OTT Movie : టైటిల్ ను చూసి కంగారు పడ్డారా? అయితే ఆ టెన్షన్ అక్కర్లేదు. ఎందుకంటే ఇది మీరనుకున్న మూవీ అయితే కాదు. కానీ ఆ లైన్ మాత్రం నిజమే. అయితే ఇలాంటి వింత ఆలోచనలతో సినిమాలు తీయగలిగే క్రెడిట్ మాత్రం హాలీవుడ్ కే దక్కుతుంది. ఇది కూడా ఒక ఇంగ్లీష్ సిరీస్. ఇంతకీ ఈ సిరీస్ స్టోరీ ఏంటి? ఏ ఓటీటీలో చూడవచ్చు? అనే వివరాలపై ఓ లుక్కేద్దాం పదండి.
కథలోకి వెళ్తే…
కథ లాస్ ఏంజిల్స్‌లోని కాంప్‌వేర్ అనే మొబైల్ గేమింగ్ కంపెనీలో జరుగుతుంది. కాంప్‌వేర్ సీఈఓ సాంగ్ (బ్రియాన్ యూన్)ను షాకింగ్ గా ఒక మిడిల్ స్కూల్ విద్యార్థి హత్య చేయడంతో, కంపెనీ ఆర్థిక సంక్షోభంలో పడుతుంది. ఈ సమయంలో రీగస్ పటాఫ్ (క్రిస్టోఫ్ వాల్ట్జ్) అనే సీక్రెట్ కన్సల్టెంట్ కంపెనీ నాయకత్వ బాధ్యతలు తీసుకుంటాడు. కంపెనీ ఉద్యోగులైన ఎలైన్ (బ్రిటనీ ఓ’గ్రాడీ), క్రెయిగ్ (నాట్ వోల్ఫ్) అతని వింత ప్రవర్తన, అసాధారణ డిమాండ్‌లను గమనిస్తారు. రీగస్ పటాఫ్ తన ఉద్యోగులకు విచిత్రమైన ఆదేశాలు ఇస్తాడు.
ఉద్యోగులకు రాత్రిపూట కాల్ చేయడం, వారి వ్యక్తిగత జీవితంలోకి చొరబడటం, వారి వాసనలను పరిశీలించడం వంటివి. అతని చర్యలు కొన్నిసార్లు కామెడిగా ఉంటే, కొన్నిసార్లు భయంకరంగా అనిపిస్తాయి. ఎలైన్, క్రెయిగ్… పటాఫ్ గురించి తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఈ క్రమంలో వారు సాంగ్ హత్యకు పటాఫ్‌కు సంబంధం ఉందని సందేహిస్తారు. ఒక ఫ్లాష్‌బ్యాక్‌లో సాంగ్ తన కంపెనీని కాపాడుకోవడానికి పటాఫ్‌తో ఒక ఒప్పందం చేసుకున్నాడని, అది అతని మరణానికి దారి తీసిందని తెలుస్తుంది. క్లైమాక్స్ లో క్రెయిగ్ పటాఫ్ గురించి ఒక షాకింగ్ సీక్రెట్ ను కనుగొంటాడు. ఊహించని విధంగా ఉండే ఆ క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటి? ఇంతకీ పాత బాస్ హత్యకు కొత్త బాస్ నిజంగానే కారణమా ? చివరికి ఏమైంది ? అనేది ఈ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : ఫ్రెష్ జోడీ కోసం టీనేజ్ అబ్బాయి ఆరాటం… చిన్న పిల్లలు చేసినా వాళ్ళే చూడకూడని మూవీ మావా
ఏ ఓటీటీలో ఉందంటే ?
ఇప్పటిదాకా మనం చెప్పుకున్న సిరీస్ పేరు “ది కన్సల్టెంట్” (The Consultant). 2023లో టోనీ బాస్గల్లోప్ సృష్టించిన అమెరికన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇది. బెంట్లీ లిటిల్ రాసిన అదే పేరుగల నవల ఆధారంగా రూపొందింది. ఈ సిరీస్‌లో క్రిస్టోఫ్ వాల్ట్జ్ ప్రధాన పాత్రలో నటించారు. నాట్ వోల్ఫ్, బ్రిటనీ ఓ’గ్రాడీ, ఐమీ కారెరో సహాయక పాత్రల్లో కనిపిస్తారు. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో ఉంది. 8 ఎపిసోడ్‌లతో ఒక డార్క్ కామెడీ-థ్రిల్లర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సిరీస్ ఊహించని ట్విస్టులతో వర్త్ వాచింగ్ మావా అన్పిస్తుంది.