OTT Movie : ఈగ అంటే మొదటగా రాజమౌళి సినిమానే గుర్తుకు వస్తుంది. ఆ విజువల్స్ ఇప్పటికీ కళ్ళముందు కదులుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే హాలీవుడ్ మూవీలో, ఈగ చేసే విన్యాసాలకు పొట్ట చక్కలైపోతుంది. కామెడీ జానర్లో వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది ? అనే వివరాల్లోకి వెళితే ..
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ ఫ్రెంచ్ కామెడీ-ఫాంటసీ మూవీ పేరు ‘మాండిబుల్స్ (Mandibles). 2020లో విడుదలైన ఈ సినిమాకి క్వెంటిన్ డుపియక్స్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో గ్రెగోయిర్ లుడిగ్, డేవిడ్ మార్సైస్, అడెలె ఎక్సార్కోపౌలోస్, ఇండియా హెయిర్, రోమియో ఎల్విస్, కొరాలీ రస్సియర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఒక అసాధారణమైన, విచిత్రమైన హాస్యంతో నిండిన కథను అందిస్తుంది, ఇది ఇద్దరు సరళమైన స్నేహితులు మరియు ఒక భారీ ఈగ చుట్టూ తిరుగుతుంది. 1 గంట 17 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకి IMDB లో 6.6/10 రేటింగ్ ఉంది. ఈ ఫ్రెంచ్ సినిమా తెలుగు. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
మాను, జీన్-గాబ్ అనే ఇద్దరు తెలివితక్కువ స్నేహితులు దక్షిణ ఫ్రాన్స్‌లో ఒక విచిత్రమైన సాహసంలోకి దిగుతారు. మాను సీక్రెట్ గా ఒక సూట్‌కేస్‌ను డెలివరీ చేయాలని, అలా చేస్తే కొన్ని డబ్బులు ఇస్తానని ఒక వ్యక్తి ఆఫర్ చేస్తాడు.ఈ పని కోసం అతను తన స్నేహితుడు జీన్-గాబ్‌ను తీసుకుంటాడు. వీళ్ళు దీనికోసం ఒక పాత మెర్సిడెస్ కారును దొంగిలిస్తారు. వీళ్ళు ఈ సూట్‌కేస్ డెలివరీ మిషన్‌లో ఉండగా, కారు డిక్కీ నుండి వింతైన శబ్దం వినిపిస్తుంది. డిక్కీ తెరిచి చూసే ఒక్కసారిగా షాక్ అవుతారు. అక్కడ ఒక భారీ ఈగ, దాదాపు చిన్న కుక్క పరిమాణంలో ఉంటుంది. ఈ ఈగను జీన్-గాబ్ “డొమినిక్” అని పేరు పెడతాడు. సాధారణ మనుషులు అయితే ఈ జీవిని చూసి భయపడి పోతారు. కానీ మాను, జీన్-గాబ్ దీనిని సాధారణంగా తీసుకుంటారు. ఈ ఈగ ఎందుకు ఇంత పెద్దగా ఉంది? అని వీళ్ళు ప్రశ్నించరు, బదులుగా దీనిని ఒక అవకాశంగా భావిస్తారు. వీళ్ళు తమ డెలివరీ మిషన్‌ను పక్కనపెట్టి, ఈ ఈగకు శిక్షణ ఇచ్చి, దానితో దొంగతనాలు చేయించి డబ్బు సంపాదించాలని నిర్ణయిస్తారు.
ఇక డొమినిక్‌ను కుక్కలా శిక్షణ ఇచ్చి, దానిని బ్యాంక్ దొంగతనాలకు ఉపయోగించాలని ఊహిస్తారు. ఈ ఆలోచన వారి తెలివితక్కువ తనాన్ని చూపిస్తుంది. ఈ ఈగ ఒక అద్భుతమైన పప్పెట్ ద్వారా సృష్టించబడింది. దీని కళ్ళు, తలను వంచే విధానం, దాని చర్యలు క్రమంగా ఒక పెంపుడు జంతువులా మారుస్తాయి. మాను, జీన్-గాబ్ ఈ ఈగతో దక్షిణ ఫ్రాన్స్‌లో ఒక రోడ్ ట్రిప్‌లో సాహసం చేస్తారు. ఈ ప్రయాణంలో, వీళ్ళు అనేక హాస్యాస్పదమైన సంఘటనలను ఎదుర్కొంటారు. ఒక సమయంలో వీళ్ళు సెసిలీ అనే యువతిని కలుస్తారు. ఆమె మానును పొరపాటున తన పాత ప్రియుడిగా భావించి, తన సమ్మర్ విల్లాకు ఆహ్వానిస్తుంది. ఈ విల్లాలో సెసిలీ, ఆమె సోదరుడు సెర్జ్, వారి స్నేహితులు సాండ్రిన్, అగ్నెస్ ఉంటారు. ఈ విల్లాలో మాను, జీన్-గాబ్ తమ భారీ ఈగను రహస్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. కానీ వీళ్ళ తెలివితక్కువతనం కారణంగా అక్కడ పరిస్థితి గందరగోళంగా మారుతుంది. చివరికి ఈ ఈగ ద్వారా వీళ్ళు డబ్బు సంపాదిస్తారా ? లేకపోతే సమస్యల్లో పడతారా ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూసేయండి.
Read Also : ఈ స్కూల్ లో తప్పు చేస్తే లేపేస్తారు… ‘స్క్విడ్ గేమ్’ లాంటి అదిరిపోయే థ్రిల్లర్