E-Paper
Advertisement

TGSRTC: తెలంగాణ ఆర్టీసీ భారీ శుభవార్త.. ఇక వారికి టికెట్ రేట్లపై భారీ డిస్కౌంట్

TGSRTC: తెలంగాణ ఆర్టీసీ భారీ శుభవార్త.. ఇక వారికి టికెట్ రేట్లపై భారీ డిస్కౌంట్
Advertisement

TGSRTC: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) హైదరాబాద్-విజయవాడ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులకు భారీ శుభవార్త చెప్పింది. ఈ రూట్‌లో నడిచే బస్సుల టికెట్ ధరలపై 16 శాతం నుంచి 30 శాతం వరకు భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బుకింగ్‌లకు వర్తిస్తుందని టీజీఎస్ఆర్టీసీ తెలిపింది. తెలంగాణ ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా ప్రయాణికులకు ఆర్థిక భారాన్ని తగ్గించడంతో పాటు బస్సు సేవల వినియోగాన్ని పెంచే లక్ష్యంతో ముందుకెళ్తోంది.

డిస్కౌంట్ వివరాలు..

Advertisement

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) హైదరాబాద్-విజయవాడ మార్గంలో ప్రయాణించే ప్రయాణికుల కోసం తీసుకున్న నిర్ణయం మేరకు డిస్కౌంట్ వివరాలు ఇలా ఉన్నాయి.

గరుడ ప్లస్ బస్సులు: ఈ బస్సుల్లో టికెట్ ధరలపై అత్యధికంగా 30 శాతం రాయితీ ఉంటుంది. ఎగ్జాంపుల్ గా.. టికెట్ ధర రూ.1000 ఉంటే రాయితీ ద్వారా ఇప్పుడు రూ.700 కే లభిస్తోంది. (రూ.635 ధర ఉన్న టికెట్ ఇప్పుడు రూ.444కి లభిస్తుంది.)

Advertisement

ఈ- గరుడ బస్సులు: ఈ సర్వీసుల్లో బస్సుల్లో టికెట్ ధరలపై 26% డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఎగ్జాంపుల్ గా టికెట్ ధర రూ.592 టికెట్ ధర రూ.438 కే లభించనుంది.

సూపర్ లగ్జరీ అండ్ లహరి నాన్-ఎసీ బస్సులు: ఈ బస్సుల్లో టికెట్ ధరలపై 20% రాయితీ కల్పించనున్నారు. ఉదాహరణకు, రూ.815 ధర ఉన్న సూపర్ లగ్జరీ టికెట్ రూ.685కి అందుబాటులో ఉంటుంది.

రాజధాని అండ్ లహరి ఏసీ బస్సులు: ఈ సర్వీసుల్లో 16% తగ్గింపు ఉంటుంది. రూ.533 టికెట్ ధర ఉన్న రాజధాని టికెట్ ఇప్పుడు రూ.448కి లభించనుంది.

లహరి ఎసీ స్లీపర్ బస్సులు: ఈ సర్వీసుల్లో టికెట్ ధర రూ.1,569 నుంచి రూ.1,177కి అందుబాటులోకి రానుంది. సీటర్-కమ్-బెర్త్ ధర రూ.1,203 నుంచి రూ.903కి తగ్గించబడింది.

ఈ రాయితీలు ఆన్‌లైన్ బుకింగ్‌లతో పాటు ఆఫ్‌లైన్ బుకింగ్‌ లో కూడా అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులు TGSRTC అధికారిక వెబ్‌సైట్ (https://www.tgsrtcbus.in/) ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్‌ను TGSRTC ఎండీ సజ్జనార్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ప్రయాణికులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ డిస్కౌంట్‌తో ప్రయాణ ఖర్చులు తగ్గడమే కాకుండా, ఎక్కువ మంది ఆర్టీసీ సేవలను ఉపయోగించే అవకాశం ఉంది.

ALSO READ: Cheetah Video Viral: గోల్కొండలో చిరుత సంచారం… సోషల్ మీడియాలో వీడియో వైరల్

ALSO READ: Amit Shah: మీరు మరో 20 ఏళ్లు అక్కడే ఉంటారు.. లోక్‌సభలో ప్రతిపక్షాలపై అమిత్ షా ఆగ్రహం

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×