర్రర్ మూవీ

అమెరికాను రెండు భాగాలుగా పంచుకునే జపాన్ జర్మనీ… మిస్ అవ్వకుండా చూడాల్సిన మాస్టర్ పీస్ సిరీస్

Big Stories

×