E-Paper
Advertisement

OTT Movie : ఓటీటీలోకి వచ్చేసిన మోస్ట్ వాంటెడ్ సిరీస్… మూడేళ్ళ ఎదురు చూపులకు ఫుల్ స్టాప్

OTT Movie : ఓటీటీలోకి వచ్చేసిన మోస్ట్ వాంటెడ్ సిరీస్… మూడేళ్ళ ఎదురు చూపులకు ఫుల్ స్టాప్
Advertisement

OTT Movie : మూడు సంవత్సరాల నుంచి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3’ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. మనోజ్ బాజ్‌పేయి, శ్రీకాంత్ తివారీ గెటప్ తో మళ్ళీ తిరిగొచ్చాడు. అయితే ఈ సీజన్ 3 మాత్రం, ఈ సారి ఏడు ఎపిసోడ్స్ తో మాత్రమే వచ్చింది. సీజన్ 1, 2 లలో దాదాపు పది ఎపిసోడ్స్ తో నడిచి, ఇప్పుడు కుదించడం వెనుక స్టోరీనే ప్రధాన కారణంగా చెప్పుకుంటున్నారు. స్పై-యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సీజన్, గత రెండు సీజన్స్ తో పోలిస్తే మరింత ఇంటెన్స్ గా ఉందని టాక్ వస్తోంది. ఇక ఫ్యామిలీ తో కలసి ఈ ‘ఫ్యామిలీ మ్యాన్’ కొత్త సీజన్ ని ఎంచక్కా చూసేయండి. ఇది ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌

రాజ్ అండ్ డీకే క్రియేట్ చేసిన ఈ స్పై థ్రిల్లర్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3’ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. 2025 నవంబర్ 21 నుంచి (ఈరోజు) నుంచి అందుబాటులో ఉంది. ఇందులో శ్రీకాంత్ తివారీగా మనోజ్ బాజ్‌పాయీ, సుచిత్ర తివారీగా ప్రియమణి, JK తల్పాడేగా షరీబ్ హష్మీ, ధృతి తివారిగా ఆశ్లేషా ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించారు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

సీజన్ 2 ముగిసిన తర్వాత శ్రీకాంత్ తివారీ (మనోజ్ బాజ్‌పాయీ) స్పై టాస్క్ నుంచి రిటైర్ అయి, చెన్నైలో భార్య సుచి (ప్రియమాణి), పిల్లలు ధూళి, అథర్వతో సాధారణ జీవితం గడుపుతుంటాడు. ఉద్యోగం కూడా మార్చేశాడు, ఇంట్లో గొడవలు తగ్గుతాయి. అంతా బాగానే ఉంది అనుకుంటున్న టైమ్‌లోనే ఒక్కసారిగా దేశానికి పెను ప్రమాదం వచ్చేస్తుంది. ఇండో చైనా బార్డర్ దగ్గర ఒక రహస్య ఆపరేషన్ ఫెయిల్ అయి, భారత్‌పై ఒక సీక్రెట్ బయో వెపన్ ల్యాబ్‌ని ఎవరో టార్గెట్ చేస్తుంటారు. ఈ పని ఆపడానికి చీఫ్ జెకె (షరద్ కేల్కర్) శ్రీకాంత్ ని మళ్లీ రీ యాక్టివేట్ చేస్తాడు. దీంతో ఈసారి స్రీకాంత్ ఒక్కడే కాదు, అతని ఫ్యామిలీ కూడా ప్రమాదంలో పడుతుంది. ఎందుకంటే విలన్ (జైదీప్ అహ్లావత్) ఈ సారి పర్సనల్ రివెంజ్ తీర్చుకోవడానికి వస్తాడు.

Read Also : చేతబడితో వణికించే హర్రర్ మూవీ… కల్లోనూ వెంటాడే పృథ్వీరాజ్ సుకుమారన్ సినిమా

Advertisement

శ్రీకాంత్ తన టీమ్‌తో కలిసి చైనా బార్డర్ దాకా వెళ్లి ఆ బయో వెపన్ ప్లాన్‌ని ఆపాలి. అదే టైమ్‌లో ఇంట్లో సుచి, పిల్లలు ఎవరో గుర్తు తెలియని వాళ్ల చేతిలో బందీలు అవుతారు. శ్రీకాంత్ ఒకవైపు దేశాన్ని కాపాడాలి, మరోవైపు ఫ్యామిలీని రక్షించాలి. ఈ రెండూ ఒకేసారి చేయాలంటే ఎంత రిస్క్ తీసుకోవాలో, ఎంత గిల్ట్ భరించాలో సీజన్ మొత్తం చూపిస్తారు. ఇందులో పాత టీమ్ మొత్తం (జెకె, మిలింద్, గోపీ, ధృతి) తిరిగొస్తారు. కొత్త ఎనిమీలు, బిగ్ ట్విస్ట్‌లు ఉంటాయి. చివర్లో ఒక్క ఎపిసోడ్‌లో శ్రీకాంత్ జీవితంలో అతి పెద్ద ట్విస్ట్ వస్తుంది. అది చూస్తే ఇక సీజన్ 4 మొదలైనట్టే అనిపిస్తుంది. అయితే ఈ సీజన్ లో శ్రీకాంత్ తన ఫ్యామిలీ, దేశాన్ని కాపాడుకున్నాడా ? అనే విషయాలను, ఈ సిరీస్ ని చూసి తెలుసుకోండి.

 

Related News

పల్లెటూర్లో టీనేజర్ల సీక్రెట్ లవ్.. ఇంట్లో తెలిసిపోవడంతో ఊహించని ట్విస్ట్.. తెలుగు మూవీనే

ఈజిప్ట్ ఎడారిలో విగతజీవిగా చిన్నారి.. మమ్మీగా ఇంట్లోకి ఎంట్రీ.. దాన్ని ముట్టుకుంటే పోతారు!

లాంగ్ డిస్టెన్స్ లవ్ స్టోరీ.. ప్రేమికులు మిస్ అవ్వకుండా చూడాల్సిన రొమాంటిక్ డ్రామా

పచ్చని సంసారంలో నిప్పులు పోసే కేర్‌టేకర్.. డార్క్ సీక్రెట్స్ తో దడ పుట్టించే థ్రిల్లర్

గ్యాంగ్‌స్టర్లకు చుక్కలు చూపించే అండర్‌కవర్ టీమ్.. హై-వోల్టేజ్ యాక్షన్-కామెడీ డ్రామా సిరీస్

కన్న తల్లిదండ్రులని చంపేసే లేడీ సైకో.. ఒళ్ళు గగుర్పొడిచే రియల్ స్టోరీ తెలుగులో!

మిత్రుడి మరణం.. ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్‌ ఎంట్రీతో మతిపోగొట్టే ట్విస్ట్

లాటరీలో వందల కోట్లు.. ఉద్యోగానికి రాజీనామా చేయకుండా ఆఫీస్‌‌లో అరాచకం, తెలుగులోనూ ఉంది

Big Stories

Advertisement
×