BigTV English

OTT Movie : వరుసగా పిల్లలు మిస్సింగ్… సోల్ ఈటర్ పేరుతో సైకో అరాచకం… నరాలు కట్ అయ్యే సస్పెన్స్

OTT Movie : వరుసగా పిల్లలు మిస్సింగ్… సోల్ ఈటర్ పేరుతో సైకో అరాచకం… నరాలు కట్ అయ్యే సస్పెన్స్
Advertisement

OTT Movie : సైకో కిల్లర్స్ ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు. అందుకే ఇలాంటి స్టోరిలతో ఎన్ని సినిమాలు వచ్చినా బోర్ కొట్టవు. పైగా ఓటీటీ మూవీ లవర్స్ ఫేవరేట్ జానర్స్ లో ఇది కూడా ఒకటి. అలాంటి సినిమాల కోసం ఓటీటీలో వెతుకుతున్నారా? అయితే ఈ మూవీ మీ కోసమే. ఆ మూవీ పేరేంటి? స్టోరీ ఏంటి? అనే వివరాలపై ఓ లుక్కేద్దాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఈ మూవీ పేరు “ది సోల్ ఈటర్” (The Soul Eater), ఫ్రెంచ్ టైటిల్ “Le Mangeur d’Âmes,”. 2024లో విడుదలైన ఈ ఫ్రెంచ్ మిస్టరీ-థ్రిల్లర్ కు దర్శకులు అలెగ్జాండర్ బుస్టిలో, జూలియన్ మౌరీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అలెక్సిస్ లైప్స్కర్ 2021 నవల ఆధారంగా తెరకెక్కింది. ఫాంటాసియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైన ఈ మూవీ 2024 డిసెంబర్ 10న అమెరికన్ థియేటర్లలో విడుదలైంది.ఈ సినిమా ఒక చిన్న ఫ్రెంచ్ పర్వత గ్రామంలో జరిగే భయంకరమైన హత్యలు, పిల్లల అదృశ్యాల చుట్టూ తిరిగే కథ. ఇది స్థానిక దెయ్యం స్టోరీతో ముడిపడి ఉంటుంది.


ఈ చిత్రం హారర్ అంశాలను కలిగి ఉన్నప్పటికీ, ప్రధానంగా క్రైమ్ మిస్టరీ, థ్రిల్లర్ జానర్‌లలో తెరకెక్కింది. డార్క్ టోన్, స్లో-బర్న్ నేరేటివ్, షాకింగ్ ట్విస్ట్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ మూవీ. బుస్టిలో – మౌరీ తమ మునుపటి హారర్ చిత్రాలైన “ఇన్‌సైడ్”, “లెదర్‌ఫేస్” లాంటి రచనలకు ప్రసిద్ధి చెందినవారు. ఈ చిత్రంలో ఫ్రెంచ్ ల్యాండ్‌స్కేప్‌లను, భయంకరమైన వాతావరణాన్ని అద్భుతంగా ఉపయోగించారు. వర్జినీ లెడోయెన్ (ఎలిజబెత్ గార్డియానో), పాల్ హమీ (ఫ్రాంక్ డి రోలన్), సాండ్రిన్ బోనైర్ (డాక్టర్ కరోల్ మార్బాస్), కామెరాన్ బైన్ (ఎవాన్), మాలిక్ జిడి (ఫాబ్రిస్ గోనెట్) ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime video)లో స్ట్రీమింగ్ అవుతోంది.

కథలోకి వెళ్తే…

ఫ్రాన్స్‌లోని రోక్వెనోయిర్ అనే చిన్న, పాడుబడ్డ పర్వత గ్రామంలో ఒక క్రూరమైన హత్య, పిల్లల వరుస మిస్సింగ్స్ స్థానికులను భయాందోళనకు గురిచేస్తాయి. ఈ గ్రామం ఒక కొత్త హైవే వల్ల ఆర్థికంగా క్షీణించి, దాదాపు ఘోస్ట్ టౌన్‌గా మారింది. ఈ కథ ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు, కమాండర్ ఎలిజబెత్ గార్డియానో (వర్జినీ లెడోయెన్), నేషనల్ జెండర్మెరీ కెప్టెన్ ఫ్రాంక్ డి రోలన్ (పాల్ హమీ) చుట్టూ తిరుగుతుంది.

ఎలిజబెత్ ఒక దంపతుల దారుణ హత్యను దర్యాప్తు చేయడానికి వస్తుంది. అది మొదట హత్య-ఆత్మహత్యగా కనిపిస్తుంది. అయితే ఫ్రాంక్ గత కొన్ని సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో జరిగిన పిల్లల అదృశ్యాలను దర్యాప్తు చేస్తున్నాడు. వారి దర్యాప్తులు అనుకోకుండా కలుస్తాయి, స్థానిక లెజెండ్ అయిన “సోల్ ఈటర్” అనే కొమ్ములతో కూడిన దెయ్యం గురించిన కథలు, పిల్లల ఆత్మలను తినేస్తుందని చెప్పబడే ఒక భయంకర జీవి ఈ సంఘటనలతో ముడిపడి ఉంటుంది. స్థానిక పోలీసులు, గ్రామస్థులు వీళ్లకు సహకరించడానికి నిరాకరిస్తారు.

పైగా గ్రామంలోని శక్తివంతమైన వ్యక్తులు ఈ కేసులను మూసివేయాలని ఒత్తిడి చేస్తారు. దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ ఈ హత్యలు, అదృశ్యాలు ఒక డార్క్ వెబ్ నెట్‌వర్క్‌తో సంబంధం కలిగి ఉన్నాయని వెల్లడవుతుంది. అసలు ఈ కుట్ర వెనుక ఉన్నది ఎవరు? ఎందుకు ఇదంతా చేస్తున్నారు? పిల్లలను ఎందుకు ఎత్తుకెళ్తున్నారు? ఆ చనిపోయిన దంపతులు ఎవరు, ఆ షాకింగ్ ట్విస్ట్ ఏంటి ? చివరికి నిందితులను పెట్టుకున్నారా? అనే విషయాలను మూవీని చూసి తెలుసుకోవాలి.

Read Also : అమ్మాయిలను టచ్ చేయకుండానే అత్యంత కిరాతకంగా చంపే సైకో… ట్విస్టులతో పిచ్చెక్కించే క్రైమ్ థ్రిల్లర్

Related News

OTT Movies: దీపావళి స్పెషల్.. ఓటీటీలోకి సూపర్ హిట్ మూవీస్.. ఆ రెండు డోంట్ మిస్..

OTT Movie : అమ్మాయిలను కిడ్నాప్ చేసి ఆ పాడు పనులు… రివేంజ్ కోసం రగిలిపోయే పేరెంట్స్… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : లవర్ ఉండగా మరొకడితో ఆ పని… నరాలు జివ్వుమన్పించే సీన్లు… సింగిల్స్ కు పండగే

OTT Movie : భర్త పోగానే మరొకడితో… రిపోర్టర్ తో మిస్టీరియస్ అమ్మాయి మతిపోగోట్టే పనులు… ఈ మూవీ కుర్రాళ్లకు మాత్రమే

OTT Movie : భర్తను కట్టేసి భార్యతో అపరిచితుడి ఆటలు… ఇయర్ ఫోన్స్ మర్చిపోవద్దు మావా

OTT Movie : మంచాన పడ్డ తల్లి ఆఖరి కోరిక… కార్పొరేట్ వరల్డ్ తో కనెక్షన్… మనసును పిండేసే ఫ్యామిలీ మూవీ

OTT Movie : పాడుబడ్డ బంగ్లాలో తెగిపడే తలలు… పిల్ల కోసం తల్లి దెయ్యం రచ్చ… బుర్రపాడు చేసే బెంగాలీ హర్రర్ మూవీ

OTT Movie : మొగుడిని వదిలేసి చెఫ్ తో… ఆ సీన్లయితే అరాచకం మావా… సింగిల్ గా ఉన్నప్పుడే చూడండి

Big Stories

×