BigTV English
Advertisement

OTT Movie : బస్సు జర్నీకి భయపడే వాళ్ళు చూడకూడని మూవీ… వణికిపోయేలా ఒక్కో సీన్… ఐఎండీబీలో రేటింగ్ 7 ఉన్న సూపర్ న్యాచురల్ థ్రిల్లర్

OTT Movie : బస్సు జర్నీకి భయపడే వాళ్ళు చూడకూడని మూవీ… వణికిపోయేలా ఒక్కో సీన్… ఐఎండీబీలో రేటింగ్ 7 ఉన్న సూపర్ న్యాచురల్ థ్రిల్లర్

OTT Movie : బస్సు జర్నీ అంటేనే భయపెట్టే ఒక ఇంట్రెస్టింగ్ హర్రర్ సిరీస్ ఈ రోజు మన మూవీ సజెషన్. ఈ స్పానిష్ సూపర్‌న్యాచురల్ థ్రిల్లర్ టెలివిజన్ సిరీస్ ను చూస్తే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. బస్సు ప్రమాదం తర్వాత అమ్నీషియాతో బాధపడే ఒక యువతి జీవితంలో జరిగే రహస్యమైన సంఘటనలతో మూవీ అదిరిపోతుంది. అంతేకాదు ఇందులో బ్లాక్ మ్యాజిక్, బాడీ-స్వాపింగ్ వంటి థీమ్‌లు ఉండడంతో స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మరి ఈ సిరీస్ ను ఏ ఓటీటీలో చూడవచ్చు అనే విషయంపై ఓ లుక్కేద్దాం పదండి.


కథలోకి వెళ్తే…
స్పానిష్‌లో ఆల్మా అని పిలుచుకునే ఈ సిరీస్, ఆల్మా (మిరీయా ఒరియోల్) అనే యువతి చుట్టూ తిరుగుతుంది. ఆమె తన సహ విద్యార్థులతో కలిసి ఆస్టూరియాస్ పర్వతాలలో ఒక రిట్రీట్‌కు వెళుతుంది. ఈ గ్రాడ్యుయేషన్ ట్రిప్ సమయంలో, వారి బస్సు దట్టమైన పొగమంచులో వెళ్తుండగా, రోడ్డు టర్నింగ్ లో ప్రమాదానికి గురవుతుంది. దీనిలో దాదాపు అందరూ చనిపోతారు. కానీ ఆల్మా కొద్దిమంది సర్వైవర్‌లలో ఒకరిగా హాస్పిటల్‌లో కోలుకుంటుంది. ఆమెకు అమ్నీషియా ఉండటం వల్ల, ఆ ప్రమాదం గురించి లేదా ఆమె గత జీవితం గురించి ఏమీ గుర్తు ఉండదు. అప్పటి నుంచి ఆమెను ఇంట్లో తనకు చెందని జ్ఞాపకాలు, భయాలు, విచిత్రమైన దృశ్యాలు వేధిస్తాయి.

ఆల్మా తన స్నేహితులు టామ్ (ఆలెక్స్ విల్లాజాన్), బ్రూనో (పోల్ మోనెన్), డియానా (క్లాడియా రోసెట్) సహాయంతో ఈ ప్రమాదం వెనుక ఉన్న రహస్యాన్ని బయట పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఆల్మా తన సోదరి లారా, ఆమె ప్రేమించే టామ్, డేవా (మిలేనా స్మిత్)త ట్రయాంగిల్ లవ్ స్టోరీ చుట్టూ ఒక సూపర్‌ న్యాచురల్ కుట్ర ఉందని కనిపెడుతుంది. ఈ సిరీస్ థీరియన్ అనే పురాణ దెయ్యం, హెక్సాస్పెకులం అనే మాయా అద్దం, బాడీ-స్వాపింగ్ రీఇన్కార్నేషన్ రిచువల్స్‌తో నడుస్తుంది. ఇవన్నీ ఆల్మా నిజమైన గుర్తింపును ప్రశ్నార్థకంగా మారుస్తాయి. హీరోయిన్ ను వెంటాడుతున్న ఆ భయంకరమైన నీడలు ఏంటి? అసలు ఆమె నిజంగానే బతికి బయట పడిందా ? ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఉన్న హర్రర్ స్టోరీ ఏంటి? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.


Read Also : క్లీనింగ్ పనితో కోట్లు సంపాదించే లేడీ కిలాడీ… అదిరిపోయే సర్ప్రైజులు… థ్రిల్లింగ్ ట్విస్టులు

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ ?
‘ది గర్ల్ ఇన్ ది మిర్రర్’ (The Girl in the Mirror) సెర్జియో జి. సాంచెజ్ సృష్టించిన స్పానిష్ సూపర్‌న్యాచురల్ థ్రిల్లర్ సిరీస్. ఇందులో మిరీయా ఒరియోల్, ఆలెక్స్ విల్లాజాన్, పోల్ మోనెన్, క్లాడియా రోసెట్, మిలేనా స్మిత్ , జావియర్ మోర్గాడే తదితరులు నటించారు. ఈ సిరీస్ 9 ఎపిసోడ్‌లతో (ఒక్కో ఎపిసోడ్ 42-56 నిమిషాలు) నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కొన్ని చిన్న పిల్లలతో చూడకూడని సీన్స్ ఉంటాయి. కాబట్టి చూసేటప్పుడు జాగ్రత్త.

Related News

OTT Movie : 20 ఏళ్ల అబ్బాయితో 40 ఏళ్ల ఆంటీ… పాటలతో వలపు వల… ఆ సీన్లైతే అరాచకం భయ్యా

OTT Movies : ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ సినిమాలు.. ఆ నాల్గింటిని మిస్ అవ్వకండి..

OTT Movie : పూలమ్మే పిల్ల జీవితంలోకి మాజీ ప్రియుడు… ఖతర్నాక్ క్లైమాక్స్ మావా

OTT Movie : కుర్రాడి నుంచి పండు ముసలిదాకా ఎవ్వర్నీ వదలని అమ్మాయి… ఇదెక్కడి తేడా యవ్వారంరా సామీ ?

OTT Movie : ప్రియుడిని వదిలేసి మరొకడితో… కళ్ళు తెరిచినా మూసినా అవే సీన్లు… క్లైమాక్స్ కెవ్వు కేక

OTT Movie : చేతబడులతో చచ్చి బతికే కుటుంబం… ‘విరూపాక్ష’ను మించిన బ్లాక్ మ్యాజిక్ మరాఠీ మూవీ తెలుగులో

OTT Movie : తాత వల్ల నలిగిపోయే కూతురు, మనవడు… గుండెను పిండేసే రాశి ఫ్యామిలీ ఎంటర్టైనర్

OTT Movie : హిందువుల ఊచకోతను కళ్ళకు కట్టినట్టు చూపించే మరో రియల్ స్టోరీ… ‘బెంగాల్ ఫైల్స్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

Big Stories

×