OTT Movie : సైకో సినిమాలు ప్రతిక్షణం ఉత్కంఠంగా నడుస్తూ ఉంటాయి. సైలెంట్ గా ఉండే ఈ సైకోలను చూసినప్పుడు గుండె జారిపోతూ ఉంటుంది. రీసెంట్ గా వచ్చిన ఒక హాలీవుడ్ సినిమాలో, ముగ్గురు సైకోలు ఒక కొండ ప్రాంతంలో మనుషుల్ని చంపుతూ ఉంటారు. వీళ్ళ చేతిలోకి ఒక జంట చిక్కుతుంది. అప్పుడే స్టోరీ ఒక రేంజ్ లో కి వెళ్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ….
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ అమెరికన్ హర్రర్ మూవీ పేరు ‘ది స్ట్రేంజర్స్: చాప్టర్’ 1 (The Strangers: Chapter 1). 2024 లో విడుదలైన ఈ మూవీ ‘The Strangers’ ఫిల్మ్ సిరీస్‌లో మూడవ చిత్రంగా వచ్చింది. ఈ సినిమానకి రెన్నీ హార్లిన్ దర్శకత్వం వహించారు. దీని స్క్రీన్‌ప్లే అలన్ ఆర్. కోహెన్, అలన్ ఫ్రీడ్‌ల్యాండ్ రాశారు. కథను బ్రయాన్ బెర్టినో అందించారు. ఈ సినిమాలో మడెలైన్ పెట్ష్, ఫ్రాయ్ గుటిరెజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఒక జంట రోడ్ ట్రిప్‌లో ఉన్నప్పుడు, అక్కడ వారు ముగ్గురు ముసుగు ధరించిన సైకోపాత్‌ల దాడికి గురవుతారు.ఈ దాడిలో వాళ్ళు తీవ్రంగా గాయపడతారు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
ఒక అడవిలో జెఫ్ మోరెల్ అనే వ్యక్తిని, ముగ్గురు ముసుగు ధరించిన వాళ్ళు దాడి చేస్తారు. ఆ సైకోల చేతుల్లో జెఫ్ హత్యకు గురవుతాడు. ఆ తర్వాత, కథ మాయా, ర్యాన్ అనే జంటపై తిరుగుతుంది. వీరు తమ ఐదవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ, మాయా ఉద్యోగ ఇంటర్వ్యూ కోసం పోర్ట్‌ల్యాండ్‌కు కారులో ప్రయాణిస్తుంటారు. దారిలో వారి కారు పాడైపోతుంది. వాళ్ళు రాత్రి గడపడానికి ఒక అరుణోదయ కాబిన్‌లో ఆశ్రయం పొందుతారు. రాత్రి సమయంలో, మాయా ఒంటరిగా ఉన్నప్పుడు, ఒక యువతి తలుపు తట్టి తమరా ఇక్కడ ఉందా? అని అడుగుతుంది. ఇది ఒక భయానక పరిస్థితిని సృష్టిస్తుంది. ర్యాన్ తన ఇన్‌హేలర్‌ను తీసుకురావడానికి కారు వద్దకు వెళ్తాడు. ఆ సమయంలో మాయా కాబిన్‌లో ఒంటరిగా ఉంటుంది. ఆమె స్నానం చేస్తున్నప్పుడు, ఒకతను ఆమెను గమనిస్తాడు. అప్పుడే విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. మాయా ఒక డాల్‌ఫేస్‌ను చూసి భయపడి ఒక క్లోసెట్‌లో దాక్కుంటుంది. ర్యాన్ తిరిగి వచ్చిన తరువాత ఆమె భయాన్ని అతను హెల్యూసినేషన్‌గా భావిస్తాడు. ఆ తరువాత వారు భోజనం చేస్తున్నప్పుడు, ఒక చనిపోయిన కోడి రక్తం కారుతూ కనిపిస్తుంది. ఇది వారిని మరింత భయపెడుతుంది.
అప్పుడే ముగ్గురు స్ట్రేంజర్స్ ఇంట్లోకి చొరబడతారు.అప్పుడు మాయా, ర్యాన్ తమను తాము రక్షించుకోవడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళకు ఒక గన్ దొరుకుతుంది. కానీ ర్యాన్ ఒక స్ట్రేంజర్‌ను కాల్చినప్పుడు, అది ఇంటి యజమాని జో అని తెలుస్తుంది. ఈ గందరగోళంలో, స్ట్రేంజర్స్ వారిపై దాడి చేస్తారు. అక్కడ ర్యాన్ కాలు చిక్కుకోవడంతో, మాయాను పారిపోమని చెబుతాడు.చివరిలో మాయాను వాళ్ళు స్పృహ తప్పేలా చేసి, ఆమెను ఒక కుర్చీకి కట్టేస్తారు. ర్యాన్ పై కూడా దాడి చేసి కట్టేస్తారు. ఈ స్ట్రేంజర్స్ వారిని కత్తులతో పొడుస్తారు. వాళ్ళు మీరు ఎందుకు దాడి చేస్తున్నారని అడిగినప్పుడు, మీరు ఇక్కడ ఉన్నందుకు అని బదులిస్తారు. అక్కడి నుంచి, స్ట్రేంజర్స్ వెళ్లిపోయిన తర్వాత, మాయా తీవ్రగాయాలతో కట్లు విడదీసి, ర్యాన్‌ను విడిపించడానికి ప్రయత్నిస్తుంది. కానీ అతను చనిపోయినట్లు కనిపిస్తాడు. ఆమె రోడ్డుపైకి చేరుకుని సహాయం కోసం అరుస్తుంది. రోడ్డుపై వెళ్తున్న ఒక ట్రక్ డ్రైవర్ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్తాడు.చివరికి మాయా, ర్యాన్ ప్రాణాలతో ఉంటారా ? ఆ ముగ్గురు సైకోలు ఎవరు ? ఎందుకు చంపుతున్నారు ? ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మూవీని చూడండి.