BigTV English

OTT Movie : నెట్ ఫ్లిక్స్ చరిత్రలోనే అత్యంత భయంకరమైన సిరీస్… గుండె గట్టిగా ఉంటేనే చూడండి

OTT Movie : నెట్ ఫ్లిక్స్ చరిత్రలోనే అత్యంత భయంకరమైన సిరీస్… గుండె గట్టిగా ఉంటేనే చూడండి
Advertisement

Netflix Horror Web Series : ఓటీటీ ప్రపంచంలోకి వెబ్ సిరీస్ లు అడుగు పెట్టాక ఎంటర్టైన్మెంట్ రెట్టింపు అయ్యింది. ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయే వెబ్ సిరీస్ హర్రర్ జానర్లో రూపొందింది. ఇది హర్రర్ ప్రియుల హృదయాలను గెలుచుకోవడమే కాకుండా, ఊహించని మలుపులతో కట్టిపడేసింది. దీనికి IMDb లో 8.5 అద్భుతమైన రేటింగ్ దక్కడమే కాదు, హాలీవుడ్ దిగ్గజ రచయిత స్టీఫెన్ కింగ్ కూడా ఈ చిత్రాన్ని “జీనియస్” అని పిలిచారు. మరి ఇంతటి అద్భుతమైన ఈ సిరీస్ కథేంటి? టైటిల్ ఏంటో తెలుసుకుందాం పదండి.


నెట్ ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్
ఈ సిరీస్ పేరు ‘The Haunting of Hill House’. 2018లో విడుదలైన ఈ అమెరికన్ సూపర్‌ నాచురల్ హారర్ డ్రామా సిరీస్ షిర్లీ జాక్సన్ రాసిన 1959 నవల ఆధారంగా రూపొందింది. ఇది ఒక కుటుంబం హిల్ హౌస్ అనే భయంకరమైన మాన్షన్‌లో గడిపిన సమయం, దాని తర్వాత వారి జీవితాలపై దాని ప్రభావాన్ని రెండు టైమ్‌లైన్‌లలో (1992, 2018) చూపిస్తుంది. ఈ సిరీస్ లో ఉన్న భయంకరమైన దృశ్యాలు వెన్నులో వణుకు పుట్టిస్తాయి. నెట్ ఫ్లిక్స్ లోనే అత్యంత భయంకరమైన హర్రర్ సిరీస్ గా పేరు తెచ్చుకుంది ఈ సిరీస్. 10 ఎపిసోడ్‌లతో, ఒక్కో ఎపిసోడ్ సుమారు 50-70 నిమిషాల నిడివితో ఉంది.

కథలోకి వెళ్తే…
1992లో హ్యూ క్రెయిన్ (హెన్రీ థామస్), అతని భార్య ఒలివియా (కార్లా గుగినో) తమ ఐదుగురు పిల్లలు స్టీవెన్, షిర్లీ, థియోడోరా, లూక్, ఎలియనోర్ తో హిల్ హౌస్‌లోకి వెళతారు. దానిని రిపేర్ చేసి అమ్మేసి, తమ “ఫరెవర్ హౌస్” నిర్మించడానికి. కానీ ఊహించని రిపేర్‌ల వల్ల అక్కడే వాళ్ళు ఎక్కువ కాలం ఉండాల్సి వస్తుంది. అదే టైంలో ఇంట్లో వింతైన సంఘటనలు గోడల్లో శబ్దాలు, దెయ్యాలు కన్పించడం, ఒలివియా వింత ప్రవర్తన ఆ ఫ్యామిలీని టెన్షన్ పెడతాయి.


పిల్లలు, ముఖ్యంగా నెల్, లూక్ “బెంట్-నెక్ లేడీ” వంటి భయంకరమైన దెయ్యాలను చూస్తారు. కానీ హ్యూ, ఒలివియా వాటిని పిల్లల ఊహలుగా పరిగణిస్తారు. ఒలివియా మానసిక స్థితి రోజురోజుకీ క్షీణిస్తుంది. ఒకరోజు రాత్రి ఆమె తన పిల్లలకు విషం ఇవ్వడానికి ట్రై చేస్తుంది. కానీ హ్యూ వారిని రక్షించి, ఇంటి నుండి తప్పించుకుంటాడు. ఒలివియా మాత్రం ఇంట్లోనే చనిపోతుంది. కానీ ఆ వివరాలు రహస్యంగా ఉంటాయి.

Read Also : భూగర్భంలో నీడల్లాంటి మనుషులు… రూపాన్ని దోచేసే రాక్షసులు… రోమాలు నిక్కబొడుకునే హర్రర్ సీన్లు

2018లో క్రెయిన్ తోబుట్టువులు పెద్దవారై, వారి బాల్య గాయాలతో ఇంకా పోరాడుతుంటారు. స్టీవెన్ (మిచియెల్ హుయిస్‌మాన్) హిల్ హౌస్ గురించి ఒక పుస్తకం రాస్తాడు. షిర్లీ (ఎలిజబెత్ రీసర్) ఫ్యూనరల్ హోమ్ నడుపుతుంది. థియో (కేట్ సీగల్) సైకాలజిస్ట్‌గా పని చేస్తుంది. లూక్ (ఓలివర్ జాక్సన్-కోహెన్) డ్రగ్ అడిక్షన్‌తో బాధపడుతుంది. నెల్ (విక్టోరియా పెడ్రెట్టి) డిప్రెషన్‌తో హిల్ హౌస్‌కు తిరిగి వెళుతుంది. అక్కడ “బెంట్-నెక్ లేడీ” ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపిస్తుంది. నెల్ మరణం తర్వాత తోబుట్టువులు, వారి తండ్రి హ్యూ (టిమోతీ హట్టన్) హిల్ హౌస్‌కు తిరిగి వెళతారు. ఆ ఇంట్లో ఉన్న రెడ్ రూమ్ సీక్రెట్ ఏంటి? ఈ బెంట్ నెక్ లేడి ఎందుకు వీళ్ల వెంట పడింది? చివరకు ఏమైంది? అనే విషయాలు తెలియాలంటే ఈ సిరీస్ పై ఓ లుక్కేయ్యాల్సిందే.

Related News

OTT Movie : పిల్లాడికి కాకుండా పిశాచికి జన్మనిచ్చే తల్లి… కల్లోనూ వెంటాడే హర్రర్ మూవీ

OTT Movie : బేస్మెంట్లో బంధించి పాడు పని… కూతురిని వదలకుండా… షాకింగ్ రియల్ స్టోరీ

OTT Movie : అక్క బాయ్ ఫ్రెండ్ తో చెల్లి… నరాలు జివ్వుమన్పించే సీన్లు మావా… ఇయర్ ఫోన్స్ మాత్రం మర్చిపోవద్దు

OTT Movie : బాయ్ ఫ్రెండ్ తో ఒంటరిగా గడిపే అమ్మాయిలే ఈ కిల్లర్ టార్గెట్… వెన్నులో వణుకు పుట్టించే థ్రిల్లర్ మావా

OTT Movie : వరుసగా అమ్మాయిలు మిస్సింగ్… ప్రొఫెసర్ ముసుగులో సైకో వల… సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : 8 ఏళ్ల తరువాత థియేటర్లలోకి… నెలలోపే ఓటీటీలోకి 170 కోట్ల హిలేరియస్ కోర్ట్ రూమ్ డ్రామా

OTT Movie : జంప్ అవ్వడానికి ట్రై చేసి అడ్డంగా బుక్… ఇష్టం లేకుండానే ఆ పని… తెలుగు మూవీనే మావా

OTT Movie : అనుకున్న దానికంటే ముందుగానే ఓటీటీలోకి ‘కాంతారా చాఫ్టర్ 1’… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

Big Stories

×