E-Paper
Advertisement

Sangeetha Vijay Thalapathy : విడాకుల కోసం కోర్టు మెట్లేక్కిన సంగీత బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా..?

Sangeetha Vijay Thalapathy : విడాకుల కోసం కోర్టు మెట్లేక్కిన సంగీత బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా..?
Advertisement

Sangeetha Vijay Thalapathy : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి భార్య సంగీత విడాకులు కోరుతూ కోర్టు మెట్లు ఎక్కిన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం ఇది సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.. పాతికేళ్లు కాపురం చేసిన భర్తతో ఇప్పుడు విడాకులు తీసుకోవడం ఏంటి అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.. అయితే నటితో తన భర్తకు అక్రమ సంబంధం ఉంది అన్న కారణంతో ఆమె విడాకులు కోరుతున్నట్లు ప్రస్తుతం వినిపిస్తున్న వార్త. అయితే అందుకు కారణం కూడా లేకపోలేదు.. గత కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఆ వార్తల్లో నిజం ఉందని తెలుస్తుంది.. విజయ్ భార్య సంగీత గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి.. అసలు ఎవరి సంగీత..? ఎందుకు తన భర్తతో విడాకులు తీసుకుంటుంది..? బ్యాక్ గ్రౌండ్ ఏంటో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

విజయ్ కు మరో టెన్షన్..

కోలీవుడ్ స్టార్ హీరో, టీవీకే అధినేత విజయ్ దళపతి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో సినిమాలతో ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు.. కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత నుంచి ఇప్పటివరకు వరుసగా సినిమాల చేస్తూ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాడు. తమిళంలో మాత్రమే కాదు అది తెలుగులో కూడా ఆయనకు మంచి మార్కెట్ ఉంది.. విజయ్ ఇటీవల రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. అయితే చివరిగా విజయ్ నటించిన జన నాయగన్ మూవీ రిలీజ్ కు నోచుకోలేదు.. ప్రస్తుతం అతని చుట్టూ రోజుకొక వివాదం తలెత్తుతూ వస్తుంది.. ఇప్పుడు ఆయన భార్య విడాకులు కోరుతూ కోర్టు మెట్లు ఎక్కింది.. ఆయన భార్య పేరు సంగీత.. ఒక్కసారిగా ఆమె విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించడంతో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది.. ఇండస్ట్రీలో ఈ విషయంపై పలు చర్చలు కూడా జరుగుతున్నాయి.. సంగీత బ్యాగ్రౌండ్ గురించి తెలుసుకోవాలని నెటిజెన్లు గూగుల్లో తెగ వెతికిస్తున్నారు..

Advertisement

Also Read :అడ్డంగా ఇరుక్కున్న చక్రీ.. మహాకు నిజం చెప్పేసిన మాధవ్.. శైలజ ప్లాన్ వర్కౌట్..?

సంగీత బ్యాగ్రౌండ్ ఏంటంటే..? 

విజయ్ భార్య పూర్తి పేరు సంగీత స్వర్ణలింగం.. లండన్ లో స్థిరపడిన శ్రీలంక తమిళ పారిశ్రామికవేత్త కుమార్తె. 1996లో వచ్చిన ‘పూవే ఉనక్కాగా’ సినిమా చూసి ఆమె విజయ్‌కు వీరాభిమానిగా మారింది. ఆ మూవీ తర్వాత ఆమె అతనికి ఎన్నో లేఖలు రాసింది. కేవలం విజయ్‌ను కలవడం కోసమే ఆమె లండన్ నుంచి చెన్నై వచ్చింది. షూటింగ్ సెట్‌లో విజయ్‌ను కలిసి అభినందనలు తెలిపిన ఆమె పద్ధతి బాగా నచ్చడంతో విజయ్ తన తల్లిదండ్రులకు ఆమెను ఇంటికి తీసుకువెళ్లి పరిచయం చేశాడు. ఆ తర్వాత వాళ్ళ ప్రేమకు పునాది పడింది.. అజిత్ భార్య శాలిని వంటి వారితో ఆమెకు మంచి అనుబంధం ఉంది. ప్రస్తుతం లండన్‌లో ఉంటూ తన కుటుంబ వ్యాపారాలను చూసుకుంటూ బిజీగా ఉంటుంది. ఆమెకు దాదాపు 400 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు ఇటీవల ఓ వార్తాపత్రికలో వచ్చింది.. అన్ని కోట్ల ఆస్తి ఉన్న ఆమె విజయ్ తో విడాకులు కోరుతూ కోర్టు మెట్లు ఎక్కడంతో ఇప్పుడు ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ విడాకుల వ్యవహారంపై విజయ్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి..

Related News

M.S. సుబ్బులక్ష్మిగా రష్మిక.. అఫీషియల్ అనౌన్స్మెంట్!

బాలీవుడ్ లో సంచలనం.. కియారా – సిద్ధార్థ్ విడాకులా?

సాంప్రదాయబద్ధంగా సమంత  సీమంతపు వేడుక వైరల్ అవుతున్న ఫోటోలు!

నటుడిగా మెప్పించి ‘నాగపూర్ పవిత్ర”టేక్డీ గణపతి ఆఫ్ నాగపూర్’ పుస్తకంతో రచయితగా మారుతున్న హీరో సూర్య తేజ్

పావలా శ్యామల కుమార్తె విషయంలో ‘మా’ కీలక నిర్ణయం!

నా ముందే ఆటిట్యూడ్‌తో తిరుగుతున్నావ్.. శోభితపై చైతూ ఓపెన్ కామెంట్స్.. వీడియో చూశారా?

ఆకట్టుకుంటున్న రాగ్ మయూర్ ‘అనుమాన పక్షి’ ట్రైలర్!

హీరో అజిత్ కు  కారు గిఫ్ట్ గా ఇచ్చిన సీఎం విజయ్.. లవ్లీ బ్రదర్ అంటూ!

Big Stories

Advertisement
×