Survival Thriller: మనుషుల్ని వేటాడటాన్ని సరదాగా మార్చుకున్న కొంతమంది ధనవంతులు… వాళ్ల కోసం ఓ ప్రత్యేకమైన వేట స్థలం… అక్కడికి తీసుకొచ్చిన సాధారణ వ్యక్తులకు తమపై ఏం జరగబోతోందో కూడా తెలియదు. కానీ ఈసారి వాళ్లు ఎంచుకున్న బాధితుల్లో ఓ అమ్మాయి మాత్రం ఊహించినంత సులభమైన టార్గెట్ కాదు. తనను వేటాడుతున్న వాళ్ల కంటే ఒక్క అడుగు ముందే ఆలోచిస్తూ, ఒక్కొక్కరినీ ఎదుర్కొంటూ, ఆమె వేటగాళ్ళనే తన ఎరగా మార్చుకుంటుంది. డబ్బు, అధికారం ఉన్నవాళ్లే వేటగాళ్లుగా మారితే ఎలా ఉంటుందో చూపించే బ్లడీ సర్వైవల్ థ్రిల్లర్ ‘ది హంట్’ (The Hunt). మరి ఈ భయంకరమైన వేటను ఏ ఓటీటీలో చూడవచ్చు అంటే ?
క్రిస్టల్ అనే యువతి కళ్లు తెరిచేసరికి తనతో పాటు మరికొందరు అపరిచితులతో పాటే ఓ తెలియని ప్రదేశంలో ఉంటుంది. వాళ్లందరికీ అక్కడికి ఎలా వచ్చారో గుర్తుండదు. కొద్దిసేపటికే తాము ఓ వేటలో భాగమయ్యామని వాళ్లకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ వేటాడేది జంతువులు కాదు… మనుషులే. సంపన్నులు తమ వినోదం కోసం సాధారణ ప్రజలను ఎంపిక చేసుకుని, వారిని వేటాడే భయంకరమైన ఆటను నిర్వహిస్తుంటారు.
మొదట ఈ గేమ్ లో చిక్కుకున్న వాళ్లు పరిస్థితిని అర్థం చేసుకునేలోపే దాడులు మొదలవుతాయి. చుట్టూ ఎక్కడ చూసినా ప్రమాదమే కనిపిస్తుంది. ఎక్కడి నుంచి బుల్లెట్ వస్తుందో, ఎవరు తమను వెంబడిస్తున్నారో తెలియని పరిస్థితి. కానీ క్రిస్టల్ మాత్రం భయంతో కుప్పకూలిపోదు. చుట్టూ ఉన్న పరిస్థితులను గమనిస్తూ, తనను వేటాడుతున్న వాళ్ల కదలికలను అంచనా వేయడం మొదలు పెడుతుంది.
ఆమెకు ఎదురయ్యే ప్రతి ప్రమాదం తర్వాత క్రిస్టల్ మరింత జాగ్రత్తగా మారుతుంది. ఈ వేట వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు ? ఎందుకు ఇలాంటి ఆట ఆడుతున్నారు ? బాధితులను ఎలా ఎంపిక చేస్తున్నారు ? అనే విషయాలు ఒక్కొక్కటిగా బయట పడతాయి. ముఖ్యంగా తనతో పాటు చిక్కుకున్న వాళ్లలో ఎవరు నిజంగా బాధితులు, ఎవరి వెనుక ఎలాంటి రహస్యం ఉందనే అనుమానం కూడా కథలో ఉత్కంఠ పెంచుతుంది.
వేటగాళ్లు క్రిస్టల్ ను సాధారణ బాధితురాలిగా భావిస్తారు. కానీ ఆమె వారి అంచనాలను తలకిందులు చేస్తుంది. తప్పించుకోవడమే లక్ష్యంగా మొదలైన ఆమె పోరాటం… క్రమంగా తనను వేటాడుతున్న వాళ్లను ఎదుర్కొనే భయంకరమైన యుద్ధంగా మారుతుంది. చివరకు ఈ ఆటను ఎవరు మొదలు పెట్టారు ? దాని వెనుక అసలు ఉద్దేశం ఏమిటి ? క్రిస్టల్ ఎవరు ? ఆమె ఆ ధన్యవంతులను ఎలా వేటాడింది ? అన్నది తెలియాలంటే సినిమాను మస్ట్ వాచ్.
బెట్టీ గిల్పిన్ , హిల్లరీ స్వాంక్, ఇక్ బారిన్‌హోల్ట్జ్ నటించిన ‘ది హంట్’ మూవీకి క్రెయిగ్ జోబెల్ దర్శకత్వం వహించారు. Netflixలో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఇంగ్లీష్, హిందీ ఆడియోలతో సినిమాను చూడవచ్చు. టాలీవుడ్ ఆడియన్స్ ను నిరాశ కలిగించే విషయం ఏమిటంటే… సినిమాకి తెలుగు డబ్ లేదా తెలుగు సబ్‌టైటిల్స్ మాత్రం లేవు.
Read Also: రాత్రికి రాత్రే పాపులర్… సోషల్ మీడియా స్టార్స్ లైఫ్ ఇంత ఘోరంగా ఉంటుందా ? మస్ట్ వాచ్ మలయాళం థ్రిల్లర్