BigTV English

OTT Movie : ఈ అమ్మాయి బాడీ స్మెల్ చూస్తే మాన్స్టర్ అవుతారు… ఇదెక్కడి దిక్కుమాలిన ఐడియారా సామీ

OTT Movie : ఈ అమ్మాయి బాడీ స్మెల్ చూస్తే మాన్స్టర్ అవుతారు… ఇదెక్కడి దిక్కుమాలిన ఐడియారా సామీ

OTT Movie : ఓటిటిలోకి రకరకాల వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ వస్తున్నాయి అయితే కొన్ని వెబ్ సిరీస్ లో డిఫరెంట్ స్టోరీలతో తెరకెక్కుతున్నాయి ఇప్పుడు మనం చెప్పుకోబోయే వెబ్ సిరీస్ లో ముగ్గురు మనుషులు ఒక వింత ప్రయోగానికి గురవుతారు. అందువల్ల వాళ్లకి కొన్ని శక్తులు కూడా వస్తాయి.  అయితే వాళ్లు మళ్లీ మనుషుల రూపాన్ని కావాలనుకుంటారు. ఈ క్రమంలో స్టోరీ ముందుకు వెళుతూ ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాల్లోకి వెళితే ..


నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో

ఈ కెనడియన్ సైన్స్ ఫిక్షన్ టెలివిజన్ సిరీస్ పేరు ‘ది ఇంపర్‌ఫెక్ట్స్’ (The Imperfects).  2022 లో వచ్చిన ఈ సిరీస్ ను డెన్నిస్ హీటన్, షెల్లీ ఎరిక్సెన్ తెరకెక్కించారు. ఈ సిరీస్ సీటెల్‌లో నివసించే ముగ్గురు యువకులు అబ్బి, జువాన్, టిల్డా చుట్టూ తిరుగుతుంది. వీరు ఒక ప్రయోగాత్మక జన్యు చికిత్సకు గురై, దాని ఫలితంగా వారు రాక్షసులుగా మారతారు. ఈ చికిత్స వారి DNAని మార్చి, వారికి అసాధారణ శక్తులను ఇస్తుంది. అబ్బి సక్యూబస్ (పురుషులను ఆకర్షించే ఆడ రాక్షసి), జువాన్ చుపాకాబ్రా (పశువులను చంపే జీవి) టిల్డా బాన్‌షీ (అరుపులతో వినాశనం కలిగించే ఆత్మ) లాంటి లక్షణాలను పొందుతారు.ఆ తరువాత అసలు స్టోరీ మొదలు అవుతుంది. ఈ సైన్స్ ఫిక్షన్ టెలివిజన్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

ముగ్గురు స్నేహితులు వింత మనుషులుగా మారిపోతారు. తమను ఈ పరిస్థితిలోకి నెట్టిన శాస్త్రవేత్త డాక్టర్ అలెక్స్ సర్కోవ్ ను కనిపెట్టి, మళ్లీ మానవులుగా మార్చమని ఒత్తిడి చేయాలని నిర్ణయించుకుంటారు. ఈ ప్రయాణంలో వారికి డాక్టర్ సిడ్నీ బర్క్ అనే మరో శాస్త్రవేత్త వీళ్ళకు సహాయం చేస్తుంది. ఆమె సర్కోవ్‌తో గతంలో పనిచేసిన వ్యక్తిగా ఉంటుంది. ఈ ప్రయోగాల్లో తన పాత్ర గురించి పశ్చాత్తాపం చెందుతుంది. వీరు సర్కోవ్‌ను వెతుకుతూ వెళ్తున్నప్పుడు, వారి కొత్త శక్తుల వల్ల వచ్చే సమస్యలను ఎదుర్కొంటారు. టిల్డా తన అరుపుల వల్ల గాయకురాలిగా కెరీర్‌ను కోల్పోతుంది. అబ్బి తన సక్యూబస్ శక్తుల వల్ల సాధారణ సంభాషణలు కూడా కష్టతరం అవుతాయి. జువాన్ తన చుపాకాబ్రా రూపంలో నియంత్రణ కోల్పోతాడు. ఈ ప్రక్రియలో వారు ఇతర ప్రయోగాత్మక బాధితులను కలుస్తారు. ఒక ప్రభుత్వ సంస్థ అయిన ఫ్లక్స్ వారిని వేటాడుతుంది.అబ్బి, జువాన్‌లకు దీనినుంచి బయటపడే ఒక నివారణ లభిస్తుంది. కానీ అది శాశ్వతం కాదని తెలుస్తుంది. టిల్డా తన శక్తుల గురించి తెలుసుకుని , వాటిని మంచి కోసం ఉపయోగించాలని నిర్ణయిస్తుంది. అయితే, సిడ్నీ బర్క్‌లో ఒక చీకటి రహస్యం బయటపడుతుంది. ఆమెలో ఇజాబెల్ ఫించ్ అనే హంతక వ్యక్తిత్వం ఉందని, దాని వల్ల ఊహించని ప్రమాదాలు జరుగుతాయని తెలుసుకుంటుంది. చివరికి ఈ ముగ్గురూ మళ్ళీ మామూలు మనుషులు అవుతారా ? శాస్త్రవేత్త అలెక్స్ సర్కోవ్ ను వీళ్ళు కనిపెడతారా ?ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే,ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

Mothevari Love story: స్ట్రీమింగ్ కి సిద్ధమైన మోతెవరి లవ్ స్టోరీ.. తెలంగాణ గ్రామీణ ప్రేమకథగా!

OTT Movie : ఆ 19వ ఫ్లోర్ నరకం… యాక్సిడెంట్ తో వర్చువల్ రియాలిటీ గేమ్ ఉచ్చులో… ఓడితే కోమాలోకి

OTT Movie : అయ్య బాబోయ్ టీచర్ కు అబ్బాయిల మోజు… పోలీస్ తోనే వైరల్ వయ్యారి రాసలీలలు

OTT Movie : అందమైన అమ్మాయిపై కన్నేసే మాఫియా డాన్… 365 రోజులు బందీగా ఉంచి అదే పని… అన్నీ అవే సీన్లు

OTT Movie : భార్య ప్రైవేట్ ఫొటోలు బయటకు…. భర్త ఉండగానే దారుణం… బ్లాక్‌మెయిలర్

OTT Movie : స్కామర్ తో మిలియనీర్ సయ్యాట… ఒక్క నైట్ కలిశాక థ్రిల్లింగ్ ట్విస్ట్

Big Stories

×