Bullet Bhaskar: బుల్లెట్ భాస్కర్ (Bullet Bhaskar).. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. జబర్దస్త్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. టీం లీడర్ గా హౌస్ లో ఇప్పటికీ కొనసాగుతున్న ఈయన.. తన టీం ద్వారా పొట్టి నరేష్ (Naresh ), ఫైమా (Faima), సునామీ సుధాకర్(Sunami Sudhakar) ఇలా ఎంతో మందిని ఇండస్ట్రీకి పరిచయం చేసి, వారికంటూ ఒక గుర్తింపును అందించారు. ఎక్కడో వైజాగ్ లో ఆర్జేగా పని చేసిన బుల్లెట్ భాస్కర్.. ఫేమ్ కోసం కుటుంబంతో సహా హైదరాబాద్ కి వచ్చేసి అక్కడి నుంచే జబర్దస్త్ ప్రయాణం మొదలుపెట్టారు. మొదట హౌస్ లో అడుగుపెట్టినప్పుడు లేడి కంటెస్టెంట్ గా పాత్రలు చేసి అందర్నీ ఆకట్టుకున్న ఈయన.. ఆ తర్వాత తన టాలెంట్ ను నిరూపించుకుంటూ టీమ్ లీడర్ గా పేరు దక్కించుకున్నారు.
నరేష్ పక్కా కమర్షియల్ – బుల్లెట్ భాస్కర్
ఇక ఇప్పుడు జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో పాటిస్పేట్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న భాస్కర్.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని.. కమెడియన్ పొట్టి నరేష్ గురించి చేసిన కామెంట్లు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ ప్రశ్నిస్తూ నరేష్ కి ఈమధ్య ఏమైంది..? వరుసగా అవకాశాలు వస్తున్న కారణంగానే ఆయనలో ఇంత మార్పు ఏమైనా వచ్చిందా..? పలకరించినా పెద్దగా పట్టించుకోవడం లేదు ఏంటి ..? అని ప్రశ్నించగా.. బుల్లెట్ భాస్కర్ సమాధానం చెబుతూ..” నిజం చెప్పాలి అంటే నరేష్ పక్కా కమర్షియల్. మా తాత చనిపోయాడు రమ్మని ఫోన్ చేసినా సరే అన్న పెట్రోల్ ఖర్చులకి ₹1000 ఫోన్ పే చెయ్ అని అడిగే రకం వాడు. ఒకవేళ మనం వాడిని భోజనానికి మన ఇంటికి పిలిచినా సరే రూ.500 వాడికి పెట్రోల్ ఖర్చులకు ఇవ్వాలి. అంత కమర్షియల్.. ఒకరకంగా చెప్పాలి అంటే డబ్బు విషయంలో వాడిని చూసి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఏ విషయంలోనైనా కాంప్రమైజ్ అవుతారేమో కానీ డబ్బు విషయంలో మాత్రం నరేష్ అస్సలు కాంప్రమైజ్ అవ్వడు..ఆ కారణంగానే అందరికీ అలా అనిపిస్తాడు” అంటూ బుల్లెట్ భాస్కర్ నరేష్ గురించి చెప్పుకొచ్చారు. మొత్తానికైతే నరేష్ గురించి ఈ విషయాలు తెలిసి.. మరీ ఇంత కమర్షియల్ అయితే ఎలా గురు అంటే కూడా కామెంట్లు చేస్తున్నారు.
బుల్లెట్ భాస్కర్ కెరియర్..
ఇక బుల్లెట్ భాస్కర్ విషయానికి వస్తే.. ఈ మధ్యకాలంలో సినిమాలలో కూడా కమెడియన్ గా నటించడం కోసం పలు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే పలువురు స్టార్ హీరోల సినిమాలలో కామెడీ పాత్రలతో అలరిస్తున్న ఈయన.. ఎప్పటికైనా పాన్ ఇండియా చిత్రాలలో తనకు అవకాశం రావాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా ఇంట్రెస్ట్ లేకపోయినా ఇండస్ట్రీలో కొచ్చి ఇప్పుడు తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్న బుల్లెట్ భాస్కర్ త్వరలోనే ఆ స్థాయిని చేరుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ALSO READ:Hero Ajith : హీరో అజిత్ కి మళ్లీ గాయాలు.. ఈ సారి ఏకంగా హాస్పిటల్ లో చేరిక..!