OTT Movie : హారర్ జానర్ లో ప్రేక్షకులను భయపెట్టడానికి, సినిమాలు కొత్త తరహాలో వస్తున్నాయి. ఓటిటిలో ఈ సినిమాలకి ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంది. కొన్ని సినిమాలు కామెడీతో ఎంటర్టైన్ చేస్తే, మరి కొన్ని సినిమాలు వెన్నులో వణుకు పుట్టిస్తుంటాయి. అయితే కామెడీ కంటెంట్ సినిమాలను ఒంటరిగా చూడగలుగుతారేమోగాని, భయపెట్టించే సినిమాలను ఎవరో ఒకరు తోడుంటే మాత్రం చూస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో, దెయ్యాలు మొక్కల రూపంలో వణుకు పుట్టిస్తాయి. దొరికిన వాళ్లను దొరికినట్టుగా ఈ మొక్కలు వేటాడుతాయి. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
ఒక దుష్ట మంత్రగత్తె చిన్న పట్టణంలో ఆత్మలను తన ఆధీనంలో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఒక రోజు ఆత్మలను సన్‌ఫ్లవర్ ప్లాంట్స్ లోకి పంపిస్తుంది. ఈ మొక్కలు రాక్షస సన్‌ఫ్లవర్‌లు గా మారి మనుషులను భయ బ్రాంతులకు గురి చేస్తుంటాయి. కొంతమంది టీనేజర్లు ఒక ఫెస్టివల్ రోజు, ఈ మొక్కల దాడికి భయపడతారు. అక్కడి నుంచి తప్పించుకోవాలంటే, ఈ భయంకరమైన మొక్కలతో పోరాడాల్సి వస్తుంది.ఈ మొక్కలు టౌన్‌లో భయానక వాతావరణాన్ని సృష్టిస్తాయి. టీనేజర్లు ఈ మొక్కలతో పోరాడి, వాటి నుండి తప్పించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తారు. ఈ మొక్కలు మంత్రగత్తె శక్తుల ఆధీనంలో ఉంటాయి.
మరోవైపు ఒక అమ్మాయిని ఒక వ్యక్తి ప్రేమ పేరుతో వెంబడిస్తుంటాడు. అతని వల్ల ఆమె చాలా భయాందోళనలను అనుభవిస్తుంది. అతడు ఆమె పట్ల చాలా క్రూరంగా ప్రవర్తిస్తాడు. ఈ క్రమంలో ఊహించని సంఘటనలు ఎదురౌతాయి. చివరికి ఆ సన్‌ఫ్లవర్ మొక్కల నుంచి టీనేజర్లు తప్పించుకుంటారా ? మంత్రగత్తె ఎందుకు ఆత్మలను సన్‌ఫ్లవర్ ప్లాంట్స్ లోకి పంపిస్తుంది ? దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి ? అమ్మాయి వేధింపులకు, మంత్రగత్తె కు సంబంధం ఉందా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ హారర్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి. ఈ సినిమాలో భయపెట్టే సన్నివేశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఒంటరిగా మాత్రం ఈ సినిమాని చూడకండి.
Read Also : ప్రేమ పేరుతో పేద కుటుంబాన్ని నాశనం చేసే అమ్మాయి… కిర్రాక్ ట్విస్టులున్న రివేంజ్ డ్రామా
యూట్యూబ్ (youtube) లో స్ట్రీమింగ్
ఈ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది స్టాకింగ్’ (The Stalking). 2024 లో వచ్చిన ఈ మూవీకి జెఫ్ కిర్కెండాల్ దర్శకత్వం వహించారు. ఈ స్టోరీ సన్ ఫ్లవర్ ప్లాంట్స్ చుట్టూ తిరుగుతుంది. ఒక మంత్రగత్తె వల్ల, ఈ మొక్కలు క్రూరంగా ప్రవర్తిస్తాయి. హారర్ జానర్‌లో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను బాగానే భయపెట్టింది. ఈ మూవీ ప్రస్తుతం యూట్యూబ్ (youtube) లో అందుబాటులో ఉంది.