BigTV English

OTT Movie : అమ్మాయిలను ఆట బొమ్మల్లాగా మార్చి ఆ పాడు పనులు… ఈ అక్కాచెల్లెళ్లది దిమ్మతిరిగే కిరాతకం మావా

OTT Movie : అమ్మాయిలను ఆట బొమ్మల్లాగా మార్చి ఆ పాడు పనులు… ఈ అక్కాచెల్లెళ్లది దిమ్మతిరిగే కిరాతకం మావా

OTT Movie : ఓటీటీలోకి సరికొత్త స్టోరీతో ఒక వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కి వచ్చింది. ఇది రియల్ లైఫ్ మెక్సికన్ సీరియల్ కిల్లర్స్ ఆధారంగా తెరకెక్కింది. 1960లో మెక్సికో నేపథ్యంలో ఇద్దరు సిస్టర్స్ ఒక బ్రోతెల్ ఎంపైర్ నిర్మించి, ఆతరువాత వాళ్ళు కిల్లర్స్‌గా మారడాన్ని ఈ సిరీస్ చూపిస్తుంది. ఈ సిరీస్‌ విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. క్రైమ్ థ్రిల్లర్ ఫ్యాన్స్‌కి ఇదొక బింజ్ వర్తీ రైడ్ అవుతుంది.  ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


స్టోరీలోకి వెళ్తే

సెరఫినా మెక్సికోలోని మెజ్కాలా అనే ఫిక్షనల్ టౌన్‌లో, తన సోదరి ఆర్కాంగెలాతో కలిసి ఒక చిన్న బ్రోతెల్ హౌస్ ని స్టార్ట్ చేస్తుంది. సెరఫినా ఒక స్మార్ట్ అమ్మాయి. ఆమె ఈ చిన్న బిజినెస్‌ను ఒక భారీ ఎంపైర్‌గా మార్చాలని కలలు కంటుంది. ఆమె సోదరి ఆర్కాంగెలా క్రూరమైనది. సెరఫినా ప్లాన్‌లను సపోర్ట్ చేస్తూ, స్థానిక పాలిటీషియన్స్, పోలీసులతో డీల్స్ కుదుర్చుకుంటుంది. వీళ్ల బ్రోతెల్‌లో హై-ప్రొఫైల్ కస్టమర్స్ (రాజకీయ నాయకులు, బిజినెస్‌మెన్ ) రాకపోకలు సాగిస్తారు. సెరఫినా తన తెలివితో, ఆర్కాంగెలా రూథ్‌లెస్‌తో ఈ ఎంపైర్‌ను విస్తరిస్తారు. కానీ వాళ్ల వర్కర్స్ (యువతులు) మిస్టీరియస్‌గా డిసప్పియర్ అవుతుంటారు.

సెరఫినా, ఆర్కాంగెలా ఎంపైర్ పెరిగే కొద్దీ, వాళ్ల బ్రోతెల్‌లో డజన్ల కొద్దీ మర్డర్స్ జరుగుతాయి. వర్కర్స్ తో పాటు కొన్ని కస్టమర్స్ మరణాలు మిస్టరీగా మారతాయి. ఈ సిస్టర్స్ తమ సీక్రెట్స్‌ను కవర్ చేయడానికి రాజకీయ పవర్, బ్రైబరీని యూజ్ చేస్తారు. కానీ ఒక జర్నలిస్ట్ ఈ డెత్స్ వెనుక నిజాన్ని ఛేదించడానికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. సెరఫినా తన ఎంపైర్‌ను కాపాడుకోవడానికి తెలివిగా ఒక ఆట ఆడుతుంది. కానీ ఆర్కాంగెలా వయలెంట్ డెసిషన్స్ వల్ల టెన్షన్ పెరుగుతుంది. వీళ్ల మధ్య టాక్సిక్ బాండ్ క్రాక్స్ చూపిస్తుంది. సెరఫినా తన సోదరిని కంట్రోల్ చేయలేక, ఆర్కాంగెలా మరింత అన్‌ప్రెడిక్టబుల్ అవుతుంది. మీడియా సర్కస్, పబ్లిక్ ఔట్‌రేజ్, పోలీస్ ఒత్తిడి మధ్య, ఈ సిస్టర్స్ కట్టిన సామ్రాజ్యం డౌన్‌ఫాల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇంతకీ అమ్మాయిల హత్యలు ఎలా జరుగుతుంటాయి ? ఎందుకు జరుగుతుంటాయి ? కిల్లర్ ఎవరు ? ఈ స్టోరీ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను మాత్రం ఈ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.


నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

‘ది డెడ్ గర్ల్స్’ (The Dead Girls) లూయిస్ ఎస్ట్రాడా దర్శకత్వంలో వచ్చిన మెక్సికన్ క్రైమ్ సిరీస్. జార్జ్ ఇబార్గెంగోయిటియా నవల “లాస్ ముయెర్తాస్” (Las Muertas) ఆధారంగా తీయబడింది. ఇందులో పాలినా గైటాన్ (సెరఫినా బలాడ్రో), అర్సెలియా రామిరెజ్ (ఆర్కాంగెలా బలాడ్రో) ప్రధాన పాత్రల్లో నటించారు. 6 ఎపిసోడ్‌ల ఈ సిరీస్ 2025 సెప్టెంబర్ 10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ అవుతోంది. ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ వంటి మల్టిపుల్ డబ్బింగ్ ఇది IMDbలో 6.9/10 రేటింగ్ పొందింది.

Read Also : 350 ఏళ్ల నాటి శాపం… ఈ ఫ్యామిలీలో లవ్ మ్యారేజ్ చేసుకుంటే చస్తారు… అదిరిపోయే హర్రర్ రివేంజ్ డ్రామా

Related News

OTT Movie : అర్ధరాత్రి తల్లీపిల్లల్ని టార్గెట్ చేసే సైకో… ఆమె ఇచ్చే ఝలక్ నెవర్ బిఫోర్… మైండ్ బెండింగ్ మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : 20 ఏళ్ల యువతితో 40 ఏళ్ల వ్యక్తి పాడు పనులు… భార్యేమీ తక్కువ తినలేదు… భార్యాభర్తలు కలిసి చూడాల్సిన మూవీ

OTT Movie : తెగిపడే అమ్మాయిల తలలు…. అత్యంత దారుణంగా నరికి చంపే సీరియల్ కిల్లర్… ఇంటెన్స్ మిస్టరీ థ్రిల్లర్

Conjuring Movies: కంజ్యూరింగ్ మూవీస్ ఈ ఆర్డర్‌లో చూస్తేనే మజా.. ఈ లిస్ట్ ఫాలో అయిపోండి, ఓటీటీలో ఉన్నాయ్!

OTT Movie : డిన్నర్ కోసం వెళ్లి దిక్కుమాలిన ట్రాప్‌లో… ఈ క్రేజీ మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ ఏ ఓటీటీలో ఉందంటే?

Big Stories

×