E-Paper
Advertisement

ప్రతీ ఆడపిల్ల తండ్రి ఇలాగే ఉండాలి భయ్యా… కార్పొరేట్ సిండికేట్ ను చితగ్గొట్టే శివంగి

ప్రతీ ఆడపిల్ల తండ్రి ఇలాగే ఉండాలి భయ్యా… కార్పొరేట్ సిండికేట్ ను చితగ్గొట్టే శివంగి
Advertisement

Action Thriller : కరాటే కిడ్, దంగల్ సినిమాలను ప్రతి ఒక్కరూ చూసే ఉంటారు. ఆ మూవీస్ ని చూశాక మన పిల్లలకు కూడా అలా మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తే బాగుంటుంది అని ఖచ్చితంగా అనుకునే ఉంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీని చూశాక ప్రతీ ఆడపిల్ల తండ్రి ఇలాగే ఉండాలని ఫిక్స్ అవుతారు. కూతురు, భార్యలకు కరాటే నేర్పించి, తమ జోలికి వచ్చిన వాళ్ళ బొక్కలు ఇరగ్గొట్టిస్తాడు ఒక కరాటే టీచర్. ఇలాంటి అద్భుతమైన స్టోరీ లైన్ తో రూపొందిన సినిమానే ‘బ్లాస్ట్’ (Blast). మరి ఈ తమిళ సినిమాను తెలుగులో చూడొచ్చా ? కథ ఏంటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

స్టోరీలోకి వెళ్తే…

రాజారామ్ (అర్జున్ సర్జా) నార్మల్ కరాటే మాస్టర్. అతని భార్య నీలవేణి (అభిరామి), కూతురు నీల (ప్రీతి ముఖుందన్) కూడా కరాటేలో కఠినమైన శిక్షణ పొందిన నిపుణులు. ముగ్గురూ కలిసి ఊరిలోని పిల్లలకు ఉచితంగా మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తూ, ఒక చిన్న మెడికల్ షాప్ నడుపుతూ బతుకుతారు. ఒకరోజు నీల మెడికల్ షాప్‌లో ఒంటరిగా ఉన్నప్పుడు, స్థానిక గ్యాంగ్‌స్టర్ కృపాకర్ అనుచరుడు వచ్చి ఆమెను బెదిరించి మందులు లాక్కోవడానికి ప్రయత్నిస్తాడు. కరాటే తెలిసిన నీల అతన్ని దారుణంగా చితక్కొట్టి పోలీసులకు అప్పగిస్తుంది. ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది.

Advertisement

ఒక కార్పొరేట్ కంపెనీ హెడ్ అయిన వరుణ్ దయాలన్ (జాన్ కొక్కెన్) ఆ ఊరి పక్కన ఉన్న కొండలను తవ్వి అత్యంత అరుదైన ఖనిజాలను వెలికితీయాలని ప్లాన్ చేస్తాడు. దానివల్ల ఆ గ్రామమంతా నాశనమైపోతుంది. ఈ మైనింగ్ ప్రాజెక్ట్‌ కు రాజారామ్ కుటుంబం పెద్ద అడ్డుకట్టగా మారుతుంది. వరుణ్ దయాలన్ తన నమ్మకస్థుడైన సైకో కిల్లర్ అబ్రహం (అర్జున్ చిదంబరం) ను, కృపాకర్ గ్యాంగ్‌ను రాజారామ్ కుటుంబాన్ని అంతం చేయడానికి పంపుతాడు.

అయితే ఏదో అందరిలాగే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకుని వారి ఇంటిపై దాడి చేసిన విలన్లకు ఊహించని షాక్ తగులుతుంది. రాజారామ్, నీలవేణి, నీల కలిసి తమ కరాటే యుద్ధ విద్యలతో ఆ రౌడీలను మక్కెలిగేలా తంతారు. ఇంట్లో, హాల్, కిచెన్…. ప్రతి మూలనా జరిగే యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడతాయి. చివరికి వరుణ్ దయాలన్, అతని ముఠా నుండి తమ గ్రామాన్ని, ప్రాణాలను ఈ కరాటే ఫ్యామిలీ ఎలా కాపాడుకుంది ? అన్నది తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే. క్లైమాక్స్ ట్విస్ట్ క్రేజీగా ఉంటుంది, డోంట్ మిస్.

తెలుగులోనూ స్ట్రీమింగ్

Advertisement

2024లో విడుదలై తమిళ సినిమా ప్రేమికులను అలరించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రమే ‘బ్లాస్ట్’. అర్జున్ సర్జా, అభిరామి, ప్రీతి ముఖుందన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ప్రతీ మధ్య తరగతి కుటుంబానికి బాగా కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు. ప్రస్తుతం Netflixలో తెలుగు ఆడియోతో అందుబాటులో ఉంది.

Read Also: బుద్ధుడి స్టాచ్యూ ఇచ్చే శాపం… కన్ను కొడితే ఖతం… ఒళ్లు గగుర్పొడిచే సీన్లున్న హర్రర్ థ్రిల్లర్

Tags

Related News

స్మగ్లింగ్ సామ్రాజ్యంలో బట్టల షాప్ కుర్రాడి మాస్ రాంపేజ్… పృథ్వీరాజ్ ఊరమాస్ యాక్షన్ థ్రిల్లర్ తెలుగులో

వరుస హత్యలు… అంతుచిక్కని ఆధారాలు… 5 భాషల్లో రచ్చ లేపుతున్న మోస్ట్ డేంజరస్ సైకో థ్రిల్లర్

భూమిపై మనుషులు మాత్రమే లేరా ? ప్రపంచాన్ని కుదిపేసే రహస్యం… ఏలియన్స్ గురించి స్పీల్‌బర్గ్ చూపించిన షాకింగ్ కథ

హాస్పిటల్‌ మాఫియా… డాక్టర్ల గుట్టురట్టు చేసే లేడీ సర్జన్… క్రేజీ కొరియన్ మెడికల్ థ్రిల్లర్ సిరీస్

హోటల్ నిండా దెయ్యాలు… చిన్న పిల్లాడిలో డెమాన్… నవ్విస్తూనే భయపెట్టడానికి తిరిగొచ్చిన సీజన్ 2

కొడుకు కిడ్నాప్… కోట్ల డబ్బు కోసం వేట… ప్రతి నిమిషం టెన్షన్ పెంచే హాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ తెలుగులోకి

కరెంట్ షాక్ ఇచ్చే అమ్మాయే అతడి హార్ట్ ఛార్జర్… ఈ వింత లవ్ స్టోరీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే

అక్రమ ఇసుక మాఫియా పని పట్టే లేడీ రిపోర్టర్… డైరెక్ట్ గా ఓటీటీలోకి ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్… తెలుగులోనే స్ట్రీమింగ్

Big Stories

Advertisement
×