Angelo Mathews: శ్రీలంక స్టార్ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీలంక కెప్టెన్సీ చేయడం పెద్ద నరకమంటూ ఆయన వ్యాఖ్యానించారు. శ్రీలంక కెప్టెన్ గా వ్యవహరించడంతో తన జుట్టు మొత్తం రాలిపోయిందని.. తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు ఏంజెలో మాథ్యూస్. శ్రీలంక మాజీ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ అతి త్వరలోనే రిటైర్మెంట్ ఇస్తున్న సంగతి తెలిసిందే. సుదీర్ఘ కాలం పాటు శ్రీలంక జట్టుకు సేవలు అందించిన ఏంజెలో మాథ్యూస్… స్వదేశంలో బంగ్లాదేశ్ జట్టు జరగబోయే తొలి టెస్ట్ ఆడిన తర్వాత రిటైర్మెంట్ ఇస్తాడు. అంటే బంగ్లాదేశ్ జట్టుతో జరగబోయే తొలి టెస్ట్… మ్యాచ్ ఏంజెలో మాథ్యూస్ కు చివరిది అన్నమాట.
Also Read: Kohli-ABD: ఆ లేడీ ప్రెగ్నెంట్..తన్నుకున్న కోహ్లీ, డివిలియర్స్.. ముఖం మీదే ఛీ కొట్టాడు ?
కెప్టెన్సీ తో నా జుట్టు రాలిపోయింది: ఏంజెలో మాథ్యూస్
త్వరలోనే రిటైర్మెంట్ తీసుకోబోతున్న శ్రీలంక మాజీ క్రికెటర్ ఏంజెలో మాథ్యూస్… శ్రీలంక జట్టుతో కలిగిన అనుభవాలను పంచుకున్నారు. తన కెరియర్ లో ఇప్పటివరకు జరిగిన ఆసక్తికర విషయాలను కూడా వెల్లడించారు ఏంజెలో మాథ్యూస్. ముఖ్యంగా కెప్టెన్సీ సమయంలో తన జుట్టు ఎక్కువగా ఊడిపోయిందని.. పేర్కొన్నారు. కెప్టెన్సీ చేయడం వల్ల ఒత్తిడి విపరీతంగా పెరిగి జుట్టు… రాలిపోయిందని బాంబు పేల్చారు. శ్రీలంక దేశానికి ప్రాతినిధ్యం వహించడం అలాగే కెప్టెన్సీ చేయడం రెండు వేరని ఆయన స్పష్టం చేయడం జరిగింది.
బాధ్యతలు చేపట్టిన వ్యక్తి పైనే అందరి దృష్టి ఉంటుందని ఈ సందర్భంగా వెల్లడించారు. కెప్టెన్సీ అంటే పెద్ద నరకం అంటూ వెల్లడించారు. విమర్శలు వచ్చిన జట్టును మరో స్థాయికి తీసుకు వెళ్లేందుకు ఆ ఒత్తిడి భరించానని స్పష్టం చేశారు. అయితే జుట్టు రాలిపోవడం వల్ల.. తన భార్య తరచూ ఇంట్లో టార్చర్ పెట్టేదని వెల్లడించారు. జుట్టు రాలకుండా మెడిసిన్ వాడాలని సూచనలు చేసేదని స్పష్టం చేశారు. కానీ తాను తన భార్య మాట అస్సలు వినకుండా ఉండేవాడినని.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కానీ ఆ తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకున్నట్లు చెప్పారు శ్రీలంక మాజీ క్రికెటర్ ఏంజెలో మాథ్యూస్.
Also Read: RCB Stampede: 11 మంది చావులకు కారణం..దొంగచాటుగా పారిపోతున్న RCB ప్రెసిడెంట్ ?
కెప్టెన్ గా ఏంజెలో మాథ్యూస్ రికార్డులు
ఆల్ రౌండర్, కెప్టెన్ గా శ్రీలంక జట్టులో ఏంజెలో మాథ్యూస్ ఎన్నో విజయాలను అందించాడు. 2013 సంవత్సరంలో టెస్ట్ కెప్టెన్ అయ్యాడు ఏంజెలో మాథ్యూస్. అయితే 25 సంవత్సరాలకు కెప్టెన్సీ అందుకున్న… ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఏంజెలో మాథ్యూస్ కెప్టెన్సీ లో శ్రీలంక జట్టు… విదేశీ పర్యటనలో.. చాలా అద్భుతంగా రాణించడం జరిగింది. 2014లో ఇంగ్లాండ్ గడ్డపై సిరీస్ గెలిచింది శ్రీలంక. ఆ తర్వాత టి20 తో పాటు వన్డే కెప్టెన్ గా కూడా ఏంజెలో మాథ్యూస్ ఎంపికయ్యారు. కానీ 2017 లో జింబాబ్వే చేతిలో వన్డే సిరీస్ ఓటమి తర్వాత మూడు ఫార్మాట్ ల కెప్టెన్సీకి రాజీనామా చేశాడు ఏంజెలో మాథ్యూస్.