OTT Movie : నరమాంసాన్ని తినే మనుషులు ఒకప్పుడు ఉండేవాళ్ళని మనకు తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు కూడా కొంత మంది అమెజాన్ అడవుల్లో ఉన్నారని పుకార్లు కూడా నడుస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా అమెజాన్ అడవులలో ఉండే ఒక ఆదివాసీ తెగ చుట్టూ తిరిగుతుంది. కొంతమంది మనుషులు వీళ్లకు బందీలుగా చిక్కుతారు. ఆ తరువాత జరిగే అరాచకం చూడాలంటే గుండె ధైర్యం గట్టిగానే ఉండాలి. ఈ కానిబల్ థ్రిల్లర్ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ….
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
‘ది గ్రీన్ ఇన్ఫెర్నో’ (The Green Inferno) ఎలి రాత్ దర్శకత్వం వహించిన ఒక కానిబల్ హారర్ సినిమా. ఇది ఒక అమెరికన్ థ్రిల్లర్‌గా రూపొందింది. ఈ చిత్రం 1980లలోని ఇటాలియన్ కానిబల్ సినిమాలైన “కానిబల్ హోలోకాస్ట్” వంటి చిత్రాల నుండి ప్రేరణ పొందింది. ఈ కథ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్‌లో ఒక ఆదివాసీ తెగ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాను ఫ్యామిలీతో కలసి చూడకపోవడమే మంచిది. ఎందుకంటే హింస అంతలా ఇందులో ఉంటుంది. ప్రస్తుతం Amazon Prime Video లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
జస్టిన్ న్యూయార్క్‌లోని ఒక కాలేజ్ విద్యార్థిని. అంతే కాకుండా ఆమె ఒక ఐక్యరాష్ట్ర సమితి లాయర్ కుమార్తె. పర్యావరణ విధ్వంసం, స్త్రీ జననాంగ మ్యుటిలేషన్‌ను ఆపాలనే ఉద్దేశ్యంతో అలెజాండ్రో నేతృత్వంలోని ఒక ఆక్టివిస్ట్ గ్రూప్‌లో చేరుతుంది. ఈ గ్రూప్ పెరూలోని అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్‌లో అక్రమ లాగింగ్‌ను అడ్డుకోవడానికి ఒక వైరల్ నిరసనను ప్లాన్ చేస్తుంది. ఈ నిరసన విజయవంతమవుతుంది. కానీ తిరిగి వస్తున్నప్పుడు వీళ్ళు ఎక్కిన విమానం పెరువియన్ జంగిల్‌లో కూలిపోతుంది. బయటపడిన వారిని స్థానిక ఆదివాసీ తెగ, వారి ఆక్టివిస్ట్ ల గురించి తెలియక బందీలుగా తీసుకుంటుంది. ఈ తెగ కానిబలిస్టిక్ ఆచారాలను అనుసరిస్తుంది.
బందీలైన విద్యార్థులు భీకరమైన హత్యలు, అవయవాల తొలగింపు, మనుషులను వండుకుని తినటం వంటి దృశ్యాలను ఎదుర్కొంటారు. జస్టిన్, ఆమె స్నేహితుడు డానియల్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ గ్రూప్‌లోని అలెజాండ్రో ద్రోహం, తెగ హింసాత్మక ఆచారాలు వారి ప్రయత్నాలకు అడ్డు తగులుతాయి. వీళ్ళు ఒక్కో క్షణం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతుంటారు. చివరికి ఒక్కరైనా అక్కడి నుంచి తప్పించుకుంటారా ? అందరూ ఈ తెగ చేతిలో బలవుతారా ? వీళ్ళను కాపాడటానికి ఎవరైనా వస్తారా ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ అమెరికన్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చుడండి.
Read Also : నెట్ ఫ్లిక్స్ చరిత్రలోనే అత్యంత భయంకరమైన సిరీస్… గుండె గట్టిగా ఉంటేనే చూడండి