E-Paper
Advertisement

విశ్వాన్ని మింగేసే బ్లాక్ హోల్… ప్లంబర్ స్పేస్ అడ్వెంచర్ తెలుగులోనే

విశ్వాన్ని మింగేసే బ్లాక్ హోల్… ప్లంబర్ స్పేస్ అడ్వెంచర్ తెలుగులోనే
Advertisement

Family Adventure Movie on OTT : ప్రపంచవ్యాప్తంగా గేమింగ్ అభిమానులను అలరించిన మారియో ఫ్రాంచైజీ మరోసారి భారీ యానిమేటెడ్ అడ్వెంచర్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘ది సూపర్ మారియో గెలాక్సీ మూవీ’ (The Super Mario Galaxy Movie) ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.8,460 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇప్పుడు ఈ విజువల్ వండర్ తెలుగు ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి వచ్చింది. స్పేస్ అడ్వెంచర్, యాక్షన్, కామెడీ, ఎమోషన్స్ కలిసిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు మారియో అభిమానులకు పూర్తి స్థాయి ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుంది. మరి ఈ సూపర్ హిట్ అడ్వెంచర్ థ్రిల్లర్ ను ఏ ఓటీటీలో చూడవచ్చు ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

2023లో విడుదలైన ‘ది సూపర్ మారియో బ్రదర్స్ మూవీ’కి కొనసాగింపుగా ఈ కథ సాగుతుంది. గత భాగంలో మారియో ప్రిన్సెస్ పీచ్‌ను కాపాడి, విలన్ బౌజర్‌ ను ఓడించి జైలుకు పంపిస్తాడు. దీంతో మష్రూమ్ కింగ్‌డమ్‌లో మళ్లీ ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. కానీ ఆ ప్రశాంతత ఎక్కువ కాలం నిలవదు.

Advertisement

తన తండ్రి బౌజర్‌ను విడుదల చేసి, తమ కుటుంబ సామ్రాజ్యాన్ని తిరిగి దక్కించుకోవాలనే లక్ష్యంతో బౌజర్ జూనియర్ రంగంలోకి దిగుతాడు. సాధారణ దాడులతో మారియోను ఓడించడం సాధ్యం కాదని గ్రహించిన అతడు, విశ్వాన్నే నాశనం చేసే అపార శక్తి కలిగిన ఒక రహస్య ఆయుధాన్ని చేజిక్కించుకుంటాడు. దాని సహాయంతో గెలాక్సీలోని అనేక ప్రపంచాలను ఒక్కొక్కటిగా ధ్వంసం చేయడం ప్రారంభిస్తాడు.

ఈ విధ్వంసాన్ని అడ్డుకునే శక్తి కలిగిన ప్రిన్సెస్ రొసాలినాను కూడా బౌజర్ జూనియర్ బంధిస్తాడు. దీంతో మొత్తం గెలాక్సీ ప్రమాదంలో పడుతుంది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు మారియో, అతని సోదరుడు లుయిగి, ప్రిన్సెస్ పీచ్, కొత్త స్నేహితుడు యోషి కలిసి ఒక అద్భుతమైన అంతరిక్ష యాత్రను ప్రారంభిస్తారు.

Advertisement

వారి ప్రయాణంలో గురుత్వాకర్షణ లేని వింత గ్రహాలు, భారీ బ్లాక్ హోల్స్, ప్రమాదకరమైన జీవులు, ఊహించని ఉచ్చులు ఎదురవుతాయి. ప్రతి కొత్త ప్రపంచం కొత్త సవాళ్లను విసురుతుండగా, మారియో తన తెలివితేటలు, ధైర్యంతో వాటిని అధిగమిస్తూ ముందుకు సాగుతాడు. మరోవైపు బౌజర్ జూనియర్ తన తండ్రిని విడిపించేందుకు మరింత ప్రమాదకరమైన ప్లాన్స్ అమలు చేస్తుంటాడు.

చివరికి మారియో బృందం బౌజర్ జూనియర్‌ను ఎలా అడ్డుకుంది ? ప్రిన్సెస్ రొసాలినాను ఎలా రక్షించింది ? విశ్వాన్ని వినాశనం నుంచి ఎలా కాపాడింది ? అన్నదే ఈ భారీ యానిమేటెడ్ అడ్వెంచర్ మూవీ అసలు కథ.

తెలుగులోనే స్ట్రీమింగ్

ఈ సినిమా ప్రధాన బలం అద్భుతమైన యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, స్పేస్ అడ్వెంచర్, ఫాస్ట్ పేస్డ్ యాక్షన్. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకునే కామెడీ, ఎమోషనల్ మూమెంట్స్, రంగురంగుల ప్రపంచాలు ఈ చిత్రాన్ని పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలబెడతాయి. ముఖ్యంగా మారియో వీడియో గేమ్స్ అభిమానులకు ఈ సినిమా ఒక విజువల్ ఫీస్ట్‌లా అనిపిస్తుంది. ‘ది సూపర్ మారియో గెలాక్సీ మూవీ’ ప్రస్తుతం JioHotstar ఓటీటీ వేదికగా తెలుగు, హిందీ, తమిళం, ఇంగ్లీష్ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారు అదనపు ఛార్జీలు లేకుండా ఈ సినిమాను వీక్షించవచ్చు. అలాగే Amazon Prime Videoలో రూ.119 రెంట్‌కు, Apple TVలో రూ.149 రెంట్‌ చెల్లించి ఈ చిత్రాన్ని వీక్షించే అవకాశం కూడా అందుబాటులో ఉంది. అద్భుతమైన యానిమేషన్, స్పేస్ అడ్వెంచర్, ఫన్నీ క్యారెక్టర్లు, విజువల్ వండర్స్‌తో నిండిన ‘ది సూపర్ మారియో గెలాక్సీ మూవీ’ ఈ వీకెండ్ ఫ్యామిలీతో కలిసి చూసేందుకు పర్ఫెక్ట్ ఎంటర్‌టైనర్. ముఖ్యంగా తెలుగు డబ్బింగ్‌తో అందుబాటులోకి రావడం భారతీయ ప్రేక్షకులకు మరింత ప్లస్ పాయింట్. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ బ్లాక్‌బస్టర్‌ను ఓటీటీలో మిస్ కాకుండా చూడండి.

Read Also: ఒక్క ఫేక్ వీడియోతో కూలిపోయిన కుటుంబం.. షాక్ ఇచ్చే గ్రిప్పింగ్ సైబర్ ఓటీటీ సిరీస్

Tags

Related News

తరతరాలుగా వెంటాడే శాపం… ఆ ఇంటి తలుపు తెరిచిన క్షణం నుంచే అసలు హారర్

కార్గిల్ వార్ నుంచి రొమాంటిక్ లవ్ స్టోరీ వరకు… ఒక్క ఓటీటీలోకి మూడు కొత్త సినిమాలు

సాతాను పేరు చెప్పి సరదాగా మొదలు పెడితే ఊరంతా నరకం… 8 ఎపిసోడ్ల హారర్ థ్రిల్లర్

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీ వినోదం .. ఏకంగా 17 సినిమాలు స్ట్రీమింగ్..!

చనిపోయిన వాళ్లు అర్ధరాత్రి మీటింగ్ పెడితే… ‘స్ట్రేంజర్ థింగ్స్’లాంటి మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్

విజయ్ ‘ జననాయగన్ ‘ ఓటీటీ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

డెలివరీకి ముందు రాత్రే గర్భిణిపై సైకో దాడి… క్లైమాక్స్ చూస్తే గుండె ఆగిపోతుంది

Big Stories

Advertisement
×