Tanveer Ahmed: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మార్చి 28వ తేదీన ప్రారంభమైన ఈ మెగా టోర్నమెంట్, ఇప్పటి వరకు 15 మ్యాచ్లను పూర్తి చేసుకుంది. ఇక ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లన్ని చాలా ఉత్కంఠ భరితంగా సాగాయి. గత వారం రోజుల నుంచి ప్రతి మ్యాచ్ చివరి బంతి వరకు కొనసాగుతోంది. అయితే ఈ నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ పై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను ఐపీఎల్ టోర్నమెంట్ టీవీలలో చూడడం లేదని పేర్కొన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ చూడాలంటే విరక్తి పుడుతుందని బాంబు పేల్చారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ రోజుకో ఆరోపణ చేస్తూ మీడియాలో నిలుస్తున్నాడు. ఇక తాజాగా ఐపీఎల్ టోర్నమెంటును కించపరుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ఎవరు కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటును చూడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఐపీఎల్ టోర్నమెంటును తాను చూడ లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు తన్వీర్ అహ్మద్. కోట్లలో జనాలు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ చూస్తారని.. కానీ తనకు మాత్రం అస్సలు నచ్చలేదని వెల్లడించారు. ఐపీఎల్ ప్రసారమయ్యే క్వాలిటీ అత్యంత దారుణంగా ఉంటుందని మండిపడ్డారు. దానికంటే గల్లి క్రికెట్ బాగా ప్రసారం చేస్తారని చురకలు అంటించారు.
కరాచీలో జరిగే చిన్న చిన్న గల్లీ మ్యాచ్లను మాత్రం నేను టీవీలలో చూస్తానని క్లారిటీ ఇచ్చారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి దగ్గర కోట్లలో డబ్బులు ఉన్నప్పటికీ కూడా, క్వాలిటీ క్రికెట్ ను అందించడంలో విఫలమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో ప్రతి మ్యాచ్ కూడా ఫిక్సింగ్ జరుగుతోందని షాకింగ్ ఆరోపణలు చేశారు. ఇలాంటి నేపథ్యంలో అలాంటి టోర్నమెంట్ చూడడం దండగా అంటూ వ్యాఖ్యానించారు. ఐపీఎల్ మ్యాచ్ పూర్తయ్యేసరికి కచ్చితంగా రెండు వివాదాస్పదమైన నిర్ణయాలు అంపైర్లు కావాలనే తీసుకుంటున్నారని మండిపడ్డారు.
అంపైర్లు డబ్బులు తీసుకొని అమ్ముడుపోతున్నారని బాంబు పేల్చారు. అయితే తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలకు ఇండియన్ క్రికెట్ అభిమానులు మాత్రం కౌంటర్ ఇస్తున్నారు. ప్రపంచంలోనే అత్యాధునిక లీగ్ ఏదైనా ఉందంటే అది కేవలం ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటూ వ్యాఖ్యనిస్తున్నారు. నీకు చేతనైతే పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్లో ఐపీఎల్ ఆడే విదేశీ క్రికెటర్లను తీసుకువెళ్ళు.. ఆ సాహసం చేసిన తర్వాత తమ ఐపిఎల్ గురించి మాట్లాడు అంటూ కౌంటర్ ఇస్తున్నారు.
Also Read: KKR VS LSG: అంతా ఫిక్సింగే..రెండు క్యాచ్ లు వివాదం, ఫిన్ అలెన్, రహానే ఇద్దరూ నాటౌటే !