Ram Charan Peddi : కొన్నిసార్లు ఒక హీరో ముందు సినిమా ఎంత మార్కెట్ చేసింది అని కాకుండా, కాంబినేషన్స్ ను నమ్మి చాలా డబ్బులు ఆఫర్ చేస్తాయి కొన్ని ఓటిటి సంస్థలు. అయితే ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇదివరకే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన వీడియోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రామ్ చరణ్ ను ఈ సినిమాలో చూపించిన విధానం చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా చరణ్ మాట్లాడే భాష మంచి సర్ప్రైజింగ్ గా ఉంది.
“పెద్ది” కు పెద్ద డీల్
కొన్నిసార్లు రిలీజ్ అవ్వక ముందు నుంచే ఆ సినిమాకు భారీ ఆఫర్స్ వస్తూ ఉంటాయి దానికి కారణం ఆ హీరో మీద ఉన్న నమ్మకం అలాగే ఆదర్శకుడి మీద ఉన్న నమ్మకం కూడా కొన్నిసార్లు కారణం అవుతుంది. బుచ్చిబాబు విషయానికొస్తే ఎంత టాలెంటెడ్ అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తీసింది ఒక సినిమా అయినా కూడా దానితోనే 100 కోట్లు మార్కెట్లో చేరిపోయాడు. బుచ్చిబాబు చేస్తున్న రెండవ సినిమా పెద్ది. ఈ సినిమాకు నెట్ఫ్లిక్స్ 120 కోట్లు పెట్టి రైట్స్ తీసుకుందని సమాచారం వినిపిస్తుంది. సినిమా మొదలవకముందే 120 కోట్లు అనేది మామూలు ఫిగర్ కాదు.
ఊహించని గేమ్ చేంజర్
దర్శకుడు శంకర్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వరుసగా డిజాస్టర్ సినిమాలు చేస్తున్నారు. కానీ శంకర్ సినిమా అంటేనే వేరే రేంజ్ లో ఉండేది. ఆ కాన్సెప్టులు కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం వరుస డిజాస్టర్ తో సతమతమవుతున్నారు. మొదటిసారి తెలుగులో చరణ్ హీరోగా చేసిన గేమ్ చేంజెస్ సినిమా ఊహించని ప్లాపును సొంతం చేసుకుంది. ఇక్కడితో రామ్ చరణ్ మార్కెట్ పడిపోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఈ నెట్ఫ్లిక్స్ ఆఫర్ చూసిన తర్వాత చరణ్ రేంజ్ పెరిగిందని చెప్పాలి.
అంచనాలన్నీ పెద్ది పైన
ఇక పెద్ది విషయానికి వస్తే ఈ సినిమాలో ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడుతున్నాడు రామ్ చరణ్. చరణ్ ఒక మట్టి పాత్రను చేసినప్పుడు మంచి సక్సెస్ అందుకుంటాడు అని రంగస్థలం సినిమా రుజువు చేసింది. ఇప్పుడు సుకుమార్ శిష్యుడు దర్శకత్వం వహిస్తున్న సినిమాలో ఏ రేంజ్ పర్ఫామెన్స్ ఇస్తాడు అని అందరికీ ఒక క్యూరియాసిటీ ఎదురైంది. ఖచ్చితంగా ఆడియన్స్ ని సప్రైజ్ చేస్తాడు అని అందరూ బలంగా నమ్ముతున్నారు.
Also Read : Sukumar: మీ వల్లనే నాకు ఇంకో సినిమా అవకాశం వచ్చింది, సుకుమార్ ఎమోషనల్