CM Revanth Reddy: గుజరాత్ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఆహ్మదాబాద్ లో జరిగే రెండు రోజుల ఏఐసీసీ ప్రత్యేక కార్యక్రమాలు, సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరయ్యేందుకు సీఎం గుజరాత్ కు వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆహ్మదాబాద్ లోని సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. జాతిపిత మహాత్మ గాంధీకి ఆయన నివాళులు అర్పించారు.
భారత స్వాతంత్ర్య ఉద్యమంలో సబర్మతీ ఆశ్రమంలో మహాత్మగాంధీ గడిపిన జీవన శైలి, ఆశ్రమ విశిష్టతల గురించి సీఎం అక్కడి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. సబర్మతీ అశ్రమంలో గాంధీ వాడిన చరఖాను తిప్పి దాన్ని పరిశీలించారు. అనంతరం ఆశ్రమంలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో చూడండి.
సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
చరఖాతో నూలు నేసిన ముఖ్యమంత్రి pic.twitter.com/197JM6SHvu
— BIG TV Breaking News (@bigtvtelugu) April 8, 2025