OTT Movie : 2024 కొత్త సినిమాల జోరు కొనసాగింది. హాలీవుడ్ నుంచి మసఫా, వెనం లాంటి సినిమాలు థియేటర్లలో సందడి చేశాయి. అయితే గత ఏడాది సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ ఒకటి, థియేటర్లలో పాజిటివ్ టాక్ తో ఎంటర్టైన్ చేసింది. అందానికి బానిస అయితే ఎంత ప్రమాదకరమో ఈ మూవీ చూస్తే తెలుస్తుంది. ఈ మూవీ ఏ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది? పేరు ఏమిటి? వివరాల్లోకి వెళితే….
రెండు ఓటిటిలలో
ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది సబ్స్టేన్స్‘ (The Substance). అందం కోసం పాకులాడే ఒక సెలబ్రిటీ, కొన్ని ఇంజక్షన్ల ద్వారా తన బాడీని యవ్వనంగా మార్చుకుంటుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలు దారుణంగా ఉంటాయి. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) ఆపిల్ టీవీ (Apple TV) లలో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
ఎలిజబెత్ ఒక ప్రముఖ టీవీ షోలో హోస్ట్ గా వ్యవహరిస్తూ ఉంటుంది. ఈమె అందానికి ఆ టీవీ షో చాలా సంవత్సరాలు నడుస్తుంది. వయసు 50 సంవత్సరాలు దాటడంతో ఆమెలో అందం తగ్గిపోతుంది. ఆ తర్వాత రెడ్ కార్పెట్ వేసి జేజేలు కొట్టిన వ్యక్తులు, ఆమెను టీవీ షో నుంచి తప్పిస్తారు. ఆ తర్వాత కొత్త అందమైన అమ్మాయి కోసం వెతుకుతారు. ఎలిజబెత్ కి ఈ విషయాలు చాలా బాధ కలిగిస్తాయి. మరొకసారి టీవీ యాజమాన్యంతో మాట్లాడినా ప్రయోజనం లేకుండా పోతుంది. ఆ విషయం ఆలోచిస్తూ కారులో వెళ్తూ ఉంటుంది. ఆమె పోస్టర్స్ ని కూడా అక్కడ తొలగిస్తూ ఉంటారు. ఇది చూస్తూ ఉండగా ఆమెకు యాక్సిడెంట్ అవుతుంది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటుండగా, ఆమె డ్రెస్ లో ఒక పెన్ డ్రైవ్ లాంటిది దొరుకుతుంది. అందులో అందంగా ఉండాలంటే సైంటిఫిక్ ద్వారా కొన్ని ప్రయోగాలు ఉంటాయి. ఒక ఇంజక్షన్ వేసుకుంటే ఆమె శరీరంలో నుంచి అందమైన కొత్త శరీరం తయారవుతుంది. ఎలిజిబెత్ ఆ కిట్ తెప్పించుకుంటుంది. ఆ ఇంజక్షన్ వేసుకోవడంతో ఆమె శరీరంలో వెన్నెముక నుంచి ఒక కొత్త శరీరం వస్తుంది. ఆ కొత్త రూపం చాలా చాలా అందంగా ఉంటుంది.
అయితే పాత శరీరంలో నుంచి ఒక శిరం కొత్త శరీరానికి అవసరమవుతుంది. ఈ ప్రాసెస్ వారానికి ఒకసారి జరగాలి. పాత శరీరాన్ని ఇంట్లోనే ఒక చోట భద్రపరుస్తుంది. కొత్త శరీరంతో అదే కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తుంది. అందరూ ఆమె అందానికి పరవశించిపోతారు. మరో మాట లేకుండా ఆమెను హోస్ట్ గా తీసుకుంటారు. అయితే అందం మత్తులో పడిపోయిన ఎలిజబెత్, పాత శరీరం నుంచి శిరం తీసుకోవడం మర్చిపోతుంది. ఆ తర్వాత ఈమె శరీరంలో కొన్ని మార్పులు వస్తాయి. చివరికి ఈమె శాశ్వతంగా అందగత్తెగా ఉంటుందా? ముసలి రూపం మళ్లీ వస్తుందా? టీవీ షో నిర్వాహకులకు ఈ విషయాలు తెలుస్తాయా? చివరికి ఎలిజబెత్ ఏమవుతుంది? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న, ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.