Raj Kesi Reddy: రాజ్ కేసిరెడ్డిని ఏపీ సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆయనను సిట్ అదుపులోకి తీసుకుంది. దుబాయ్ నుంచి హైదరాబాద్ కు కేసీరెడ్డి చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
రాజ్ కేసిరెడ్డిని ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి పోలీసులు విజయవాడకు తరలిస్తున్నారు. రేపు విచారణకు హాజరు అవుతానని కేసీరెడ్డి ఇప్పటికి సిట్ కు సమాచారం ఇచ్చారు. అయితే ఏపీ లిక్కర్ స్కాం కేసులో రాజ్ కేసీరెడ్డి కీలక పాత్ర అని ప్రధానంగా ఆరోపిస్తుంది.
Also Read: Apsrtc Tirumala Darshan: ఆర్టీసీ ద్వారా కూడా తిరుమల దర్శనం టికెట్లు బుక్ చేసుకోవచ్చా? అదెలా?
ఏపీ లిక్కర్ స్కాం కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ.. గతంలోనే రాజ్ కేసీ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఈ రోజు విచారణ చేపట్టిన హైకోర్టు అందుకు అంగీకరించలేదు. తదుపరి విచారణను వారం రోజుల పాటు వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది. ఈ క్రమంలోనే రాజ్ కేసీరెడ్డి ఈ రోజు రేపు విచారణకు హాజరు అవుతానని మధ్యాహ్నం సమాచారం కూడా ఇచ్చారు. అంతలోనే కేసి రెడ్డిని ఏపీ సిట్ పోలీస్ అధికారులు శంషాబాద్ ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయనను విజయవాడకు తరలిస్తున్నారు.
Also Read: Pawan Kalyan: మొత్తానికి కనికరించిన పవన్ కళ్యాణ్.. ‘ఓజీ’కి మంచి రోజులు వచ్చినట్టే.!