E-Paper
Advertisement

రాత్రికి రాత్రే పాపులర్… సోషల్ మీడియా స్టార్స్ లైఫ్ ఇంత ఘోరంగా ఉంటుందా ? మస్ట్ వాచ్ మలయాళం థ్రిల్లర్

రాత్రికి రాత్రే పాపులర్… సోషల్ మీడియా స్టార్స్ లైఫ్ ఇంత ఘోరంగా ఉంటుందా ? మస్ట్ వాచ్ మలయాళం థ్రిల్లర్
Advertisement

Malayalam Thriller: సోషల్ మీడియాలో ఒక్క వీడియో వైరల్ అయితే చాలు… ఒక్క రాత్రిలోనే సెలబ్రిటీ అయిపోవచ్చు. కానీ ఆ పాపులారిటీతో పాటు వచ్చే ఒత్తిడి, ప్రైవసీ కోల్పోవడం, డబ్బు కోసం ఇతరులు తమ జీవితాన్ని నియంత్రించడం మొదలైతే పరిస్థితి ఎలా మారుతుంది? దుబాయ్‌ లో నర్స్‌ గా పని చేసే ఓ యువతి జీవితంలో జరిగిన ఓ చిన్న సంఘటన ఆమెను ఒక్కసారిగా సోషల్ మీడియా స్టార్‌ గా మార్చేస్తుంది. మొదట ఆ గుర్తింపు ఆమెకు ఆనందాన్నే ఇస్తుంది. కానీ అదే పాపులారిటీ తర్వాత ఆమెకు సమస్యగా మారుతుంది. ఇదే స్టోరీతో రూపొందిన మలయాళం సినిమా ‘అభిరామి’ (Abhirami). మరి ఈ సినిమాను ఏ ఓటీటీలో చూడవచ్చు ? తెలుగులో ఉందా లేదా ? అనేది తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే…

దుబాయ్‌ లో నర్స్‌ గా పని చేసే అభిరామి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉంటుంది. తన రొటీన్ జీవితానికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. ఓ రోజు ఆమె ఓ ప్రముఖ శాస్త్రవేత్తతో వీడియో తీస్తుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తర్వాత అనూహ్యంగా వైరల్ అవుతుంది. ఒక్కసారిగా ఆమెను గుర్తించే వారి సంఖ్య పెరుగుతుంది.

Advertisement

ఆ వైరల్ వీడియో తర్వాత అభిరామి జీవితంలో ఊహించని మార్పు వస్తుంది. ఓ పీఆర్ కంపెనీ ఆమెను సంప్రదించి ఏడాది పాటు తమతో పని చేయమని అవకాశం ఇస్తుంది. సాధారణ నర్స్ జీవితానికి ఒక్కసారిగా సెలబ్రిటీ ప్రపంచం దగ్గరవుతుంది. ఇంటర్వ్యూలు, సోషల్ మీడియా పోస్టులు, ప్రచారం… ఇలా ఆమె పేరు మరింత మందికి చేరుతుంది.

మొదట ఇదంతా తనకు వచ్చిన మంచి అవకాశంగానే అభిరామి భావిస్తుంది. కానీ పాపులారిటీ పెరిగే కొద్దీ తన జీవితంపై తనకున్న నియంత్రణ తగ్గిపోతుంది. ఒకప్పుడు తనకు నచ్చినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఆమె, తర్వాత ఇతరులు చెప్పినట్లు వ్యవహరించాల్సిన పరిస్థితిలో పడుతుంది. తన ఇమేజ్‌ ను కాపాడుకోవడం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది.

Advertisement

సెలబ్రిటీగా మారిన తర్వాత ఆమెకు వచ్చిన సమస్యలు కేవలం సోషల్ మీడియా కామెంట్లకే పరిమితం కావు. తనను చుట్టుముట్టిన వాళ్ల ఉద్దేశాలు, డబ్బు కోసం మారుతున్న సంబంధాలు, పాపులారిటీ వెనుక ఉన్న ఒత్తిడి ఆమెను ఇబ్బంది పెడతాయి. ఒక దశలో తాను నిర్మించుకున్న వర్చువల్ ప్రపంచం నుంచి బయటకు రావాల్సిన అవసరం అభిరామికి తెలుస్తుంది. అదే సమయంలో తన జీవితాన్ని మార్చిన ఆ వైరల్ వీడియోలో కనిపించిన వ్యక్తి ఆమెకు మరోసారి సహాయం చేస్తాడు. తనపై ఏర్పడిన ఇమేజ్‌ ను దాటి నిజమైన జీవితాన్ని తిరిగి పొందేందుకు అభిరామి ప్రయత్నిస్తుంది. మరి సోషల్ మీడియా ప్రపంచం వెనుక ఉన్న ఆ మరో కోణం ఏంటి ? దాని నుంచి అభిరామి ఎలా బయట పడింది ? అనేది తెలుసుకోవాలంటే మూవీపై ఒక లుక్కేయండి.

ఓటీటీలో ఎక్కడ చూడొచ్చు?

గాయత్రి సురేష్ (Gayathri Suresh), రోషన్ బషీర్ (Roshan Basheer), హరికృష్ణన్ (Harikrishnan), సారా సిరియాక్ (Sarah Cyriac) తదితరులు నటించిన ఈ మలయాళ చిత్రానికి ముష్తాక్ రహ్మాన్ కరియాడెన్ (Mushthaque Rahman Kariyaden) దర్శకత్వం వహించారు. 2024లో వచ్చిన ఈ మూవీ ప్రస్తుతం Manorama MAXలో అందుబాటులో ఉంది. మలయాళం ఆడియో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ ఉన్నాయి. కానీ తెలుగుతో పాటు ఇతర భాషల్లో అందుబాటులో లేదు.

Read Also: యాక్సిడెంట్లో యూనికార్న్ డెత్… రక్తం కోసం మనుషులే రాక్షసులైతే? క్రేజీ హారర్ థ్రిల్లర్

Related News

శోభనం అయ్యాక మ్యాటర్ లేదంటూ రూమర్స్… పిల్లల్ని కని చూపిస్తే పొలం మొత్తం అతనికే… తెలుగులోనే ఈ ఫ్యామిలీ కామెడీ మూవీ

ఎడారిలో తప్పిపోయిన బాలుడి సాహసం… ఈ అడ్వెంచర్ మూవీని తెలుగులోనూ చూడవచ్చు

ఇన్ఫినిటీ క్యాసిల్‌లో డెమాన్స్‌పై ఫైనల్ వార్… తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతున్న సూపర్ హిట్ యాక్షన్ యానిమే

ఉద్యోగం కోసం పోరాటం… కానీ ఆఫీస్‌లో ఎవరినీ నమ్మలేని పరిస్థితి… చైనీస్ వర్క్‌ప్లేస్ డ్రామా

నెట్ ఫ్లిక్స్ లోకి రాబోతున్న ‘రోమాంచకం’ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఇంటికి ఎదురుగా ముసుగేసుకుని కూర్చొనే మహిళ… దగ్గరయ్యే కొద్దీ పెరిగే భయం… సూపర్‌నేచురల్ హారర్ థ్రిల్లర్

యాక్సిడెంట్లో యూనికార్న్ డెత్… రక్తం కోసం మనుషులే రాక్షసులైతే? క్రేజీ హారర్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×