OTT Movie : మాయెన్ లిమ్ అనే యువతి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి ఉంటుంది. తండ్రి కూడా అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో, ఒక చైనీస్ మ్యాచ్‌మేకర్ నుండి ఒక వింత ప్రతిపాదన వస్తుంది. ఒక చనిపోయిన యువకుడిని ‘ఘోస్ట్ బ్రైడ్’ గా వివాహం చేసుకుంటే, ఆమె కుటుంబం రుణాల నుండి విముక్తి పొంది, సంపద కూడా వస్తుందని తెలుసుకుంటుంది. ఈ చైనీస్ ఆచారం మామూలుగా, చనిపోయిన ఆత్మలను శాంతింపజేయడానికి జరుగుతుంది. కానీ మాయెన్ తీసుకున్న నిర్ణయం ఆమె జీవితాన్ని ఒక భయంకరమైన పీడకలగా మార్చుతుంది. చనిపోయిన వరుడు ఆత్మగా మారి, ఆమెను వెంటాడటం ప్రారంభిస్తాడు. ఈ ఆత్మ వల్ల ఆమె కుటుంబం ఆపదలో పడుతుంది. మాయెన్ ఈ శాపం నుండి తప్పించుకోగలదా ? లేక ఈ ఆత్మలు ఆమెను అంధకారంలోకి లాగేస్తాయా? ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉందో తెలుసుకుందాం పదండి.
స్టోరీలోకి వెళితే
ఈ స్టోరీ మాయెన్ లిమ్ అనే యువతి చుట్టూ తిరుగుతుంది. ఆమె తల్లిదండ్రులు మాన్యుయెల్, డోలోరెస్, బంధువులు ఆర్థికంగా కష్టాల్లో ఉంటారు. వీళ్ళంతా ఒక ఆలయంలో చైనీస్ ఒపెరా రచయితలుగా పనిచేస్తారు. మాయెన్ క్లింటన్ యు అనే ఆర్కిటెక్ట్‌తో ప్రేమలో ఉంటుంది. అతను మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చినవాడు. కానీ అతని తల్లిదండ్రులు కఠిన స్వభావం కలిగి ఉంటారు. అయితే మాయెన్ తండ్రి ఇప్పుడు గుండె సమస్యతో బాధపడుతుంటాడు. ఈ కుటుంబం ఇంటిని కోల్పోయే ప్రమాదంలో కూడా ఉంటుంది. ఈ క్రమంలో ఒక రోజు లావో అనే చైనీస్ మ్యాచ్‌మేకర్ మాయెన్‌కు ఒక అసాధారణ ఆఫర్ ఇస్తుంది. ఒక ధనవంతుడైన చైనీస్ కుటుంబంకు చెందిన చనిపోయిన కొడుకు జు జియాన్ రాంగ్‌కు “ఘోస్ట్ బ్రైడ్”గా వివాహం చేసుకోవాలి. ఈ చైనీస్ ఆచారం ప్రకారం, చనిపోయిన ఆత్మలకు వివాహం చేయడం ద్వారా వారిని శాంతింపజేస్తారు. బదులుగా మాయెన్ కుటుంబం సంపద మరియు ఆర్థిక భద్రత పొందుతుంది. మాయెన్ దీనికి మొదట విముఖత చూపినప్పటికీ, తన తండ్రి ఆరోగ్యం, కుటుంబ భవిష్యత్తు కోసం ఈ ఒప్పందాన్ని అంగీకరిస్తుంది. ఆమెకు ఈ ఆచారంలో భాగంగా ఒక బ్రాస్‌లెట్ కూడా ఇవ్వబడుతుంది.
అయితే ఈ ఒప్పందం మాయెన్‌ను ఒక భయంకర శాపంలో చిక్కుకునేలా చేస్తుంది. జు జియాన్ రాంగ్ ఆత్మ, శాంతించడానికి బదులు, మాయెన్‌ను పొసెసివ్‌గా వెంటాడటం ప్రారంభిస్తుంది. ఆమెకు ఇష్టమైన వాళ్ళు ఒక్కొక్కరూ దెయ్యాల దాడులకు గురవుతారు. మరో వైపు మాయెన్ బాయ్‌ఫ్రెండ్ క్లింటన్ మరొక మహిళతో ఎంగేజ్‌మెంట్‌లో ఉన్నాడని తెలుసుకుని ఆమె షాక్ అవుతుంది. ఈ విషయం ఆమె సోదరుడు విక్టర్ ద్వారా బయటపడుతుంది. ఇక ఈ ఘోస్ట్ మ్యారేజ్ రిచువల్ వెనుక ఒక చీకటి రహస్యం ఉందని మాయెన్‌కు అర్థమవుతుంది. మాయెన్ తన స్నేహితుడు డేవిడ్ చావో సహాయంతో ఈ శాపం గురించి తెలుసుకుంటుంది. మాయెన్ ఈ దారుణాలను ఆపడానికి నేపాల్‌లోని ఒక బౌద్ధ ఆలయంలో ఎక్సార్సిజం రిచువల్‌కు సిద్ధమవుతుంది. ఈ రిచువల్ సమయంలో, ఆమె సోల్ నెదర్‌వరల్డ్‌కు పంపబడుతుంది. అక్కడ ఆమె లేక్ ఆఫ్ ఫైర్ అండ్ బ్లడ్‌లో చిక్కుకుంటుంది. ఆమె తన తండ్రి మాన్యుయెల్‌ను కాపాడటానికి జు జియాన్ రాంగ్ ఆత్మతో పోరాడుతుంది. చివరికి మాయెన్ లిమ్ ఈ ఆత్మల నుంచి బయటపడుతుందా ? మాయెన్ లిమ్ ను ఆత్మలు ఎందుకు వెంటాడుతున్నాయి ? ఈ కుటుంబం కష్టాలనుంచి బయట పడుతుందా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : జర్నలిస్ట్ ని టార్గెట్ చేసే మాఫియా … ఓటీటీలో కేక పెట్టిస్తున్నక్రైమ్ థ్రిల్లర్ సిరీస్
ఏ ఓటీటీలో ఉందంటే
ఈ ఫిలిప్పీన్స్ హారర్ మూవీ పేరు ‘ది ఘోస్ట్ బ్రైడ్’ (The Ghost Bride). ఈ సినిమాకి చిటో S. రోనో దర్శకత్వం వహించారు. 1 గంట 51 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకి IMDbలో 5.3/10 రేటింగ్ ఉంది. ఇందులో కిమ్ చియు (మాయెన్ లిమ్), మాటియో గైడిసెల్లి (క్లింటన్ యు), క్రిస్టియన్ బాబుల్స్ (విక్టర్), అలిస్ డిక్సన్ (లావో), రాబర్ట్ సేనా (మాన్యుయెల్) వంటి నటులు నటించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), ఆపిల్ టీవీ (AppleTV) లలో అందుబాటులో ఉంది.