OTT Movies : హర్రర్ సినిమాలంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. ఎంత భయం వేసినా కళ్ళు మూసుకుని, అవసరమైతే దుప్పటి కప్పుకుని మరీ భయంతో వణుకు పుట్టించే ఈ సినిమాలను చూస్తారు చాలామంది. అయితే అలాంటి వాళ్ళ కోసమే దెయ్యాలు సైతం దడుచుకునేలా చేసే టాప్ 3 బెస్ట్ హారర్ సినిమాల సజెషన్.
1. Annabelle (2014)
హాలీవుడ్ హర్రర్ సినిమాలు అంటే ముందుగా గుర్తొచ్చే సినిమా ‘అనబెల్లె’. ఈ సూపర్ నాచురల్ హర్రర్ ‘The Conjuring’ యూనివర్స్‌లో భాగం. జాన్, మియా అనే జంటపై వాళ్ళ ఇంట్లోనే సాతానిక్ కల్ట్ సభ్యుల దాడి జరుగుతుంది. తర్వాత ఒక పాత డాల్‌తో భయంకరమైన సంఘటనలను ఎదుర్కొంటారు. ఈ డాల్ లో ఒక దెయ్యం ఆత్మ ఉంటుంది. ఇక ఆ దెయ్యం ఆ జంటకు జన్మించిన బిడ్డను టార్గెట్ చేస్తుంది. నరాలు కట్ అయ్యే సస్పెన్స్ తో భయపెట్టే ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ ( Netflix), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లలో అందుబాటులో ఉంది.
2. Insidious (2010)
సూపర్ నాచురల్ హర్రర్, సైకలాజికల్ థ్రిల్లర్ జానర్ లో రూపొందిన ‘ఇన్సిడియస్’ మూవీ ఈ లిస్ట్ లో ఏకాండ ప్లేస్ లో ఉంటుంది. జేమ్స్ వాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాట్రిక్ విల్సన్, రోజ్ బైర్న్, లిన్ షే ప్రధాన పాత్రలు పోషించారు. తమ కొడుకు డాల్టన్ కోమాలోకి వెళ్లిన తర్వాత లాంబెర్ట్ కుటుంబం భయంకరమైన స్థితిలో చిక్కుకుంటుంది. అతను “ది ఫర్దర్” అనే ఆత్మల ప్రపంచంలో చిక్కుకున్నాడని తెలుస్తుంది. అక్కడ దెయ్యాలు అతని శరీరాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తాయి. పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ ఎలిస్ సహాయంతో కుటుంబం అతన్ని రక్షించడానికి పోరాడుతుంది. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ ( Netflix), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది. Insidious: The Red Door సీక్వెల్ కూడా ఓటీటీలో అందుబాటులో ఉంది.
Read Also : ఈ సినిమా చూశాక సముద్రం అంటేనే చెమటలు… మస్ట్ వాచ్ సీ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్
3. Veronica (2017)
దర్శకుడు పాకో ప్లాజా తెరకెక్కించిన సూపర్ నాచురల్ హర్రర్ మూవీ ‘వెరోనికా’. ఇది ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత “స్కేరియస్ట్ హర్రర్ మూవీ”గా వైరల్ అయింది. 1991 మాడ్రిడ్‌లో 15 ఏళ్ల అమ్మాయి వెరోనికా చనిపోయిన తన తండ్రితో మాట్లాడాలి అనుకుంటుంది. అందుకోసం ఒయిజా బోర్డ్ అనే ఒక భయంకరమైన దెయ్యాల గేమ్ ఆడుతుంది. అనుకోకుండా ఆమె ఒక దెయ్యంని ఆహ్వానిస్తుంది. అదేమో ఆమెను, ఆమె తోబుట్టువులను భయపెడుతుంది. ఈ సినిమా 1991 కేసు వల్లెకాస్ ఆధారంగా రూపొందింది. ప్రస్తుతం ఈ హర్రర్ మూవీ నెట్ ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది.