OTT Movie : సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్‌తో రీసెంట్ గా ఒటిటి లోకి వచ్చిన ఒక వెబ్ సిరీస్ మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. విషపూరితమైన మంచు కురిసిన తర్వాత గ్రహాంతర వాసులు భూమిపై దాడి చేస్తారు. ఈ దాడిని ఎదుర్కునే క్రమంలో స్టోరీ నడుస్తుంది. ఈ సిరీస్ ప్రేక్షకులను ఒక ఒక అపోకలిప్టిక్ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ కి వచ్చింది ? అనే వివరాల్లోకి వెళితే
నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్
‘ది ఎటర్నాట్’ (The Eternaut) 2025 ఏప్రిల్ 30న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన అర్జెంటీనా సైన్స్ ఫిక్షన్ టీవీ సిరీస్. దీనిని హెక్టర్ జర్మన్ ఓస్టర్‌హెల్డ్, ఫ్రాన్సిస్కో సోలానో లోపెజ్ సృష్టించారు. ఇది అర్జెంటీనా కామిక్ ఆధారంగా, బ్రూనో స్టాగ్నారో దర్శకత్వంలో రూపొందింది. ఈ సిరీస్‌లో రికార్డో డారిన్, కార్లా పీటర్సన్, సీజర్ ట్రోన్కోసో, ఆండ్రియా పీట్రా ప్రధాన పాత్రల్లో నటించారు. సీజన్ 1 ప్రస్తుతం 6 ఎపిసోడ్‌లతో నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. సీజన్ 2026లో వచ్చే అవకాశం ఉంది. IMDbలో ఈ సిరీస్ కి 8.2/10 రేటింగ్ ఉంది.
స్టోరీలోకి వెళితే
బ్యూనస్ ఎయిర్స్ అనే ఒక ప్రాంతంలో జువాన్ సాల్వో తన స్నేహితులతో ఆల్ఫ్రెడో, లూకాస్, ఒమర్‌లతో కలిసి కార్డ్స్ ఆడుతూ ఉంటాడు. అది వేసవి సమయం కావడంతో ఆ ప్రాంతం వేడి గాలులతో ఉక్కపోతగా ఉంటుంది. ఈ సమయంలో అకస్మాత్తుగా మంచు కురవడం మొదలవుతుంది. అసలు ఆప్రాంతంలో మంచు చాలా అరుదుగా కురుస్తుంది. గత 100 సంవత్సరాల్లో కేవలం మూడు సార్లు మాత్రమే కురిసింది. కానీ ఈ మంచు అందమైనది కాదు. ఇది విషపూరితం. దాన్ని తాకిన వారందరినీ తక్షణమే చంపేస్తుంది. దీనివల్ల నగరంలోని లక్షలాది మంది మరణిస్తారు. జువాన్ అతని స్నేహితులు ఒక ఇంటిలో చిక్కుకుంటారు.
జువాన్‌కు తన కూతురు క్లారా, భార్య ఎలెనా గురించి ఆందోళన చెందుతుంటాడు. క్లారా ఒక బోట్‌లో స్నేహితులతో ఉందని, బ్లాక్‌అవుట్ సమయంలో అదృశ్యమైందని తెలుస్తుంది. జువాన్, అతని గ్యాంగ్ ఈ విషపూరిత మంచు నుండి రక్షణ కోసం ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ షీట్లు, గ్యాస్ మాస్క్‌లు, వాటర్‌ప్రూఫ్ బట్టలతో సూట్‌లు తయారు చేస్తారు. జువాన్ తన కూతురిని వెతకడానికి బయటకు వెళతాడు. కానీ బ్యూనస్ ఎయిర్స్ ఒక భయంకరమైన, నిర్జనమైన ప్రదేశంగా మారిపోతుంది. వీధులన్నీ మృతదేహాలతో నిండి ఉంటాయి.
Read Also : ఆఫీస్ బాయ్ వైఫ్ తో రాసలీలలు… పెళ్లాలను మార్చుకునే దిక్కుమాలిన ఆలోచన… సింగిల్స్ కు పండగే